0% found this document useful (0 votes)
1K views7 pages

వాస్తు శాస్త్రం - వికీపీడియా

Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
0% found this document useful (0 votes)
1K views7 pages

వాస్తు శాస్త్రం - వికీపీడియా

Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
You are on page 1/ 7

వాస్తు పద మండలం

32 రకాల చతురస్రా కారపు వాస్తు పద మండలంలో ముఖ్యమైనవి 64 గడులు (8X8) , 81 గడుల (9 X9), 100
గడులు (10 X10) తో ఉన్నవి. ఆ భూతం భూమిపై(మండలం) ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున
పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి
లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.వీటిలో పవళించిన వాస్తు పురుషుని పై ఉన్న పదదేవతలు[2]

పద దేవతలు

శిరస్సున - శిఖి(ఈశ)

దక్షిణ నేత్రమున - సర్జన్య

వామనేత్రమున - దితి

దక్షిణ శోత్రమున - జయంతి

వాస్థు పదవిన్యాసం - గృహ అమిరిక

వామ శోత్రమున - జయంతి

ఉరస్సున (వక్షమున) - ఇంద్ర, అపవత్స, అప, సర్ప


దక్షిణ స్తనమున - అర్యమా

వామ స్తనమున - పృధ్వీధర

దక్షిణ భుజమున - ఆదిత్య

వామ భుజమున - సోమ

దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా

వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లా ట

దక్షిణ పార్శ్వమున - వితధి, గృహక్షత

వామ పార్శ్వకామున - అసుర, శేష

ఉదరమున - వినస్వాన్, మిత్ర

దక్షిణ ఊరువున - యమ

వామ ఊరువున - వరుణ

గుహ్యమున - ఇంద్ర జయ

దక్షిణ జంఘమున - గంధర్వ

వామ జంఘమున - పుష్పదంత

దక్షిణ జానువున - భృంగరాజ

వామ జానువున - సుగ్రీవ

దక్షిణ స్పిచి - మృగబు

వామ స్పిచి - దౌవారిక

పాదములయందు - పితృగణము

కేంద్రము (మధ్యబాగం) - బ్రహ్మ

ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన


బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడు'గా సృష్టి గావించాడు.

అష్ట దిక్పాలకులు
ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు[2]:

ఈశాన్యము - ఈశానుడు

తూర్పు - ఇంద్రు డు-

ఆగ్నేయము - అగ్ని

దక్షిణం - యముడు

నైఋతి - పిత్రు /నైరుత్య,

పడమర - వరుణుడు

వాయువ్యం - వాయు

ఉత్తరము - కుబేరుడు

పంచ భూతాలు
భూమి

జలం

అగ్ని

వాయు

ఆకాశం

వాస్తు శాస్త్ర గ్రంధాలు

మనసార శిల్ప శాస్త్రము (రచన : మనసారా),

మాయామతం (రచన : మాయా),

విశ్వకర్మ వాస్తు శాస్త్రము (రచన : విశ్వకర్మ),

అర్ధ శాస్త్రం

సమారంగణ సూత్రధార (రచన : రాజా భోజ),

అపరాజిత పృచ్చ (విశ్వకర్మ అతని కుమారుడు అపరాజిత మధ్య సంవాదము, రచన భువనదేవాచార్య)

మానుషాలయ చంద్రిక

శిల్పరత్నం

పురాణాలలో-మత్స్య, అగ్ని, విష్ణు ధర్మొత్తరం, భవిష్య పురాణాలలో వాస్తు ప్రకరణలు ఉన్నాయి.


సంహితా గ్రంధాలు ;బృహత్సహిత,గార్గసంహత,కాశ్యప సంహిత

ఆగమ గ్రంధాలు:శైవాగమాలు,వైష్ణవాగమాలు

ప్ర ధాన వస్తు వులు

ఆనాటి నిర్మాణాలలో రాతి శిలలు, ఇటుక, కలప ప్రధాన మైన వస్తు వులు. బంక మన్ను, సున్నం వంటి వాటితో
నిర్మాణాలు చేసేవారు. ఆనాటి వాస్తు ననుసరించి నిర్మించిన దేవాలయాలను, కోటలను ఇప్పటికి మనం చూడవచ్చు.

చైనా వాస్తు శాస్త్రం - పెంగ్ షూయ్

చైనా భాషలో ఫెంగ్ -అంటే గాలి, షుయి - అంటే నీరు అని అర్థం. ఫెంగ్ షుయ్ అనే ఈ మార్మిక కళను జియోమెన్సీ
అనికూడా పిలుస్తా రు. జియోమెన్సీ అంటే భూమిపై ఉండే దైవిక చిత్రా లు. చైనా,థాయిలాండ్ దేశాలలో శుభాశుభాల
పోకడలను సూచించే ఒక తాంత్రిక విద్యగా ప్రా చీన కాలం నుండి కొనసాగుతూ వస్తుంది.  మనిషి మనుగడకు గాలి,
నీరుకు ఉన్న ప్రా ముఖ్యతను గుర్తించి వాటిని నివాసానికి  ఎలా వర్తింపజేయాలనే సూత్రా న్ని ఆధారం చేసుకొని,
యాంగ్-యాన్ అనే తాత్విక సృష్టి సిద్ధాంతాన్ని మేళవించి  ఆధునీకరించి రూపొందించినదే ఈ చైనా దేశవాళీ వాస్తు [3].

అన్ని ప్రా చీన సమాజాలలో ప్రకృతిని అర్ధం చేసుకునే తీరులో అనేక ఊహాకల్పనలు ఉద్బవించాయి. అలాంటి వాటిలో
ప్రా చీన చైనావాసుల ఊహా కల్పనలకు ఒక చక్కని రూపమే ఈ వాస్తు మర్మకళ.

ఈనాడు ఇది రకరకాల పోకడలతో క్రొ త్త పుంతలు త్రొ క్కుతూ ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తూ ఒక గాలి ధుమారం వలె
మన దేశంలోకి దిగుమతి అయింది. దినికి మన భారతీయ వాస్తు కు అసలు సంభంధమే లేదు.

వాస్తు దోషాలకు రకరకాల వాస్తు పూజలు, శాంతులు, వాస్తు


తాయెత్తు లు(మత్స్యయంత్రా లు,కుబేర,లక్ష్మీ...యంత్రా లు), నరదృష్టికి  దిష్టి పిడతలు/బొమ్మలు, గుమ్మడికాయలు,
భూత, ప్రేత భయాలకు  నిమ్మకాయలు, చెప్పులు, వెంట్రు కలు, మిరపకాయలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకొనే మన
ప్రా చీన దేశీవాళి చిట్కా పద్దతుల స్థా నే ఇప్పుడు ఆకర్షణీయమైన చైనా దేశపు చిట్కాలు, చిత్రా లు, చిందులు ఫెంగ్ -
షుయి పేరుతో మార్కెట్టు లోకి వెల్లు వలా వచ్చాయి. ఫెంగ్ షుయి పేరుతొ జరిగే మోసాలు, దోపిడిలు గమనించిన చైనా
కమ్యూనిస్ట్ ప్రభుత్వం తమ దేశంలో దీనిపై నిషేధం విధించినదన్న విషయం ఇక్కడ ప్రస్తా వనార్హం. చట్ట విరుద్దంగా
ఎవరైనా ఫెంగ్ షుయి ని చూపి ప్రలోభపెట్టి ప్రజల నుండి డబ్బు గుంజితే వారికి ఆ దేశంలో చేరసాలే గతి.

ఈ నిషేధం తో ఫెంగ్ షుయి సిద్దాంతులు జీవనోపాది కోల్పోయి చైనాను వదిలి ఇతర బౌద్ధ దేశాలలో కాలం గడుపుతూ
ఈ నమ్మకాలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లు చున్నారు[3].

అభిప్రా యాలు

ఎంత పకడ్బందీగా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టు కున్నా మనిషికి కేవలం సుఖాలే కాక కష్టా లు కూడా కలుగుతాయని,
మనిషి నమ్మకానికే శక్తి ఉందని, మనిషికి కలిగిన ఓటమికి, అనారోగ్యాలకు, బాధలకు వాస్తు తో సంబంధం లేదని,
మనిషిలో ఏవో తెలియని భయాలే వాస్తు ని నమ్మేలా చేస్తా యని పలువురి లౌకిక వాదుల అభిప్రా యం. వాస్తు పై జరిగే
చర్చలో కేవలం ఫలిత వాస్తు ను మాత్రమే పరిగణలోకి తీసుకోరాదు.అలాగే అనుభవాల పేరుతో చెప్పే వాస్తు
సిద్ధాంతుల మాటలు ముమ్మాటికి నిజమని అనుకోరాదు. వాటిలో 99 శాతం అబద్దా లు, అతిశయోక్తు లు.
నిజానికి,ఆనాడు వాస్తు లోచెప్పబడిన ఫలితాలు ఆశాస్త్రా న్ని తు.చ. తప్పకుండాఆచరించటానికి, ఫలితాల పేరుతో
ప్రజలను భయపెట్టి శాస్త్రా న్ని నూరు శాతం అమలు జేయటానికి చేప్పబడినవే. వాస్తు శాస్త్రం అనేది మన ప్రా చీన
నిర్మాణ శాస్త్రంగా స్వీకరించితే ఈ అపోహలు తొలగతాయని ఈ శాస్త్రా న్ని పరిశోధించిన వారి అభిప్రా యం[1].

మూలాలు

1. ప్రొ ఫెసర్ కొడాలి, శ్రీనివాస్ (1996). వాస్తు లో ఏముంది? వాస్తు పై సమగ్ర పరిశోధనా గ్రంథం. విజయవాడ: రాయల్ సివిల్
పబ్లికేషన్.

2. ప్రొ ఫెసర్ కొడాలి, శ్రీనివాస్ (2007). వాస్తు విద్య ,వరాహమిహిరుని బృహత్సంహితా భాగం. గుంటూరు: రాయల్ పబ్లికేషన్.

3. "చైనా వాస్తు -ఫెంగ్ షుయి" (http://vaasthuvidya.blogspot.com/2009/08/blog-post.html) . వాస్తు విద్య. 21 May


2015. Retrieved 30 August 2021.

D. N. Shukla, Vastu-Sastra: Hindu Science of Architecture, Munshiram Manoharial Publishers,


1993, ISBN 978-81-215-0611-3.

B. B. Puri, Applied vastu shastra in modern architecture, Vastu Gyan Publication, 1997, ISBN
978-81-900614-1-4.

Vibhuti Chakrabarti, Indian Architectural Theory: Contemporary Uses of Vastu Vidya Routledge,
1998, ISBN 978-0-7007-1113-0.

బయటి లింకులు

[https://dasamiastro.com/vastu-in-telugu/ The complete Gruha vastu guide and house plan

Vastu Shastra (http://www.subhavaastu.com/) , Non Commercial Vastu Website on web,


More articles on vastu shastra with meaningful images, free e-books, and every thing is FREE.

Vaastu Vedic Research Foundation (http://www.vastuved.com/) , Chennai, Tamil Nadu, India

Vaastusolutions.net Defines that even the Gods needs a Vaastu compliant place on Earth to
live. http://www.vaastusolutions.net

Parasara Vasthu Ganithamu [1] (https://docs.google.com/file/d/0BzRgma9B-bILeGpSRkloS0h


IWnM/edit?usp=sharing) Java Application by D T S Reddy.

https://en.wikipedia.org/wiki/Vastu_shastra
https://web.archive.org/web/20131222074324/http://www.webzeest.com/article/2474/whet
her-the-science-of-vaastu-is-believable

https://web.archive.org/web/20150304195127/http://www.vaastunaresh.com/vastu-
myths.html

https://en.wikipedia.org/wiki/Superstition_in_India

http://www.rohitmishra.me/blog/2011/08/23/vaastu-is-not-science/

https://web.archive.org/web/20140414143852/http://www.hindusvision.com/Vastushastra.
html

https://en.wikipedia.org/wiki/Feng_shui

https://web.archive.org/web/20150209125539/http://www.nhsf.org.uk/2005/12/vaastu-
shastra-fact-or-fiction/

[[:cs:Vástu_šástra|https://cs.wikipedia.org/wiki/V%C3%A1stu_%C5%A1%C3%A1str ]]

"https://te.wikipedia.org/w/index.php?
title=వాస్తు _శాస్త్రం&oldid=3436329" నుండి వెలికితీశారు


InternetArchiveBot చివరిసారి 5 నెలల క్రితం దిద్దు బాటు చేసారు

You might also like