0% found this document useful (0 votes)
1K views3 pages

ద్వికళత్ర యోగము, పునర్వీవివాహము

Uploaded by

ramaphani
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
0% found this document useful (0 votes)
1K views3 pages

ద్వికళత్ర యోగము, పునర్వీవివాహము

Uploaded by

ramaphani
Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
You are on page 1/ 3

 

ద్వికళత్ర యోగం/పునర్వివాహం 

ద్వికళత్ర యోగం/పునర్వివాహం
మన జీవితములో వివాహం అనేది
అతి ముఖ్యమైన సంధర్భం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాంతం వైవాహిక
జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొందరికి ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే
విడిపోవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెనల్లాంటి గొడవలు రావడం జరుగుతుంది. కారణం
ఏమైనపటికి వైవాహిక జీవితం ముక్కలు అయిపోతుంది. అయితే దంపతులు ఇద్దరు విడాకులు
తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి
సందర్భాలలో ద్వితీయ వివాహం కొందరికి చోటు చేసుకుంటుంది. ఇంకొందరికి విడాకులు అవ్వకుండానే
ద్వితీయ వివాహం జరిగి కోర్టు కేసులు, కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతుంటారు. ఇది వారి వారి
జన్మకుండలిలోని కొన్ని గ్రహ స్థితుల వలన కలుగుతుంది. ఇంకొందరు వివాహము అయినప్పటికి, ద్వితీయ
వివాహం జరగకపోయినా అన్య స్త్రీ లేదా అన్య పురుష సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది ఇప్పటి
కాలములో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే ఇది అందరి దంపతులకు జరుగదు. కేవలం కొన్ని
గ్రహస్థితులు ఉన్నవారికి మాత్రమే జరుగుతాయి. అయితే ఈ వివాహేతర సంబంధములు గూర్చి తరువాత
వివరిస్తా ను. ఇప్పుడు ద్వితీయ వివాహముకు ఎలాంటి గ్రహ సన్నివేశములు ఉంటాయో మీకు
తెలుపుతాను.

జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహానికి, ద్వితీయ వివాహానికి, విడాకులకు ముఖ్యంగా సప్తమ భావం
పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివాహమునకు లేదా ద్వితీయ వివాహమునకు లగ్న భావము-
ఇది మన వ్యక్తిత్వము తెలియజేస్తుంది; ద్వితీయభావము మరియు ద్వితీయాధిపతి- ఇది మన కుటుంబ
జీవనము, భార్య/భర్త ఆయుర్దా యము, ద్వితీయ వివాహ సందర్భములు ఏ విధంగా ఉన్నాయో
సూచిస్తుంది; సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి- వివాహము, భర్త, భార్య గురించి
తెలియజేస్తుంది; నవమ భావము మరియు నవమ భావాధిపతి- ద్వితీయ వివాహ సందర్భం గూర్చి
తెలియజేస్తుంది; ఏకాదశ భావం మరియు ఏకాదశాధిపతి- అనుకున్న కోరికలు నెరవేరు సూచనల గూర్చి
తెలియజేస్తుంది; గురువు- స్త్రీ జన్మకుండలిలో భర్త గురించి తెలియజేసే గ్రహం; శుక్రు డు- పురుష
జన్మకుండలిలో భార్య గురించి తెలియజేసే గ్రహం.

ఈ భావములు, గ్రహ స్థా నములు,రాశి స్వభావములు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భము
ఉందా లేదా అన్న విషయము గ్రహించవచ్చు.

ద్వికళత్ర యోగం/ పునర్వివాహం


స్త్రీ జన్మకుండలిలో 6వ స్థా నములో శని, చంద్రు లు కలసి ఉన్నట్లై తే ఆ జాతకులకు రెండు వివాహములు
జరుగుతాయి. ఇదే గ్రహస్థితి పురుషుడికి ఉన్నట్లై తే భార్య మరణించును లేదా భార్య వీరిని వదిలి
వెళ్లిపోవును.

7వ స్థా నంలో ఉండిన యెడల 2 వివాహములు జరుగును. కుజుడు 4,7,8,12 స్థా నముల
6వ స్థా నాధిపతి
యందు ఉన్నట్లై తే జాతకునికి 2 వివాహములు జరుగును.

శని 2వ భావములో గాని, 7వ భావములో గాని రాహువుతో కలసి ఉండినా ద్వికళత్ర యోగం
సంభవిస్తుంది.

శుక్రు డు పాపగ్రహములతో కలసి, 7వ స్థా నాధిపతి నీచ పొందినా, 7వ స్థా నమున పాపులు ఉన్ననూ
పునర్వివాహ అవకాశములు ఉంటాయి.
పురుషునికి 7వ స్థా నములో రవి, రాహువులు ఉన్నా, పరస్త్రీ సంగమం వల్ల తీవ్ర ధన నష్టం జరుగుతుంది.
శుక్ర, చంద్రు లకు 7వ స్థా నములో శని కుజులు ఉండినా భార్య పరాయి వ్యక్తితో వెళ్లిపోవును. సంతానాన్ని
పొందలేరు.
శని, చంద్రు డు కలసి ఏడవ భావంలో ఉండినా ఆ స్త్రీకి రెండు వివాహములు జరుగును.
2,7,6 స్థా నాధిపతులు; 3,6,8,12 స్థా నములందు ఉన్నా పునర్వివాహ సూచనలు వస్తా యి.

జన్మకుండలిలో సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి (బుధుడు, గురువు) ఉన్న రాశి ఈ రెండు
ద్విస్వభావ రాశులు (కన్యారాశి, మిధునరాశి, ధను రాశి,మీనరాశి) అయితే , ఆ జాతకునికి ద్వితీయ
వివాహం జరిగే అవకాశము ఉంటుంది.
సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి, నవాంస చక్రములో మరియు భావచక్రములో సప్తమాధిపతి మరియు
లగ్నాధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే జాతకునికి రెండు వివాహములు జరుగు సూచనలు
వస్తా యి.
వైవాహిక స్థా నం అయిన 7వ స్థా నముపై గాని లేదా సప్తమాధిపతి పై గాని 2 లేక 3 పాప గ్రహముల (శని,
రవి, కుజ,రాహు, కేతు) దృష్టి ఉండినట్లై తే జాతకునికి ద్వితీయ వివాహం జరుగవచ్చు.
సప్తమాధిపతి మరియు లజ్ఞా ధిపతి ఇద్దరు కలసి 11వ భావములో ద్విస్వభావ రాశిలో ఉంటే జాతకులకు
ద్వితీయ వివాహ అవకాశములు ఉంటాయి.
సప్తమములో 2 గాని లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు గాని శుక్రు నితో కలసి 7వ భావములో ఉంటూ, ఆ
సప్తమ భావముపై పాప గ్రహముల యొక్క దృష్టి పడినా జాతకునికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు
జరుగుతాయని చెప్పవచ్చు.
అష్టమాధిపతి లగ్నములో గాని లేదా సప్తమ భావములో గాని మరియు సప్తమధిపతి ద్విస్వభావ రాశిలో
గాని లేదా శని,కుజ,రాహు,కేతు యొక్క పాప గ్రహముల దృష్టి సప్తమాధిపతి పై ఉన్నా జాతకునికి రెండవ
వివాహం జరిగే సందర్భాలు ఎదురవుతాయి.
వైవాహిక స్థా నాధిపతి అయిన సప్తమాధిపతి 6వ భావములో గాని, అష్టమ భావములో గాని లేదా 12వ
భావములో గాని ఉండి మరియు కుజ, రాహు, కేతు, శని లాంటి పాప గ్రహములో సప్తమములో ఉండి,
శుక్రు డు బల్హీనంగా నీచ లేదా శత్రు స్థా నములో ఉన్నట్లై తే జాతకుడికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం
ఉంటుంది.
కావున ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మకుండలిలో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక
జీవితం సాఫీగా సాగక, విడిపోవడం గాని, ద్వితీయ వివాహము జరగడం గాని జరుగుతుంది. అయితే
జన్మకుండలి పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయము స్పష్టము చేయకూడదు.

Related Articles:

వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు


కళత్ర దోషం అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
NAGASHAKTHI Telugu Book
జాతక పరిశీలన- Horoscope Reading
ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
విడాకులు-జ్యోతిష్య కారణాలు
సర్పశాపం
కాలసర్పయోగ నివృత్తి హోమం

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తా యి. ఈ బ్రహ్మ
తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తు న్నారు. జన్మకుండలి ద్వారా
గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా
తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ
తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి,
సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన
ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ
జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు
సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రా యశ్చిత్తములు కొరియర్
ద్వారా పొందుటకు సంప్రదించండి.

You might also like