వేదాలను మనం చదివితే మనకు అంతా అర్థమవుతుంది.
వేదాలను ఎంతమంది చదువుతున్నారు,ఎంత మంది
వాటి అర్థం పరమార్థం తెలుసుకుంటున్నారు అందరం ప్రశ్నించుకోవాలి. అసలు ఈరోజుల్లో సంస్కత భాష
ఎంతమందికి సంపూర్ణంగా వచ్చు?.
సంస్కృత పరిజ్ఞా నం ZERO ఉన్నవాళ్లు కూడా వేదాలను అనేక డిబేట్స్ లో విమర్శించడం ఆశ్చర్యం వేస్తుంది.
సనాతన ధర్మం కన్నా ముందు ఎవరూ పుట్టలేదు.కావున మనను సనాతనులు అని అన్నారు.అందుకే ఈ
మానవజాతికి మూలం భరత ఖండం అయింది. వేదాలు మానవ అస్తి త్వానికి పునాదులు. ఈ సనాతన ధర్మమే
ప్రపంచ మానవ మనుగడకు, ప్రపంచ శాంతికి ఆధారం.
హిందువులు ఎన్నో విషయాలు ఎప్పుడో కనిపెట్టా రు.నాకు తెలిసిన,మన పురాతన గ్రంధాలు కొంత చదివిన
జ్ఞా నంతో కొన్ని విషయాలు ఇక్కడ రాశాను……..
ఆత్మ పరమాత్మ నుండి పుట్టిందని కనుక్కున్నాము.ఆత్మ చావదు, ఈ భౌతిక శరీరం మాత్రమే నశిస్తుంది
అనిచెప్పాం. పునర్జన్మ ఉన్నదని చెప్పాం.
జంతూనాం నరజన్మ దుర్లభం.అన్ని జంతువుల్లో మనిషి జన్మ ఉత్త మమైనది. మనిషి ధర్మం గా జీవించాలని
చెప్పాం. అసలు ఏ ఒక్క ఇతర మతాల్లో ధర్మం అన్న పదానికి సరిపడ వివరణ ఇచ్చే పదం ఉన్నదా?.
ఈ భౌతిక సృష్టిలో(ఫిజికల్ వరల్డ్ ) శాశ్వతం యేదీ ఉండదు అని చెప్పాం.పరమాత్మ మాత్రమే శాశ్వతం అన్నాం.
మనం పీల్చే గాలి లో ప్రా ణ,అపాన, వ్యాన,ఉదాన,సమాన అని 5 వాయువులు ఉంటాయనీ చెప్పాం..
మానవ జీవిత కాలం కలియుగంలో 120 సంవత్సరములు అని అది రాను రాను 100,60,30 అవుతుందని
చెప్పాం. 100 ఇదివరకే అయింది.
Zero శూన్యం గురించి చెప్పాం.
వేద గణితం ఇప్పుడు కూడా ఉన్నది కదా. ఇది హిందువులు కనుక్కొన్నదే కదా.ఒక 15 అంకెల సంఖ్యను మరో
12 అంకెల సంఖ్యతో గునించాలంటే మన సాధారణ calculators .E అని చూపిస్తా యి. అటువంటి క్లిష్ట గునితాన్ని
just వేళ్ళమీద యే Calculator లేకుండా ఎలా చెప్పగలుగుతున్నారు. ఇది వేదాలు అందించిన విజ్ఞా నమే కదా.
శబ్ద భేద విద్య,జల స్థంభన విద్యల గురించి రామాయణం,మహాభారతము లో ఉన్నది.
లలిత కళలు 64 అని చెప్పాం.
శృంగారం కూడా ఒక కళ (ఫైన్ ఆర్ట్) అని చెప్పాం. కామశాస్త్రం రచించింన వాత్సాయనుడు హిందువు కాదా.
పిండం తల్లి గర్భంలో ఎలా తయారవుతుంది అని ఆధ్యాత్మ రామాయణం,గరుడ పురాణంలో సవివరంగా చెప్పారు.
భూమి,నీరు,అగ్ని,వాయు, ఆకాశం లు పంచ మహా భూతాలు అని చెప్పాం.అంతరిక్ష శాంతిః, పృథ్వి శాంతిః, ఆపః
శాంతిః…అని వేదంలో చెప్పబడింది, ఇవి ప్రా ణుల మనుగడకు ముఖ్యం అని కూడా చెప్పాం.ఇది సత్యం కాదా. ఈ
రోజు పర్యావరణవేత్త లు ఇదే చెపుతున్నారు కదా!.
కాలాసూచి (పంచాంగం) రచించాం. ఇప్పుడు కలియుగం 5124 వ సంవత్సరంలో విక్రమ శకం(2080 వ
సంవత్సరం) , శాలివాహన శకం(1945 వ సం)లో మనం ఉన్నాం.
గ్రహ సంక్రమనాలు,గ్రహణాలు గురించి మన శాస్త్రా ల్లో చాలా క్లియర్ గ చెప్పబడ్డ ది. నక్షత్రా లు,రాశి మండలాల
గురించి చాలా clear గా మన శాస్త్రా ల్లో ఉన్నది. ఇది మనం చెప్పిన సైన్స్ కాదా.
ఈ విశ్వం పేరు శ్వేత వరాహ కల్పం.ఇప్పుడు నడుస్తు న్న ఈ వైవస్వత మన్వంతరంలో ఈ భూమి వయస్సు
ఇప్పుడు 194 కోట్ల సం రాలు అని హిందూ ఖగోళ శాస్త్రం చెప్పింది.
పద్మ వ్యూహం,చక్రవ్యూహం,శకట వ్యూహం లాంటి యుద్ధ నీతి తంత్రా లను మనం రచించాము.
ఆగ్నేయ,నాగ,పాశుపత,వారుణ,బ్రహ్మ,నారాయణ,సమ్మోహనాస్త్రం గురించి మన చరిత్రలో రాయబడ్డ ది.
స రి గ మ ప ద ని …లు సప్త స్వరాలు అని కనుక్కున్న జాతి మనది. అనేక రాగాలు రచించామ్.
1 లక్ష శ్లో కాల మహాభారతం,24000 శ్లో కాల రామాయణం,18000 శ్లో కాల భాగవతం,అనేక పురాణాలు హిందువులే
రచించారు. లక్ష శ్లో కాలతో ఒక బుక్కు రాయడం Literary ,History, Geography knowledge లేనివారికి
సాధ్యమేనా.
మొదటి ఆధునిక ప్రపంచ అత్యంత భయంకరమైన ప్రపంచ యుద్ధం 6000 సం క్రితం మనమే చేశాం. ది గ్రేట్
మహాభారత యుద్ధం లో పాల్గొ న్నది హిందువులే.అప్పుడు భూమిమీద ఉన్న దాదాపు అన్ని రాజ్యాలు ఈ
యుద్ధంలో పాల్గొ న్నట్లు ఉన్నది.
సత్యమేవ జయతే అని వేల యేండ్ల క్రితం మనం చెప్పాం. ఇప్పుడు English లో Truth Triumphs అంటున్నారు
కదా.
ఈ భూమి కాకుండా అనేక గ్రహాలు,నక్షత్రా లు,లోకాలు ఉన్నాయి అని చెప్పాం. ఇప్పుడు సైన్స్ అదే చెబుతున్నది
కదా.
సప్త ఋషి మండలం గురించి మన శాస్త్రా ల్లో ఉన్నది. Great Bear అంటే ఇదేకదా.
చంద్రు డు జల తత్వం గల రాశి అని చెప్పాం.
అంగారకుని మీద నీళ్ళు ఉండవు అంగారకుడు నిర్జల గ్రహము అని మన ఖగోళ శాస్త్రము చెప్పింది.
చెట్ల కు ప్రా ణం ఉంటదని పురాణాలు ఘోషస్తు న్నాయి.Dr జగదీష్ చంద్రబో స్ నిరూపించాడు కూడా.
భూమి గోళము అని ఎప్పుడో చెప్పాం కదా.ఇప్పుడు వెస్టర్న్ సైన్స్ కూడా అదే చెప్పింది కదా.
త్రిశంకు స్వర్గం అని చదివాం. భూ ఆకర్షణ దాటలేక పో యి మధ్యలోనే ఉన్న త్రిశంకు భూమి చుట్టు తిరుగతూ
ఉంటాడు అని చెప్పాం కదా. ఇప్పుడు శాటిలైట్ లు ఇదే పనిచేస్తు న్నాయి.
సూర్య సంక్రమణం వలన ఆయణములు ,ఋతువులు ఏర్పడ్డా యని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా.
పూర్ణిమ,అమావాస్య లకు సముద్రం ఉప్పొంగును అని ఎప్పుడో మన పూర్వీకులు తెలుసుకున్నారు.
ధ్రు వ తార గురించి పురాణాల్లో ఉన్నది. Pole Star అంటే ధృవుడే కదా!.
ఆయుర్వేదం,యోగా,జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మానవాళికి అందించాం. ఇప్పుడు యోగ ఆరోగ్యానికి మంచిది అని
ప్రపంచ శాస్త్రవేత్త లు చెబుతున్నారు కదా.
సుశృతుడు సర్జరీ చేశాడని హిందూ గ్రంథాల్లో ఎప్పుడో చదివాం .
ఇంద్రజాల,మహేంద్రజాల విద్యల గురించి మన గ్రంధాల్లో ఎప్పుడో వ్రా శారు.
ఈ భూమిని వర్షా లు ఖండాలు దేశాలు గా వేల యేండ్ల క్రిందటే విభజించాము. మన హైదరాబాద్ ఉన్నది జంబూ
ద్వీపే (జంబూ ద్వీపంలోని) భారత వర్షే(భరత వర్షంలోని) భరత ఖండే(భరత దేశంలోని) దక్షిణాపథే (దక్షిణ
భాగంలోని) దండకారణ్య దేశే(ఇక్కడ దండకారణ్య మహాప్రాంతంలోని) భాగ్యనగర ప్రదేశే(భాగ్యనగరం అనే ప్రదేశంలో)
అని చెపుతారు . ఇది మన పూర్వీకులు చదువుకొన్న Geography కాదా.
ఈ సృష్టి పుట్టు కకు ఒక బ్రహ్మ పదార్థమే కారణం అని చెప్పారు. సృష్టి అంతా ఆ బ్రహ్మమయమే అనికూడా
చెప్పారు. Modern Science కూడా ఇదే చెబుతున్నది కదా.
మన వద్ద Technology and Science లేకుంటే బృహదీశ్వర ఆలయం,మధుర మీనాక్షి,అనంత పద్మనాభ
స్వామి ఆలయం,అజంతా,ఎల్లో రా,వేయి స్తంభాల గుడి లాంటి అద్భుత కట్టడాలను కట్టడం సాధ్యమయ్యేది కాదు.
నీటిలో తేలియాడే ఇటుకలను వేల ఎండ్ల క్రితమే హిందూ శాస్త్ర కారులు కనుక్కున్నారు.
రుతుక్రమం ఉన్నంత వరకే గర్భధారణ అవకాశం ఉంటుందని ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది కదా.
పుష్పక విమానము అని గాల్లో ప్రయాణించే వాహనం గురించి రామాయణం లో క్లియర్గా ఉన్నది కదా.
ఆర్యభట్టు ,భాస్కరాచార్యుడు,వరాహ మిహీరుడు లాంటి గొప్ప Astronomical Scientists హిందువులే కదా.
వాళ్ళు వేదాలు,పురాణాలు రీసెర్చ్ చేసి అనేక గొప్ప విషయాలు కనుక్కున్నారు.నిజానికి మన ఋషులందరూ
గొప్ప సైంటిస్టు లే.అగస్త్య మహాముని రాసిన నాడీ జ్యోతిష్యం అద్భుతం కాదా.
అర్జు నుడు మత్స్య యంత్రం ను ఛేదించాడు అని మహా భారతం లో క్లియర్ ఉన్నది. యంత్రములు(Machines)
అన్నవి అప్పుడే ఉన్నవి కదా..అయితే యంత్రము కంటే తంత్రము ,తంత్రము కంటే మంత్రము శక్తివంతమైనవి
అని మన పురాణాల్లో చెప్పారు.
ఈ శరీరం పంచతత్వాలయిన పృథ్వి,ఆపహ,తేజో,వాయు,ఆకాశ లతో కూడి దీనిలో ఆత్మ ఉండును అని మన
వేదాలు ఎప్పుడో చెప్పాయి. ఈ పంచ తత్వాలతోనే వృద్ధి చెంది ఆత్మ వెళ్ళిపో గానే ఈ దేహం నశించి చివరకు ఆ
పంచ భూతాల్లో కలసిపో వును అని మన వేదాలు,పురాణాలు చాలా వివరంగా చెప్పాయి.ఇది నిజమే కదా. లేకుంటే
ఒక కంటికి కనపడని ఒక వీర్యకణము(Sperm),అండము(egg) కలిసి ఇంత పెద్ద శరీరం
ఎలాతయారవుతున్నది.మనం తినే ఆహారం పై అయిదింటి నుండే వచ్చును కదా.ఆహారం తోనే శరీరం వృద్ధి
అవును. ఇదంతా సైన్స్ కాదా.
అలాగే "అన్నద్భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవా…." అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కదా . ప్రా ణులు
అన్నింటికీ ఆహారం కావాలి. ఆ ఆహారం నీటితోనే తయారగును అన్నది నిజమేకదా.ఇది మన పూర్వీకులు చెప్పిన
సైన్స్ కాదా.
చవుడు/బురద నేలల్లో ,సముద్ర తీరానికి దగ్గరగా,పర్వత శిఖరాలమీద/ నీడ పడ్డ చోట,నదీ గట్టు న,నదిమలుపు
తిరిగేచోట జనావాసాలు నిర్మించ కూడదు అని మన వాస్తు శాస్త్రంలో,పురాణాల్లో వేల ఎండ్ల క్రితమే
చెప్పారు.ఒకవేళ ఏదైనా నిర్మించినా కూడా బరువు తక్కువగా ఉండేట్లు నిర్మించాలి అని శాస్త్రం. ఈ నియమాలు
విస్మరించి మనం నిర్మించిన నగరాలు,పట్టణాల పరిస్థి తి మనం ప్రత్యక్షంగా చూస్తు న్నాం కదా.
మహాభారతంలో ఒక స్క్రీన్ లాంటి ఫలకం మీద మొత్తం భారత యుద్ధం సంజయుడు చూస్తూ దృతరాష్ట్ర
మహారాజుకు Live గా వివరించాడు అని ఉన్నది నిజం కాదా. సైన్స్ గురించిన అవగాహన లేకుంటే వ్యాసుల వారు
ఎలా రాశారు.
నారాయణ సూక్తం (తైత్త రీయ ఆరణ్యకం 4.10.13 శ్లో కం8)లో "సంతతగ్0 శిలాభిస్తు లంబత్యా కోశసన్నిభం,
తస్యాంతే శుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠి తమ్) తా: తామర మొగ్గ ఆకారంలో ఉండే హృదయం
నలువంకల నాడులతో ఆవృతమై వ్రేలాడుతున్నది. దాని లోపల సూక్ష్మ ఆకాశం(అనంతమైనది) నెలకొని ఉన్నది.
ఈ శరీరానికి కావలసినది అంతా దానిలో అనగా హృదయంలోనే నెలకొని ఉన్నది.".అంతకు ముందు 7 వ
శ్లో కంలో(అధో నిష్ట్యామి తస్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్టతి… ). అనగా భౌతిక హృదయం అనేది నాభికి పైన దాదాపు
జానెడు దూరంలో ఛాతీ మధ్యనుండి కొద్ది గా ఎడమ వైపుగా ఉంటుంది అని ఉన్నది.సైన్స్ పరిజ్ఞా నం లేకుండా ఒక
సాధారణ మనిషికి ఇది ఊహకు కూడా సాధ్యమేనా. ఇది వేదం చెప్పిన విజ్ఞా నం కాదా.
హంపిలోని ఒక పురాతన దేవాలయంలో ఉన్న స్తంభాలను తట్టితే వాటినుండి 'స రి గ మ ప ద ని స' లు
వినపడ్తా యి. మన శాస్త్రా లు ఎంత ఘనమైనవో ,మన శిల్పాచార్యులు ఎంత మేధావులో,మన Scientific
Advancement ఎంత గొప్పగా ఉండేదో దీనిని బట్టి అర్థమవుతుంది.
మనకు ఈ శరీరం అంటే అవయవాలు దాని అంగాలు మరియు బుద్ధి అనుకుంటాం. కానీ ఈ శరీరం పంచ
కోశము(అర)ల సమూహం అని పూర్వీకులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఈ శరీరం అన్నమయ,ప్రా ణమయ,
మనోమయ,విజ్ఞ్యానమయ,ఆనందమయ కోశముల తో ఉంది మన శరీరాన్ని, బుద్ధి ని వివిధ రకాలుగా
ప్రేరేపిస్తా యి.ఆనంద మయ కోశము లోకి వెళితే ఈ విశ్వ తత్వం పరమాత్మ తత్త్వం తెలుసుకుంటాము.
పూరీ శ్రీ జగన్నాథ దేవాలయ పతాకం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. అంతే కాదు,ఏ సమయంలో
అయినా కూడా ఈ గుడి నీడ భూమి మీద మనకు కనపడదు. ఇవి మన పూర్వీకుల Science &
Technological పురోభివృద్ధి కి తార్కాణాలు కావా.