100% found this document useful (1 vote)
2K views2 pages

చంద్రుడు జ్యోతిషం - వికీపీడియా

Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
100% found this document useful (1 vote)
2K views2 pages

చంద్రుడు జ్యోతిషం - వికీపీడియా

Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
You are on page 1/ 2

6/22/2021 చంద్రుడు జ్యో తిషం - వికీపీడియా

చంద్రుడు జ్యో తిషం


వికీపీడియా నుండి
ఈ వ్యా సాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు.

సరయిన మూలాలను చేర్చి వ్యా సాన్ని మెరుగు పరచండి (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%82%E


0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81_%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E
0%B1%8B%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B7%E0%B0%82&action=edit). ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని
చూడండి (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B
1%81%E0%B0%A1%E0%B1%81_%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A4%E0%B0%BF%E0%B
0%B7%E0%B0%82&action=talk).

చంద్రుడు జ్యో తిష శాస్త్రంలో మనస్సు కు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వే త వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు
డెబ్బై సంవత్స రాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మ ములు. ఋతువులలో వర్ష
ఋతువును, లోహములలో వెండిని, రత్న ములలో ముత్య మును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బ లం కలిగి
ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వ గుణ సంపన్ను డైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష
పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి
వరకు మధ్య మ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రావణ నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో
మగవారి ఎడమ కన్ను , స్త్రీల కుడి కన్ను శరీర మధ్య భాగమును సూచించును. చంద్రుడు కర్కా టక రాశికి ఆధిపత్యం
వహిస్తా డు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు
డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చి కంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు,
చంద్రుడు
సూర్యు డు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు.

చంద్రకళలకు కారణం ఏమిటి? చాలా మందికి ఈ విషయంలో గందరగోళం ఉంది. సూర్యు ని కాంతి చంద్రుని ఉపరితలం
(lunar surface) మీద పడడం వల్లే వెన్నె ల  వస్తుందని, వెన్నె ల ద్వా రానే చంద్రుడు కనిపిస్తా డని అందరూ ఏకీభవిస్తా రు. అంతవరకు కరెక్టే. కానీ చంద్రునిపై పడే
కాంతిని సరిగా పడనీయకుండా భూమి అడ్డు రావడం వల్లే చంద్రకళలు ఏర్ప డతాయని కొందరి భావం. ఇది పూర్తిగా తప్పు . అలా జరిగితే ఆ స్థితిని చంద్రగ్రహణం
(Lunar eclipse) అంటారు గాని చంద్రకళలు అనరు.

మరి కొందరు మరో భావం చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో వివిధ ప్రాంతాల్లో వివిధ తీవ్రతల్లో (intensity), వివిధ వైశాల్యా లలో సౌరకాంతి 
పడడం వల్ల చందకళలు వస్తా యనుకుంటారు. ఇదికూడా తప్పు . మరో వాదన కూడా ఉంది. చంద్రుడు తను చుట్టూ తాను ఒకేసారి నెలలో తిరుగుతాడు కాబట్టి
చంద్రుడి ఒక సగభాగం మీదే సౌరకాంతి పడుతుందని మన భూమి కూడా సూర్యు ని చుట్టూ తిరిగే క్రమంలో ఆ వెలుగే చంద్రభాగాన్ని వివిధ కోణాల్లో చూస్తాం కాబట్టి
చంద్రకళలు వస్తా యనుకుంటారు. ఇది కూడా తప్పే .

అసలు విషయం ఏమిటంటే చంద్రుడు నెలకు ఒ మారు భూమి చుట్టూ తిరగడం, తన చుట్టూ తాను తిరగడం చేస్తా డు. కాబట్టి చంద్రుని ఒ అర్థభాగమే దాదాపు
లక్షలాది సంవత్స రాలుగా భూమివైపు ఉంటోంది. భూమి చంద్రుని సాపేక్షస్థితిలో సూర్యు ని పరంగా వివిద భంగిమల్లో ఉండడం వల్ల సౌరకాంతి చంద్రుని ఒ
అర్థభాగం మీద పడినా మన వైపున్న అర్థభాగంలో అమావాస్య తర్వా త పెరిగే క్రమంలోనూ, పౌర్ణమి తర్వా త క్రమంలోనూ కమబడుతుంది. మిగిలిన భాగం మనకు
కనిపించని భాగంలో ఉంది.

విషయ సూచిక
చంద్రుని ప్రభావం
చంద్రుని కారకత్వా లు
రూపురేఖలు
చంద్రుడు రాశులు
ద్వా దశస్థా నములు, చంద్రుడు
మూలాలు
వెలుపలి లింకులు

చంద్రుని ప్రభావం

చంద్ర ప్రభావిత వ్య క్తు లు శ్లేష్మ మ వ్యా ధి పీడితులుగా ఉంటారు. వీరు కొంత సమయం ఉత్సా హంతోనూ మరి కొంత సమయం నిరుత్సా హంగానూ ఉంటారు. కొంత
కాలం ధైర్య ము మరి కొంత కాలం భయం కలిగి ఉంటారు. కొంత కాలం ధనవంతులుగా మరి కొంతకాలం ధనహీనులుగా ఉంటారు. స్థూ లంగా మానసిక స్థితి, సందలు
అస్థిరంగా ఉంటాయి. అభిప్రాయాలూ తరచూమార్చు కుంటారు. మిత్రులనూ తరచూ మార్చు కుంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. ఆ కారణంగా యుక్త వయసు
దాటే సమయానికి పొట్ట పెద్దది అయ్యే అవకాశం ఎక్కు వ. స్వ తంత్రించి ఏకార్యం చెయ్య లేరు. నీటి పారుదల, జల విద్యు త్, ప్రజా ప్రాతినిధ్యం, బియ్య ము,
వస్త్రములకు సంబంధించిన వృత్తులలో రాణిస్తా రు. పాండు రోగం, క్షయ, మధుమేహం, శ్వా శకోశ వ్యా ధులు వచ్చే అవకాశం ఎక్కు వ.

చంద్రుని కారకత్వా లు

చంద్రుడు తల్లికి, జలరాంతాలు, జలం, పూలు, సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చందుడు కాకత్వం
వహిస్తా డు. వృత్తి సంబంధంగా నౌకా వ్యా పారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు, చేపల పెంపకం, వెండి, మత్య ములకు కారకత్వం వహిస్తా డు. వ్యా ధులలో రక్త
హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యా ధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యా ధులు, ఉదర సంబంధిత వ్యా ధులు, కేన్స ర్ (రాచ పుండు) మొదలైన వాటికి
కారకుడు, ఆహార సంబంధంగా చెరకు, తేనె, పాలు, పెరుగు, భోజనము, గోధుమలు, జొన్న లు, రొట్టెలు, గోధుమలు, చేపలు, పంచదార, అరటి పండు, నెయ్యి ,
దోసకాయలు, తమలపాకులు, గుమ్మ డి, క్యా బేజి, కర్బూ జా ఫలం, కుక్క గొడుగులు, ఆవులు, గుడ్లు తాబేలు, గుడ్లగూబ, బాతు, గబ్బి లం, పిల్లి, నీటి గుర్రం, సొర చేపల
వంటి ప్రాణులకు కారకత్వం వహిస్తా డు., తిమింగలం మొదలైన ప్రాణులకు కారకత్వం వహిస్తా డు. గుడ్లు, క్క ర్పూ రం, నికెల్, జర్మ న్ సిల్వ ర్ లాంటి వస్తువులకు
కారకత్వం వహిస్తా డు. సంగీతం, నాటం, కవిత్వం లాంటి లలిత కళలకు కారకత్వం వహిస్తా డు. మనస్తత్వ శాస్త్రం పఠనం, వ్య వసాయం, విద్యా సంబంధిత వృత్తులు,
జల వనరులవంటి వృత్తులకు కారకత్వం వహిస్తా డు. మూలికలు, స్త్రీలు, జీర్ణ వ్య వస్థ, జున్ను చంద్రుడు కారకత్వం వహించే ఇతరాలు.

https://te.wikipedia.org/wiki/చంద్రుడు_జ్యో తిషం 1/2


6/22/2021 చంద్రుడు జ్యో తిషం - వికీపీడియా
రూపురేఖలు

పురాణ కథనం అనుసరించి చంద్రుడు గౌరవర్ణం కలిగిన వాడు. శ్వే త వస్త్ర ధారణ చేయువాడు. శ్వే త వర్ణ ఆభరణములతో అలంకరించబడిన వాడు. రెండు
భుజములతో, శిరస్సు న
బంగారు కిరీటము ధరించి మెడలో ముత్యా ల మాలను ధరించి ఒక చేత గద, ఒకచేత వరద ముద్రతో దర్శ నం ఇస్తా డు. దశాశ్వ ములను
పూన్చి న రథమును అధిరోహించి సంచరిస్తా డు.

చంద్రుడు రాశులు
చంద్రుడు కర్కా టకంలో స్వ క్షేత్రంలోనూ వృషభంలో మూడు డిగ్రీల వద్ద ఉచ్ఛ స్థితిలోనూ, వృశ్చి కంలోని మూడు డిగ్రీల వద్ద నీచస్థితిలోనూ ఉంటాడు. చంద్రుడికి
శత్రువులు లేరు అలాగే శత్రు క్షేత్రం లేదు. చంద్రుడికి మిధునం, కన్య , సింహములు మిత్ర క్షేత్రములు. వృషభం త్రికోణ స్థా నం. శుక్ర, శనులు సములు. కుంభం,
మకరం, తులా రాశులు సమ రాశులు.

ద్వా దశస్థా నములు, చంద్రుడు


లగ్నంలో చంద్రుడు ఉన్న జాతకుడు దృఢశరీరము కలిగిన వాడు, చిరంజీవి, నిర్భ యుడు, ధనవంతుడు ఔతాడు. క్షీణచంద్రుడు ఉన్న ప్పు డు ఫలితాలు
తారుమారుగా ఉంటాయి.
చంద్రుడు ద్వి తీయంలో ఉన్న వాడు ధనవంతుడు, విద్యా వంతుడు, మృదుభాషి, అంగలోపం కలవాడుగా ఉంటాడు.
తృతీయ స్థా నంలో చంద్రుడు కలిగి ఉన్న జాతకుడు సోదరులు కలవాడు, బలవంతుడు, శౌర్య వంతుడు, స్త్రీలను ఆకర్షించు వాడు ఔతాడు. బహుకష్టములను
పొందుతాడు.
చతుర్ధస్థా నమున ఉన్న జాతకుడు సుఖజీవి, భోగముల యందు ఆసక్తు డు, మిత్రులు కలవాడు, వాహనములు కలవాడు, కీర్తివంతుడు ఔతాడు.
పంచమ స్థా నమున చంద్రుడు ఉన్న జాతకుడు మేధాసంపద, సుపుత్రులు కలవాడు, ఠీవి కలవాడు, మంత్రిపదవి అలంకరించు వాడు ఔతాడు.
షష్టమ స్థా నమున చంద్రుడు ఉన్న జాతకుడు అల్ప జీవి, అమాయకుడు, ఉదరశూల (కడుపు నొప్పి ) కలిగిన వాడు, దీనుడు ఔతాడు.
సప్తమ స్థా నమున చంద్రుడు ఉన్న జాతకుడు సౌమ్య వంతుడు, అందమైన యువతుల హృదయమున స్థా నము కలిగిన వాడు, సుందరుడు అయి సుంర
కళత్రము కలిగి ఉంటాడు.
అష్టమ స్థా నమున చంద్రుడు కలిగిన జాతకుడు రోగపీడితుడు, అల్పా యుష్మంతుడు ఔతాడు. క్షీణ చంద్రుడు అయిన ఫలితములలో మార్పు లు ఉంటాయి.
నవమ భావమున చంద్రుడు ఉన్న జాతకుడు అభివృద్ధి, పవిత్రుడు, పుత్ర సంతానం కలిగిన వాడు, విజయము, కార్యం ఆరంభించగానే శుభఫలితములను
కలిగి ఉంటాడు. వీశాలహృదయము సహాయగుణము కలిగి ఉంటాడు.
దశమస్థా నమున చంద్రుడు ఉన్న జాతకుడు ఔషధ సంబంధిత వృత్తి వ్యా పారాలు కలిగిన వాడు ఔతాడు.
ఏకాశ స్థా నమున చంద్రుడు ఉన్న జాతకుడు విశాలహృదయం, చిరంజివి, ధనవంతుడు ఔతాడు.
ద్వా దశ స్థా నమున చంద్రుడు ఉన్న జాతకుడు ద్వే షము కలవాడు, దుఃఖములు, క్లేశం, అవమానం, నిరుత్సా హం పొందుతూ ఉంటాడు.

మూలాలు

వెలుపలి లింకులు
నవగ్రహాలు
v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%A8%E0%B0%B5%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%

v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%82_%E0%B0%

తెలుగు పంచాంగం
v · t · e (https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%8

"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రుడు_జ్యో తిషం&oldid=3079227" నుండి వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 23 డిసెంబరు 2020న 16:39కు జరిగింది.

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూ షన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం;


అదనపు షరతులు వర్తించవచ్చు .
మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.

https://te.wikipedia.org/wiki/చంద్రుడు_జ్యో తిషం 2/2

You might also like