100% found this document useful (1 vote)
823 views18 pages

BrahmaSutras SriChalapathiraoGuruji

BrahmaSutras_SriChalapathiraoGuruji

Uploaded by

PRASAD S
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd

You are on page 1/ 18

www.srichalapathirao.

com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

బ్రహ్మసూత్రములు
- వేదవ్యాస మహ్ర్షి

: వ్యాఖ్యాత :
'అభినవ వ్యాస' 'జ్ఞాన ప్రపూర్ణ'
శ్రీ దేవిశెట్టి చలపతిరావు B.Sc (Ag)
వ్ావ్స్ధ
ా పకులు

ఆధ్యాతిమక జ్ఞాన పీఠం : : చిలకలూర్షపేట

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
1
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

బ్రహ్మసూత్రములు
అధ్యాయములు - 4
ఒక్కొక్ొ అధ్యాయములో పాదాలు - 4 (4x4 = 16 పాదాలు)

బ్రహ్మసూత్రములు - అనేది వేదాాంత మీమాంసాశాస్త్రాం

వేదాాంతాం అాంటే వేదాలకు అాంతాంలోని ఉపనిషత్తులు

మీమాంస అాంటే పరిశీలన చేయుట
దీనికే ఉతుర మీమాంస అనే పేరాంది

సూత్ర రూపాంలో ఉననదీ గ్రాంధాం. సూత్రాం అాంటే –

శ్లో ॥ అల్పాక్షర మసాందిగ్ధాం సారవద్ విశ్వతో ముఖాం ।

అస్తుభమనవద్ాాంచ సూత్రాం సూత్రవిదోవిదుః ॥

తా ॥ క్కదిి అక్షరాలు క్లిగి, అనుమనానికి తావులేని అరధాం క్లిగి, సారవాంతమై,

బహుముఖమై, ఆకారాంలో చిననదై, ఏ విధమైన దోషమూలేని వాకాానిన సూత్రాం అాంటార

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
2
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

బ్రహ్మసూత్రములు
తొలిపలుకు
ఈ లోక్ాంలో జనిమాంచిన ప్రతి జీవి, ప్రతి ప్రాణి తాను ఎల్ప సుఖాంగా జీవిాంచాల్ప ?
అని ఆలోచిసుుాంది. అాందకు అనుగుణాంగా ప్రవరిుసుుాంది. ఇక్ మనవుడు బుదిధజీవి గ్నుక్
బుదిధతో ఎన్నన విషయాలను తెలివితో ఆలోచిసాుడు. క్కతు క్కతు ప్రయోగాలు
చేసుుాంటాడు. నిరాంతరాం అనేవషిసూు ఉాంటాడు. బాగా సుఖసాంతోషాలను పాందేవారిని
చూచి అనుక్రిసాుడు. ఇల్ప నిరాంతరాం మనవుడు చేసే ప్రయతనాంలో అతడికి అనేక్మైన
ఆలోచనలు వసుుాంటాయి.

1. నేనెవరిని ?
2. ఈ ప్రపాంచాం ఏమిటి ?
3. దీనిని ఎవర సృషిటాంచార ?
4. ఈ గ్రహాలు, ఉపగ్రహాలు ఒక్ క్రమ పద్ధతిలో తిరగుత్తనానయే ! ఎవర త్రిప్పాత్తనానర
? ఎక్ొడ కూర్చొని త్రిప్పాత్తనానర ?
5. ఈ జీవుళ్ళన్నన ఎక్ొడి నుాండి వసుునానయి ?
6. మరణిాంచి ఎక్ొడికి పోత్తనానయి ?
7. ఈ భూలోక్ాంల్పగా సవరగలోక్ాం - నరక్లోక్ాం అాంటూ ఇాంకా లోకాలునానయా
? ఉాంటే అవి ఎక్ొడునానయి?
8. అసలు ఈ జీవుళ్ళళ ప్పటటటమాందకు ?

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
3
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

9. అసలు ఈ సృషిటని ఎవర చేసుునానర ? ఎాందకు చేసుునానర ?

10. ఈ లోక్ాంలో జనిమాంచిన మనవులు చేయవలసిన పని ఏమిటి ? సాధాంచవలసిన
లక్షయమేమిటి ?

ఇల్ప ఎన్నన ఆలోచనలు మనవునిలో మదలుతూ ఉాంటాయి. వీటికి

సమధ్యనాంగానే తతువశాస్త్రాం ప్పటిటాంది. వేదాలు - ఉపనిషత్తులు ప్పటాటయి. అవే ఈ
ప్రశ్నలకు సమధ్యనాం ఇవవవలసి ఉాంటాంది.

అనేక్మాంది తతువవేతులు అనేక్ రకాల ఆలోచనలు చేసి వారివారి అభిప్రాయాలను

వెలోడిాంచార. మనవునిలో క్లిగే జిజ్ఞాసకు - వారి సాందేహాలకు సమధ్యనాం
ఇవవటానికి ప్రయతినాంచార. ఉపనిషత్తులలో ఈ విధమైన చరొలు, ప్రతిపాద్నలు
క్నిపిసుునానయి. ఉపనిషత్తులనేవి నిజ్ఞనికి ఒక్ దేశానికి, ఒక్ జ్ఞతికి, ఒక్ మతానికి, ఒక్
కాల్పనికి పరిమితమైనవి కావు. అవి ఈ విశ్వాం మొతాునికి, అనిన కాల్పలకు
పరమసతాానిన చాటిచెపిాన వేదాాంతశాసాాలు. భారతీయులైన ఋషిప్పాంగ్వులు
ప్రగాఢధ్యానాంలో ద్రిశాంచిన పరమసతాానిన వెలోడిాంచినవి ఈ ఉపనిషత్తులు. ఎన్నన వేల
సాంవతసరాల నుాండి ఆటపోటలకు తటటక్కని నిలిచిన వేదాాంతశాసాాలే ఈ ఉపనిషత్తులు.

ఐతే కాలాం గ్డిచిన క్కదీి ఈ ఉపనిషత్తులకు అరధాం చెపాటాంలో అభిప్రాయ భేదాలు

ప్రారాంభమైనవి. దానితో ఈ ఉపనిషత్తులను ప్పరసొరిాంచుక్కని వేరవేర మతాలు,
వాదాలు బయలుదేరాయి. ఎవరికి తోచిన అరధాం, ఎవరికి అనుకూలమైన అరధాం వార
క్లిాాంచుకునానర. అల్ప వచిొనవే ద్వవతాం, విశిషాటద్వవతాం, అద్వవతాం, ద్వవతాద్వవతాం,
శైవవిశిషాటద్వవతాం, వీరశైవవిశిషాటద్వవతాం, శుదాధద్వవతాం,... అాంటూ ఎన్నన మతాలు.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
4
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

ఇవన్నన ప్రజలోో అనైక్ాతను పాంచాయి. పరమరధాం ప్రక్ొకు నెటటబడి పాాండితాాం

ముాందక్కచిొాంది. ఫలితాంగా సామనా మనవునికి ఈ ఉపనిషత్తులు మరగాం
చూపలేక్పోత్తనానయి. ఇాందవలో జ్ఞతికి గొపా నషటాం క్లిగిాంది.

అాంతేకాద ఈ ఉపనిషత్తులు అనేక్ాంగా ఉనానయి. నాలుగు వేదాలలోను 1180

ఉపనిషత్తులునానయి. ఋగేవద్ాంలో 21, యజుర్వవద్ాంలో 109, సామవేద్ాంలో 1000,
అధరవణ వేద్ాంలో 50 శాఖలునానయి. మొతుాం 1180 శాఖలు; 1180
ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులలో ఒక్ దానిలో చెపిాన విషయానికి విరద్ధాంగా మర్చక్
ఉపనిషత్తులో ఉననటో క్నిపిసుుాంది. వీటిని సమనవయము చేయలేక్, చేయక్ - ఎవరికి
అనుకూలమైన భావానిన వార తీసుక్కని వాాఖ్యానిాంచటాం వలో గ్జిబిజి ఏరాడిాంది.

ఇల్పాంటి పరిసిధత్తలలో దావపరయుగ్ాం చివరలో వేద్వాాసమహ్రిి ఈ ఉపనిషత్తుల

అరాధనిన సరైన పద్ధతిలో గ్రహాంచేటటో చేయటానికి ఈ ఉపనిషత్తు మాంత్రాలను
సమనవయము చేసూు ఈ బ్రహ్మసూత్ర రచన చేయుట జరిగిాంది. దీనితో వైరధ్యాలన్నన
తొలగి ఏక్ వాక్ాత క్లుగుత్తాంద్ని ఆ మహ్రిి భావిాంచార.

అయితే ఈ సూత్రాలపై కూడా వేర వేర భాషాాలు వచిొనవి. ఇపాటికీ వసూునే

ఉనానయి. అయితే శ్ాంక్రల భాషామే అతాధకులు అాంగీక్రిసుునన భాషాాం. ఆయనే
మొద్టివార. ఆయనకు పరమ గురవైన గౌడపాదలు తన మాండుక్ా కారిక్లలో
అద్వవతానికి ప్పనాది వేయటాం జరిగిాంది. ఆ ప్పనాది మీద్నే శ్ాంక్రాచారాల అద్వవత
భాషామనే భవనాం నిలిచిఉననది. దీనిని బటిట శ్ాంక్రనికి పూరవమే అద్వవతాం వాాపిులో
ఉననది. క్నుక్ అద్వవతానికి ఆదాడు శ్ాంక్రలు కాద. ఆయన అద్వవతానిన వాాపిాంపజేసిన
మహాత్తమడు మత్రమే.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
5
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

ఇక గ్రంధ విషయం గుర్షంచి

ఈ గ్రాంధాం జీవుడికి - బ్రహ్మమునకు భేద్ాం లేద. ఇద్ిర ఒక్ొటే అని చెపాటానికి

కావలసిన విచారణ చేయబడిాంది. ఉపనిషత్తులన్నన ఈ జీవబ్రహ్వమక్ాతనే చెబుత్తనానయి

ఈ జనన-మరణరూప సాంసారబాంధనాల నుాండి పూరిుగా విముకిు చెాంద్టమే

మనవుడి పరమలక్షయాం అని బోధాంచటమే ఈ గ్రాంధ ఉదేిశ్ాం. అల్ప విడుద్ల
పాందాలాంటే జీవుడు బ్రహ్మమే అనే జ్ఞానాం క్లగాలి. ఈ జ్ఞానాం క్లగ్టానికి అడుుగా
ఉననదే అవిద్ా. దీనికే అజ్ఞానాం, మిధ్యా జ్ఞానాం, మిధా, భ్రమ, భ్రాంతి అనే పేరోనానయి.
అవిద్ాకే అధ్యాస అనే మర్చక్ పేరాంది.

త్రాడును చూచి పాము అని భ్రమ పడతాాం. త్రాడు సతాాం. పాము అసతాాం. ఈ
భ్రమనే అధ్యాస అనానర. అాంటే ఒక్ దానిని చూచి మర్చక్ దానిగా భ్రమ పడటమే
అధ్యాస. పరమతమను ప్రపాంచాంగా, ఆతమను జీవుడిగా భ్రమ పడుత్తనానాం. ఈ భ్రమ
తొలగితేనే ఉనన దానిని ఉననటో తెలుసుకోగ్లుగుతాాం. భ్రమ ఉననాంత కాలాం
దుఃఖాం తపాద.

ఆతమనైన నేను ఆతమనని మరచి, జీవుణిి అని భ్రమ పడినాందనే - అధ్యాస వలోనే నా
భారా, నా ఇలుో, నా క్కడుకు, నా కూత్తర, నా డబుు, నా పలాం అనే భావాం
క్లుగుత్తననది. అాందవలో దుఃఖ నివృతిు కావాలాంటే అధ్యాస తొలగాలి. దానికి ఆతమ
విచారణయే ఏకైక్ మరగాం. ఈ విచారణ క్కరకే ఈ బ్రహ్మసూత్రాలు.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
6
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

మొదటి సూత
ర ం

సూత్రాం : అధ్యతో బ్రహ్మ జిజ్ఞాసా (1)

అధ = పిమమట, ఆ తరవాత
అతుః = అాందవలో, కాబటిట
బ్రహ్మ జిజ్ఞాసా = బ్రహ్మమును తెలుసుకోవాలనే కోరిక్.

భావాం : (సాధనచత్తషటయ సిదిధాంచిన) తరవాత (క్రమఫలాం అనితామైనద్ని, జ్ఞాన

ఫలమైన మోక్షాం నితామని తెలిసినది) కాబటిట, మోక్షారిధయైనవాడు బ్రహామనిన
తెలుసుకోవాలనే కోరిక్తో ఉాంటాడు – ఉాండాలి.

వాాఖా : ఈ సూత్రాంలో అధ - అతుః బ్రహ్మ జిజ్ఞాస అనే 3 పదాలునానయి. ముాంద ఈ

పదాలను విశ్లోషణ చేదాిాం.

I. అధ :- అధ అనేది మాంగ్ళ్వాచక్ాం. ఏ శాస్త్ర గ్రాంధ్యనెవననా ప్రారాంభిాంచేటప్పాడు

మాంగ్ళ్క్రమైన శ్బిాంతో ప్రారాంభిాంచటాం శాస్త్రసాాంప్రదాయాం. అాందకే ఈ
బ్రహ్మసూత్రాలను అధ అనే మాంగ్ళ్వాచక్ాంతో ప్రారాంభిసుునానడు వాాసుడు.
పూరవమీమాంస అనబడే ధరమసూత్రాలను కూడా 'అధ' తోనే ప్రారాంభిాంచార. అల్పగే
అనేక్ ఉపనిషత్తులను కూడా 'అధ'శ్బిాంతో ప్రారాంభిాంచటాం జరిగిాంది. అధ అశ్వల్పయన్న
భగ్వాంతాం ....(కైవలా). ఇక్ భగ్వదీగత కూడా నిజమైన ప్రారాంభాం 'అధవావసిధతాన్
ద్ృషాటవ ధ్యరురాషాాన్ క్పిధవజ' తోనే ప్రారాంభాం అాంటార. క్నుక్ ఇది కూడా అధతో
ప్రారాంభమైాంది. ఇల్ప అనేక్ శాసాాలు 'అధ' అనే మాంగ్ళ్ వాచక్ాంతో ప్రారాంభమైనవి.
మరిక్కనిన శాసాాలు 'ఓాం' అనే మాంగ్ళ్ వాచక్ాంతో ప్రారాంభమైనవి.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
7
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

అధ అాంటే తరవాత అని అరధాం చెప్పాకునానాం. దేని తరవాత? - అనే ప్రశ్న

వసుుాంది. 'సాధనచత్తషటయ సాంపద్ పాందిన తరవాత' అని గ్రహాంచాలి.

సాధనచత్తషటయాం అాంటే ఏమిటి? 4 సాధనాలు అని.

(1) నితాానితావసుు వివేక్ాం:- నితామైన వసుువేది? అనితామైన వసుువు ఏది? అనే జ్ఞానాం
ఉాండాలి. నిజాంగా ఈ లోక్ాంలోని వసుువులన్నన అనితామైనవే. భగ్వాంత్తడొక్ొడే నితాాం.
అాందకే "నితా వసేువక్ాం బ్రహ్మ తద్ వాతిరిక్ుాం సరవాం అనితాాం" అని తతువబోధలో
తెలియజేశార శ్ాంక్రాచారాలవార. నితా జీవితాంలో మనాం ప్రతి విషయాంలోను ఇది
నితామ? అనితామ? అని ప్రశినాంచుకుాంటూ ఉాంటే సమసుము అనితామేనని
తెలుసుుాంది. అల్పాంటి భావన మనలో వృదిధ చెాందతూ ఉాంటే ప్రయోజనాం ఏమిటి?

(2) ఇహా మాంత్రారధ ఫలభోగ్ విరాగ్ాం :- ఈ లోకానికి సాంబాంధాంచిన భారా, భరు, బిడులు,
ధనాం, ఇళ్ళళ, వాకిళ్ళళ, వసుువులు, బాంగారాం, ల్పభాం, నషటాం మొ॥న సమసు
విషయాలయాంద వైరాగ్ాాం క్లుగుత్తాంది. అాంతేగాద మరణానాంతరాం పైలోకాల
యాంద లభిాంచే సవరగభోగాల యాందగాని, తరవాత జనమలలో క్లిగే సుఖభోగాల
యాందగాని ఏమత్రాం ఆసకిు లేకుాండా వాటిపటో కూడా వైముఖాాం -
వైరాగ్ాాం క్లుగుత్తాంది. ఈ వైరాగ్ా భావన క్లుగుత్తనన క్కదీి పరమతమపై ఆసకిు, రాగ్ాం,
ప్రేమ వృదిధ అవుత్తాంది. అయితే ఈ ప్రాపాంచిక్ విషయాల పటో వైరాగ్ాాం వివేక్ాం వలోనే
క్లగాలి తపా తాతాొలిక్ వైరాగ్ాాం వలో ప్రయోజనాం లేద. ప్పరాణవైరాగ్ాాం,
ప్రసూతివైరాగ్ాాం, సమశానవైరాగ్ాాం మొ॥నవన్నన తాతాొలిక్ాంగా క్లిగేవి. అవి ఎల్పాంటి
వారికైనా క్లుగుతాయి, తవరలోనే సమసిపోతాయి.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
8
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

(3) శ్మది షటొ సాంపతిు :-

(i). శ్మము : మన్న నిగ్రహ్ాం. ఎదరగా వసుువులునాన వాటిపై వాామోహ్ాం క్లగ్కుాండా

మనసుస వాటిని పాందాలి అనే కోరిక్ లేకుాండా మనసుస సావధీనాంలో ఉాండాలి. ఎల్ప
ఉాంటాంది మనసుస ? ఇవన్నన నాకు నిజమైన, నితామైన ఆనాందానినవవలేవు గ్నుక్, వీటి
వాామోహ్ాంలో పడిపోతే నిజమైన ఆతామనాందానిన పాంద్లేను గ్నుక్ ఇవి నాకు అవసరాం
లేద అనే నిశ్ొయ జ్ఞానాం బుదిధలో ఉాంటే మనసుస వాటిపై వాామోహ్ాం
లేకుాండా ఉాంటాంది.

(ii). ద్మము : బాహ్ాాంద్రియ నిగ్రహ్ాం. 5 క్ర్వమాంద్రియాలు, 5 జ్ఞానేాంద్రియాలు మొతుాం

10 ఇాంద్రియాలు. వీటిలో 5 జ్ఞానేాంద్రియాలు సావధీనాంలో ఉాంటే ద్మనిన సాధాంచినటేో.
క్నునచూచినవాటి వెాంటపడకుాండా, చెవి విననవాటి వెాంటపడకుాండా, ముకుొ
వాసనచూచినవాటి వెాంటపడకుాండా, చరమాం సారశ దావరా సుఖ్యనిన అాందిాంచేవాటి
వెాంటపడకుాండా, నాలుక్ రచిక్రమైన పదారాధల వెాంటపడకుాండా ఉాంటే చాలు 'ద్మాం'
అనే సాధన సాధాంచినటేో.

లేడి శ్బాినికి లాంగి , ఏనుగు సారశసుఖ్యనికి లాంగి, దీపాంప్పరగు రూపానికి

లాంగి, చేప రసానికి లాంగి, త్తమమద్ ప్పషాాలలోని మక్రాంధాం యొక్ొ రచికి లాంగి

ప్రాణాం మీద్కు తెచుొకుాంటనానయి. ఒక్కొక్ొ ఇాంద్రియానికి లాంగి అవి ప్రాణాం మీద్కు

తెచుొకుాంటాంటే 5 ఇాంద్రియాలకు లాంగే మనవుడి గ్తి ఏమిటని శ్ాంక్రాచారాలవార

వివేక్చూడామణిలో ప్రశినాంచి హ్చొరిాంచార. ఇాంద్రియదావరాల వద్ినే విషయాలను

అడుుకోగ్లికితే ఇక్ మనవుడికి అధోగ్తి అనేది ఎననడు క్లగ్ద.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
9
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

(iii). ఉపరమము : చితుచాాంచలాాం లేకుాండా ఉాండటాం. ఒక్ సిధర నిశ్ొయాంలేనివాని

చితుాం అటఇట పరగెడుతూ ఉాంటాంది దాని వలో మనసుస అలోక్లోోలాం అవుత్తాంది.

(iv). తితిక్ష : శీతోషాిలు, సుఖదుఃఖ్యలు, ల్పభనషాటలు, జయాపజయాలు,

మనావమనాలు ఎదరైనప్పాడు ఓరాతో ఉాండటాం నేరొకోవాలి. జీవితాంలో ఎదరైన
విషయాలపటో ఈ ఓరా ఉాండాలేగాని, కావాలని అటవాంటి సిిత్తలను క్లిగిాంచుకోరాద.
వేసవిలో పాంచాగినమద్ాాంలో ఉాండటాం, శీతాకాలాంలో మాంచుగ్డుపై కూర్చొవటాం…
ఇల్ప పరీక్షలు పటటక్కని ఉాండేది ఓరా కాద. ఎవరినైనా బాగా తిటటమనిచెపిా
ఒరొకోవటాం ఓరా కాద . ఎవరైనా తిటిటనప్పాడు ఓరొకోవాలి. అదే తితిక్ష. ఇది ఎల్ప
సాధాాం ? జీవితాంలో క్షాటలు - సుఖ్యలు ఒక్ దాని తరావత ఒక్టి వసాుయని, వచిొన
క్షటాం అల్పగే ఉాండద్ని గ్రహాంచి ఓరొకోవాలి. (ధరమరాజుకు శ్రీక్ృష్ణిడు ‘ఇది ఇల్పగే
ఉాండద' అని చీటీ వ్రాసి క్షాటలోోఉననప్పాడు ఈ చీటీ తెరిచి చూచుకోమనానడు.)

(v) శ్రద్ధ : గురవేదాాంత వాకాాదిష్ణ శ్రదాధ - అనానర. గురవు పటో, వేదాాంత వాకాాల
పటో విశావసానిన క్లిగి ఉాండాలి. అప్పాడే జ్ఞానాం బుదిధలో ప్రవిశిాంచేది. అాంతే కాద
భగ్వాంత్తనిపై విశావసాం కూడా ఉాండాలి. ఆసిుక్ా బుదిధ ఉాండాలి. గురవుయాంద
విశావసాం లేక్పోతే గురబోధను స్వవక్రిాంచలేడు. గురబోధను స్వవక్రిాంచ లేక్పోతే
భగ్వాంత్తని యదారధ తతువాం తెలిసే అవకాశ్ాం ఉాండద. క్నుక్ ఈ శ్రద్ధ అనేది ఏాంతో
ముఖాాం.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
10
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

(vi) సమధ్యనాం : తెలుసుకోవలసిన విషయమునాంద బుదిధని చక్ొగా నిలిపి ఉాంచటమే

సమధ్యనాం. సమధ అాంటే బుదిధని సమసిితిలో ఉాంచటాం. అల్ప ఉాంచగ్లిగితేనే
విషయాం చక్ొగా గ్రాహ్ాాం అవుత్తాంది.

ఈ ఆరిాంటిని శ్మదిషటొసాంపతిు అాంటార.

(4) ముముక్షుతవాం :- మోక్షానిన పాందాలి అనే కోరిక్. నిజ్ఞనికి దీనిని 4వ సాధనగా

చెపిానా ఇదే మొద్టిది. మనవులాంతా ఈ జీవితాం బాగుాండాలని, బాగా ధనాం

సాంపాదిాంచాలని, వసుువులు క్కనుకోొవాలని, భోగ్ాం అనుభవిాంచాలని - ఈ లోక్ాంలో

పరగులు తీసూు ఉాంటార. వారికి శాసాాలను బోధసాుమనాన, సాధనలు చేయమనన,

సతసాంగాలు జరప్పకోమనాన వారికి వినిపిాంచద. "ఉాండవయాా బాబు! వీటితో

కూరొాంటే నాకేాం వసుుాంది ? అాంటాడు. ధనాం సాంపాదిాంచే మరాగలను చెబితే

చెవులురికిొాంచుక్కని ఎాంతసేపైనా విాంటాడు కాని, మోక్షానిన సాంపాదిాంచే మరాగలను

చెబుతానాంటే ఒక్ొ నిముషాం కూడా వినడు. అల్పాంటి వానికి ఉదాధరక్ాం లేద. జనమను

సారధక్ాం చేసుకోవటాం కుద్రద. ఎవరైతే మోక్షానిన అాందకోవటమే శాశ్వత ఆనాందానిన

పాంద్టానికి మరగాం అని తెలుసుక్కని, మోక్షాం క్కరకు తీవ్రాంగా తపన చెాందతాడో

అతడికే మోక్ష మరగాం తెలుసుుాంది. క్నుక్ తీవ్ర ముముక్షుతవాం ఉాండాలి. ఇది అతాాంత

ప్రధ్యనమైనది.

ఈ సాధన చత్తషటయ సాంపద్ క్లిగినవార్వ ఉపనిషత్తులలో చెపాబడిన పరమతమ

యదారధ తతాువనిన అవగాహ్న చేసుకోగ్లర, ఆచరణలో పటటకోగ్లర.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
11
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

పూరవకాలాంలో శిష్ణాలు ఈ వేదాాంతవిద్ాను తెలుసుక్కనుటకు సదగరవులను

వెత్తకుొాంటూవెళ్లో, ఒక్ మహాత్తమని సమీపిాంచి తమకు జనమసారధక్ాహ్త్తవైన మోక్షానిన
పాంద్టానికి తగిన జ్ఞానానిన ప్రసాదిాంచి, మరాగనిన చూపమని ఆ గురవును ప్రారిధసాుర.
ఆయనకు క్కాంతకాలాం సేవచేసాుర . ఆయన వారిని క్కాంత కాలాం వేచి ఉాండమని
చెబుతాడు. ఎాందక్ాంటే వారియొక్ొ బౌదిధక్సిధతి ఏమిటో తెలుసుకోనుటకే. వారికి అనేక్
రకాల శిక్షణనిచిొ, క్కనిన పరీక్షలుపటిట, వారిలో తీవ్ర ముముక్షుతవాం ఉననదో లేదో
పరీక్షాంచి, వార అనిన అరహతలు సమీపిాంచారనే విశావసాం క్లిగిన తరావత వేదాాంత విద్ాను
బోధాంచటాం ప్రారాంభిసాుడు. ఇదే 'అధ' శ్బాిరధాం.

ప్రపాంచ విషయాలు అనితామని తెలుసుక్కని, వాటిపై వైరాగ్ాాం క్లిగి,

మన్నబుదిలను, ఇాంద్రియాలను సావధీనాంలో ఉాంచుక్కని, మోక్షాం కావాలనే తీవ్ర
తపనతో, గురవుపై విశావసాంతో ఉననప్పాడు వార అరహత పాందినటో . అల్ప అరహత
పాందిన తరవాతనే విదాాబోధన ప్రారాంభాం

ఇదీ 'అధుః' పద్ాం యొక్ొ వివరణ. ఇక్ అతుః

II. అతుః :- అతుః అాంటే అాందవలో - కాబటిట ఆ కారణాంగా - అని. ఏ కారణాంగా ?

ఎాందవలో ? అని ప్రశ్న.

"తద్ాధ ఇహ్ క్రమజితోలోక్ుః క్షీయత ఏవమేవ అముత్ర ప్పణాజితో లోక్ుః క్షీయతే "-
(ఛాందోగ్ా)

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
12
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

క్రమల దావరా మనాం సాంపాదిాంచే ధనధ్యనాాలు, వసుుసాంపద్లు అన్నన

క్షీణిాంచిపోయేవే. అల్పగే ప్పణా క్రమల వలో సాంపాదిాంచే సవరగ భోగాలు కూడా
క్షయమైపోయేవే కాబటిట -

అాంటే ఎనిన రకాల క్రమలు చేసినా, ఎాంతటి ప్పణాక్రమలు, శాస్త్రవిహతక్రమలు,

వైదిక్క్రమలు , ఏవి చేసినపాటికీ ఆ క్రమల వలో లభిాంచే ఇహ్లోక్ సుఖభోగాలుగాని,
పరలోక్ాంలోని సవరగభోగాలుగాని అన్నన క్షయమైపోయేవే గ్నుక్ – ఏాం చేయాలి ? -

"తద్ విజ్ఞానారధాం స గురమే వాభిగాఛ్చొత్ సమిత్ పాణిాం శ్రోత్రియాం బ్రహ్మనిషటాం "

- సమిధలు చేతబటటక్కని వేదాాంత విజ్ఞానానిన గ్రహాంచటానికి శ్రోత్రియుడు,

బ్రహ్మనిష్ణటడు అయిన గురవును సమీపిాంచాలి - అని ముాండకోపనిషత్తు చెబుత్తననది.

క్రమలు చేసి చేసి, క్రమల యొక్ొ ఫలితాం అశాశ్వతమైనద్ని గ్రహాంచిన సాధకుడు

- శాశ్వతమైన మోక్ష ఫల్పనిన అాందక్కనుటకు ప్రయతినాంచాలి.

ఇల్ప అధ, అతుః అనే రాండు పదాల భావాం ఏమిటాంటే సాధనచత్తషటయసాంపద్

సిదిధాంచిన తరవాత - క్రమల దావరా వచేొ ఫలాం అనితాము - అశాశ్వతము అన్న, మోక్షాం
వలో వచేొఫలాం శాశ్వత ఆనాంద్మని గ్రహాంచినాందవలో - అని. ఇప్పాడు బ్రహ్మజిజ్ఞాస-

III. బ్రహ్మజిజ్ఞాస :- బ్రహ్మప్రాపిు క్కరకు బ్రహ్మజిజ్ఞాస చేయాలి. బ్రహామనిన

తెలుసుకోవాలనే ఇచఛ - కోరిక్యే బ్రహ్మజిజ్ఞాస.

ఈ బ్రహ్మజిజ్ఞాస (తెలుసుకోవాలనే కోరిక్ ) ఎాందకు ?

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
13
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

(i) తాపత్రయనివృతిు కోసాం బ్రహ్మజిజ్ఞాస చేయాలి.

(ii) దుఃఖనివృతిు కోసాం బ్రహ్మజిజ్ఞాస చేయాలి.
(iii) మోక్షసాధన కోసాం బ్రహ్మజిజ్ఞాస చేయాలి.

తాపత్రయాలాంటే ? - ఆదిభౌతిక్, ఆదిదైవిక్, ఆధ్యాతిమక్ తాపాలు. ఈ 3 తాపాలు

దుఃఖ్యనిన క్లిగిసాుయి. ఆనాందానిన దూరాం చేసాుయి.

దుఃఖనివృతిు కోసాం లౌకిక్మైన ఉపాయాలుననయి గ్దా ! బ్రహ్మజిజ్ఞాస ఎాందకు?

ర్చగ్మొసేు వైదాలు, పేద్రిక్మైతే ధనసాంపాద్న, ఇలుో లేక్పోతే ఇలుో క్టటకోవటాం,

ముసలితనమొసేు బల్పనికి ఔషధ్యలు, ఆనాందానికి అనేక్ వసుువులు ఉనానయి గ్దా!
ఉనానయి - కాని అవి దుఃఖ్యనిన శాశ్వతాంగా తొలగిాంచలేవు. దుఃఖ్యలు పూరిుగా,
శాశ్వతాంగా తొలగిపోవాలాంటే జనమరాహతాాం - మోక్షాం ఒక్ొటే మరగాం. మర్చక్
గ్తాాంతరాం లేద. అటిట జనమరాహతాానిన - మోక్షానిన పాందాలాంటే బ్రహామతెవమక్ాజ్ఞానాం
కావాలి. బ్రహ్మమూ - నేను ఒక్ొటే అనే జ్ఞానాం కావాలి. అటిట జ్ఞానాం బ్రహ్మజిజ్ఞాస వలోనే
క్లుగుత్తాంది. అాందకే బ్రహ్మజిజ్ఞాస అవసరాం. జీవబ్రహ్వమక్ాత అనేది ఉపనిషత్తులలో
మత్రమే చెపాబడిాంది గ్నుక్ ఉపనిషత్తుల జ్ఞానాం అవసరాం. క్నుక్ ఉపనిషత్తుల విచారణ
తపాక్చేయవలసి ఉాంది. ఇదే మనవుని విధ - పవిత్ర క్రువాాం.

బ్రహ్మజిజ్ఞాస వలోనే బ్రహ్మజ్ఞానాం క్లుగుత్తాంది. బ్రహ్మజ్ఞానాం వలోనే

బ్రహ్మప్రాపిు. బ్రహ్మప్రాపిుయే మోక్షాం. అాందకే 'బ్రహ్మవిత్ బ్రహ్వమవభవతి' అని వేద్ాం
చెబుత్తననది. బ్రహ్మమునెరిగినవాడు బ్రహ్మమే అవుతాడు అని. తెలియద్గిన బ్రహ్మము,
తెలిసినవాడు రాండు ఒక్ొటే అదే తతువమసి, అయమతామ బ్రహ్మ, అహ్ాం బ్రహ్మసిమ అనే

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
14
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

శ్ృతి మహావాకాాల యొక్ొ భావాం. క్నుక్ జీవుని క్ాంటే వేరకాని బ్రహ్మమును

తెలుసుకోవాలి. అాందకు బ్రహ్మజిజ్ఞాస చేయాలి. దానితో బ్రహ్మసాక్షాతామరాం.

బ్రహ్మసాక్షాతాొరాం వలో ఈ జననమరణసాంసారానికి బీజాంగా - కారణాంగా ఉనన

అవిద్ా - అజ్ఞానాం పూరిుగా తొలగిపోత్తాంది.

పూరవ పక్షాం

బ్రహ్మజిజ్ఞాస తపాక్ చేయవలసినదే అని చెబుత్తనానర సర్వ. అసలు బ్రహ్మము ప్రసిద్ధమ?

(తెలిసినదా?) అప్రసిద్ధమ (తెలియనిదా?)

(i) బ్రహ్మము ప్రసిద్ధమే అయితే ఇక్ దానిని గూరిొ విచారణ చేయవలసిన

అవసరమేముాంది ? ఎాందక్ాంటే అది తెలిసినదే అయితే శాస్త్రాం దావరా నిరూపిాంచద్గిాంది
కాద. క్నుక్ విచారణ అనవసరాం.

(ii) బ్రహ్మము అప్రసిద్ధమే అయితే ఇక్ దానిని గూరిొ విచారణ చేసినాంద

వలో ప్రయోజనమేముాంది ? అసలు తెలియనిదాని గురిాంచి విచారణ చేయటాం ఎల్ప
కుదరత్తాంది ? విచారణ అనేది బుదిధతో చేయాలి. కాని బ్రహ్మము బుదిధ క్షేత్రాంలోనికి
రాద. అాంటే బుదిధకి అాంద్ద. క్నుక్ విచారణ అనవసరాం.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
15
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

సమధ్యనాం

బ్రహ్మము ప్రసిద్ధమే . అయితే ఇక్ొడొక్ కిటకు ఉాంది. బ్రహామనికి సాంబాంధాంచిన సామనా

జ్ఞానాం ప్రసిద్ధాం. బ్రహామనికి సాంబాంధాంచిన విశ్లషజ్ఞానాం విషయాంలో అనేక్ వివాదాలు,
అభిప్రాయ భేదాలు ఉనానయి. అాందకోసాం బ్రహ్మజిజ్ఞాస - బ్రహామనిన తెలుసుకోవాలనే
కోరిక్ సమాంజసమే.

బ్రహామనికి సాంబాంధాంచిన విశ్లషజ్ఞానాం విషయాంలో వివాదాలు ఏమిటి ?

1. చైతనాాంగ్ల దేహ్మే ఆతమ అని పామరలు, నాసిుకులు, చారావకులు అాంటనానర.

2. మరిక్కాంద్ర చేతనాలుగా క్నిపిాంచే ఇాంద్రియాలే ఆతమ అాంటనానర.
3. క్కాంద్ర ఇాంద్రియాలను ప్రేర్వపిాంచి, వాటిచేత పనులు చేయిాంచే మనసేస ఆతమ
అాంటార.
4. ఇాంకా క్కాంద్ర బుదేి ఆతమ అాంటార. వీర బౌద్ధాంలోని ఒక్ శాఖవార
(యోగాచారలు).
5. బౌద్ధాంలోని శూనావాదలు (మధామిక్ శాఖవార) శూనాాం తపా ఏమీలేద - అదే
బ్రహ్మాం అాంటార.
6. దేహ్ాంద్రియాలకు భిననమైన క్రు, భోక్ు అయిన వాడొక్డునానడని, అతడే ఆతమ అని
వైశ్లషికులు అాంటార.
7. దేహాదలక్నాన వేరైన ఆతమ కేవలాం భోక్ుయే తపా క్రు కాద అని సాంఖ్యాలు అాంటార.
8 . భోక్ు క్నాన వేరగా ఉనన సరవజుాడు, సరవ శ్కిుమాంత్తడు అయిన ఈశ్వరడునానడని
యోగులు అాంటూ ఉాంటార.
9. ఇక్ వేదాాంతమతానిన అనుసరిాంచేవార అవిద్ాతో, ఉపాధకూడిన క్రు, భోక్ు అయిన
జీవాతమను (జీవునిన ) తత్ పద్ాంతో చెపాబడే ఈశ్వరనిగా నిరియిసుునానర,

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
16
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

నిరూపిసుునానర. జీవుడు ఈశ్వరని క్నాన వేర కాద్ని శ్ృతి వాకాాలు చెబుత్తనానయి

గ్నుక్ జీవుడు - ఈశ్వరడు ఒక్ొర్వ అని చెబుత్తనానర.

ఇవి కాకుాండా ఇాంకా అనేక్ మాంది, అనేక్ రకాలుగా ఏవేవో చెబుత్తనానర.

ఇల్పాంటి సిధతిలో ఏమి చేయాలో, దేనిని నమమలో తెలియక్ తిక్మక్

పడుత్తాంటార. చివరకు విసుగుతో ఆ( ఎవరికి నచిొన సిదాధాంతానిన వార
నముమకుాంటార, దానేన అనుసరిసాుర. ఇాంకా ఈ బ్రహ్మవిచారణ - బ్రహ్మజిజ్ఞాస
ఎాందకు ? అనవసరాంగా బుర్రబద్ిలు చేసుకోవటాం ఎాందకు ? అనుకుాంటార.

అల్ప వదిలేసేు సరిపోత్తాందా ? లేద. ఎాందకు ? మనకు వేద్శాసాాలు

(ఉపనిషత్తులు) ప్రమణాలు. ఇక్ ఈ ప్రపాంచాం - ఈ జనమ - ఇవన్నన దుఃఖాంతో
కూడుకుననవి. మళ్ళళ మళ్ళళ జన్మల వలో అనాంతమైన దుఃఖ్యలు. జనమ - జరా - వాాధ -
మరణ దుఃఖ్యలు తపావు. క్నుక్ జననమరణ రహతమైన మోక్షాం ఒక్ొటే ఈ దుఃఖ్యలను
తరిాంచటానికి ఉపాయాం. అటిట మోక్షాం ఎల్ప లభిసుుాంది ? అనే విషయాంలో పైన చెపాబడు
మతాలూ చాల్ప వరకు మౌనాం వహసుునానయి. లేదా అతక్ని మటలు - 'ఆకుకు
అాంద్క్ - పోక్కు పాంద్క్’ అననటో చెబుత్తనానయి.

ఈ కారణాం వలో మోక్షాం పాందాలి అాంటే బ్రహ్మజిజ్ఞాస తపానిసరి.

'జ్ఞానా దేవత్త కైవలాాం' - జ్ఞానాం వలోనే కైవలాాం (మోక్షాం) "తతువ జ్ఞానా దేవానిుః శ్రేయ
సాధగ్ముః" - జీవబ్రహ్వమక్ాాం వలోనే మోక్షాం లభిసుుాంది - అనేది వేదాలలోని -
ఉపనిషత్తులలోని సారభూతమైన సిదాధాంతాం.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
17
www.srichalapathirao.com ఆధ్యాత్మికజ్ఞానపీఠం

'జీవో బ్రహ్వమవ నా పరుః' - జీవుడు బ్రహ్మముద్పా మర్వమీ కాద - అనే వేదాాంత

సిదాధాంతానిన వదిలి ముముక్షువులైనవార ఇతర మతాలను (అభిప్రాయాలను)
అనుసరిాంచినటోయితే మోక్షానిన ఎపాటికీ పాంద్లేర గాక్ పాంద్లేర. క్నుక్నే బ్రహ్మ
విషయక్ విచారణ - బ్రహ్మజిజ్ఞాస తపాక్ చేయవలసిాందే.

ఇదీ 'అధ్య2తో బ్రహ్మ జిజ్ఞాస' అనే సుత్రారధాం. సాధన చత్తషటయమనే అరహతను

సాంపాదిాంచిన తరవాత; క్రమల దావరా వచేొ ఫలితాం అనితామైనది గ్నుక్. (ఈ
లోక్ాంలోగాని, పై లోకాలోో గాని క్లిగేభోగాలు) అాందవలో జ్ఞాన ఫలమైన మోక్షాం
మత్రమే నితామైన ఆనాందానిన - బ్రహామనాందానిన ఇసుుాంద్ని తెలిసిన ముముక్షువు తపాక్
బ్రహ్మజిజ్ఞాస చేయాలి. వేదాాంత వాకాారధ విచారణ చేయాలి.

అాందకే ఈ బ్రహ్మ సూత్ర రచన.

To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com

Email : [email protected] Ph : +91 9886265225 / +91 8008539770
18

You might also like