100% found this document useful (1 vote)
883 views53 pages

పదవ తరగతి - భాషాంశాలు (32 మార్కులు)

Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
100% found this document useful (1 vote)
883 views53 pages

పదవ తరగతి - భాషాంశాలు (32 మార్కులు)

Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
You are on page 1/ 53

విభాగము - 3

భాషాంశాలు (32 మార్కులు)

Question No. 11 1×2=2

అలంకారం గుర్తించడం. పేరు, లక్షణం రాయడం

ప్రశ్న అడిగే తీరు :

అతడు తాటిచెట్టంత పొ డవున్నాడు. (వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, పేరు, లక్షణం రాయండి.)

జ) వాక్యంలో ‘అతిశయోక్తి అలంకారం’ కలదు.

లక్షణం : ఒక వస్తు వును లేదా సన్నివేశాన్ని ఉన్నదాని కంటే, చెప్పాల్సినదాని కంటే ఎక్కువ గొప్పగా చేసి
వర్ణించడం. దీన్నే గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం అంటారు.

అలంకారాలు

రూపకాలంకారం :

లక్షణం : ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం. ఉపమేయంలో ఉపమాన


ధర్మాన్ని ఆరోపించడం.

నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై


విగత చక్షులైరి వినవే ? వార
లరిగి యింకనైన నమ్ముదుసళ్ల యు
దగ్ర శోకవహ్ని నార్పవయ్య

పై పద్యంలో ‘శోకవహ్ని’ అనే సమాసపదం ఉంది కదా ! దానికి విగ్రహవాక్యం ‘శోకమనెడు వహ్ని’ ఇది
రూపక సమాసం. అలాగే అలంకారాలలో దీనిని రూపకాలంకారం అంటారు. వహ్ని అనేది ఉపమానం,
శోకం అనేది ఉపమేయం. ఇక్కడ ఉపమానధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించారు. రెండిటికీ అభేదం అంటే
భేదం లేనట్లు చెప్పారు కనుక ఇది రూపకాలంకారం.

1
కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.

ప్రశ్న - సంసార సాగరాన్ని ఈదటం కష్ట ం.

ఈ వాక్యంలో “సంసార సాగరం” అని ఉంది కదా! అంటే సంసార మనెడి సాగరం. సంసారం అనే
ఉపమేయానికి సాగరం అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది. సాగరం లక్షణాన్ని సంసారంపై
ఆరోపించబడింది. కనుక ఇది రూపకాలంకారం.

ప్రశ్న - ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది.

ఈ వాక్యంలో “దయావర్షం” అని ఉంది కదా ! అంటే దయ అనెడి వర్షం. దయ అనే ఉపమేయానికి వర్షం
అనే ఉపమానానికి అభేదం చెప్పబడింది. వర్షం లక్షణాన్ని దయపై ఆరోపించబడింది. కనుక ఇది
రూపకాలంకారం

ప్రశ్న : దుఃఖసముద్రము భారతీయ హృద్ద్వారము సొ చ్చి యగ్నివలె జ్వాలలు వీచుచునున్న దెంతయున్.

పై పద్య పాదంలో రూపకాలంకారము ఉన్నది.

ఛేకానుప్రా సాలంకారం :

లక్షణం : హల్లు ల జంట అర్థ భేదం కలిగి వెంటవెంటనే (అవ్యవధానంగా) ప్రయోగించబడితే దానిని
‘ఛేకానుప్రా సాలంకారం’ అంటారు.

1. నేడు ధర ధర బాగా పెరిగిపో తోంది.


2. ఈ ఏడు ఏడు రోజులపాటు వ్రతం చేయాలి.

పై వాక్యాలను పరిశీలిస్తే ధర, ధర, ఏడు, ఏడు అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కపక్కనే
అర్థ భేదంతో ఉన్నాయి కనుక ఇది ఛేకానుప్రా సాలంకారం.

కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.

ప్రశ్న 1 - గోరువంక వంక చూసెను.


ఈ వాక్యంలో వంక, వంక అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక
ఇది ఛేకానుప్రా స.

ప్రశ్న 2 - సమస్యల సాధనకు నారి నారి బిగించింది.


ఈ వాక్యంలో నారి, నారి అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక
ఇది ఛేకానుప్రా స.

2
ప్రశ్న 3 - సుందర దరహాస రుచులు.
ఈ వాక్యంలో దర – దర అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక
ఇది ఛేకానుప్రా స.

ప్రశ్న 4 - రాజా ! నీది శుభంకర కరం.


ఈ వాక్యంలో కర – కరం అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి. కనుక
ఇది ఛేకానుప్రా స.

ప్రశ్న 5 - ఆ కొమ్మ కొమ్మవంచి పూలు కోసెను.


ఈ వాక్యంలో కొమ్మ, కొమ్మ అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే అర్థ భేదంతో ఉన్నాయి.
కనుక ఇది ఛేకానుప్రా స.

వృత్త ్యనుప్రా సాలంకారం :

లక్షణం: ఒకటి గానీ అంతకంటే ఎక్కువ గానీ హల్లు లు పలుమార్లు వాక్యంలో గానీ పద్యపాదాలలో గానీ
వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని ‘వృత్త ్యనుప్రా సాలంకారం’ అంటారు.

1.​ భేరికా దాండదడాండదాండ నినదంబులజాండము నిండ


పై పద్యాన్ని గమనించినపుడు ‘డ’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వలన ఇది
వృత్త ్యనుప్రా సాలంకారం అవుతుంది.

2.​ అక్షరజ్ఞా నం లేని నిరక్షరకుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్ట ముల పాలగును


పై వాక్యమును గమనిస్తే “క్ష” కారం అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల
వృత్త ్యనుప్రా సాలంకారం అవుతుంది.

3.​ ఇదికాదదియనునదికా
దిదియను నిది నదియు వదిలి యెదియో పదరున్
వదలని ముదములఁ బొ దలగ
నదవదపడి చెదరి యెడఁద హరిహరనాథా

పై పద్యంలో “ద” కారమనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల వృత్త ్యనుప్రా స
అలంకారమైనది.

4.​ లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా ?


పై వాక్యంలో “క్ష” కారం అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వల్ల వృత్త ్యనుప్రా స
అలంకారమైనది.

3
దృష్టా ంతాలంకారం :

లక్షణం : ఉపమాన ఉపమేయాల వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే దానిని
దృష్టా ంతాలంకారం అంటారు. దృష్టా ంతం అంటే ఉదాహరణ.

పలుచని నీచమానవుడు ……………. భాస్కరా !

అనే పద్యంలో దృష్టా ంతాలంకారం ఉంది.

సమన్వయం : నీచ మానవుని వెలితి కుండతో పో ల్చారు. గుణవంతుని నిండుకుండతో పో ల్చారు. కాని,
ఉపమాన, ఉపమేయాల ధర్మాలు వేరు. అయినా ఒకదానికి ఒకటి బింబ ప్రతిబింబ భావంతో చెప్పారు.
కనుక ఇచ్చిన పద్యంలో దృష్టా ంతాలంకారం ఉంది.

ఉదా : వెలితికుండ తొణుకుతుంది, కానీ నిండుకుండ తొణకదు.

నీచుడు పరుషంగా మాట్లా డతాడు. మంచివాడు కఠినంగా మాట్లా డడు. పై వాక్యాలలో వెలితికుండలో ఉన్న
ధర్మాన్ని నీచుడితోను, నిండుకుండలో ఉన్న ధర్మాన్ని మంచివానితోను పో ల్చారు. రెండు వాక్యాలలో
ఉన్న వేరువేరు ధర్మాలను బింబప్రతిబింబ భావంతో చెప్పారు. కాబట్టి ఇది దృష్టా ంతాలంకారం.

స్వభావోక్తి అలంకారం :

లక్షణం : జాతి, గుణ క్రియాదులతో స్వభావాన్ని సహజంగా, మనోహరంగా వర్ణించడం ‘స్వభావోక్తి


అలంకారం’.

గుసగుసలతో కొమ్మకొమ్మఫై నివసించి


ముక్కులానించు లకుముకిపిట్ట దంపతులు.

పై ఉదాహరణలో లకుముకి పిట్టలు కొమ్మకొమ్మ పైనా నివసిస్తూ గుసగుసలాడుతూ ముద్దా డుతున్నాయి


అనే విషయాన్నే ఉన్నదున్నట్లు గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.

క్రమాలంకారం / యథా సంఖ్యాలంకారం

లక్షణం: వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు.

ప్రశ్న - శత్రు వుని మిత్రు ని విపత్తు ని జయింపుము రంజింపుము భంజింపుము.

పై ఉదాహరణ పరిశీలిస్తే శత్రు వు, మిత్రు డు, విపత్తు అనే మూడు పదాలు ఉన్నాయి. వరుసగా
జయింపుము, రంజింపుము, భంజింపుము అనేవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మూడింటికి వరుసగా

4
మూడు కలిపితే శత్రు వుని జయింపుము, మిత్రు ని రంజింపుము, విపత్తు ని భంజింపుము అని
ఏర్పడతాయి. ఈ విధముగా చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు.

ప్రశ్న - గజకచ్ఛపమూషికంబులు వనజలబిలములందు ప్రవేశించాయి.

ఇచ్చిన వాక్యంలో క్రమాలంకారం ఉంది.

సమన్వయం : గజము, కచ్ఛపము (తాబేలు), మూషికము అనేవి వస్తు క్రమం. వనం (అడవి), జలం,
బిలం (రంధ్రం) లలో ప్రవేశించడం అన్వయం. అంటే గజము వనంలోకి ప్రవేశించింది. కచ్ఛపము జలంలోకి
ప్రవేశించింది. మూషికము బిలం (కన్నం)లోకి ప్రవేశించింది.

ప్రశ్న - సూర్యచంద్రు లు దివారాత్రములకు అధిపతులు - క్రమాలంకారం

శ్లేషాలంకారం :

లక్షణం : అనేక అర్థా ల్ని ఆశ్రయించేద.ి అంటే అనేక అర్థా లిచ్చే పదాలను ప్రయోగించడం శ్లేషాలంకారం.

రాజు కువలయానందకరుడు.

వివరణ : ఈ వాక్యంలో రాజు(చంద్రు డు) కువలయం(కలువ)కు ఆనందాన్ని కలిగిస్తా డు అని ఒక అర్థ ం.


రాజు (ప్రభువు) కువలయము(భూమి)నకు ఆనందం కలిగిస్తా డు అని మరొక అర్థ ం. ఇలా రాజు అంటే
చంద్రు డు, ప్రభువు, కువలయం అంటే కలువ, భూమి అనే రెండర్థా లు వచ్చేలా ఈ వాక్యంలో
ప్రయోగించారు. ఇలా విభిన్న అర్థా లు కలిగిన పదాలను వాక్యంలో ప్రయోగించడాన్ని శ్లేషాలంకారం
అంటారు.

●​ మిమ్ము మాధవుడు రక్షించుగాక - శ్లేషాలంకారం


●​ నీవేల వచ్చెదవు - శ్లేషాలంకారం
●​ మానవ జీవనం సుకుమారం - శ్లేషాలంకారం
●​ ఏమి చెప్పావురా - శ్లేషాలంకారం

యమకాలంకారము :

లక్షణం : రెండు లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదం అర్థ భేదంతో, వ్యవధానంతో మళ్ళీమళ్ళీ
రావడం యమకాలంకారం.

ఉదా :
1.​ లేమా! దనుజుల గెలువఁగ లేమా?
నీవేల కడఁగి లేచితివిటురా?
2.​ ప్రా యము జలకల్లో ల ప్రా యము

5
3.​ మానవా ! నీ ప్రయత్నం మానవా !
4.​ నీ దేహంలో సందేహం ఉందా !
5.​ పెరుగు తింటే పెరుగుతారు.

ఉత్ప్రేక్షాలంకారము :

లక్షణం : ధర్మస్వామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్ల యితే అది ఉత్ప్రేక్షాలంకారం


అవుతుంది. ఉత్ప్రేక్ష అనగా ఊహ.

●​ ఈ వెన్నెల పాలవెల్లి యో అన్నట్లు న్నది.


●​ ఆకాశం కాటుకను వర్షిస్తు న్నట్లు ంది.
●​ ఆ ఏనుగు నడుస్తు న్న కొండా అన్నట్లు ంది.

పై వాక్యాలలో ఊహ ప్రధానంగా ఉంది. కనుక ఇవి ఉత్ప్రేక్షాలంకారం.

ముక్త పదగ్రస్త అలంకారం :

లక్షణం : ఒక పద్యపాదంగానీ వాక్యంగానీ ఏ పదంతో పూర్త వుతుందో అదే పదంతో తర్వాత పాదం / వాక్యం
మొదలవుతుంది. దీన్నే ముక్త పదగ్రస్త అలంకారం అంటారు.

మన వేటికి నూతనమా !
తన మానిని బ్రేమ ? తనకు దక్కితిననుమా
ననుమానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే

సుదతీ నూతన మదనా!


మదనాగతురంగ పూర్ణ మణిమయసదనా!
సదనామయ గజ రదనా!
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా!

పై పద్యాలలోని ప్రత్యేకతను గమనించారు కదా! ఒక పద్యపాదంగానీ వాక్యంగానీ ఏ పదంతో పూర్త వుతుందో


అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్నే ముక్త పదగ్రస్త అలంకారం అంటారు.
(ముక్త పదం = విడిచిన పదాన్ని, గ్రస్త = తిరిగి గ్రహించడం అని అర్థ ం)

6
అతిశయోక్తి అలంకారం :

లక్షణం : ఒక వస్తు వు యొక్క స్థితిని, స్వభావాన్ని, గుణాన్ని ఉన్నదాని కంటే అతిశయంగా చేసి
చూపడాన్ని ‘అతిశయోక్తి అలంకారం’ అంటారు. అంటే గోరంతను కొండంత చేసి చెప్పడం అని అర్ధ ం.

ఉదా : మా నూతిలో నీళ్ళు పాతాళానికి చేరాయి.

ఇందులో నిజానికి నూతిలో నీళ్ళు పాతాళానికి చేరలేదు. కాని పాతాళానికి చేరినట్లు గా అతిశయించి
చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం.

ఉదాహరణలు :
●​ భూమి, ఆకాశాలు ఏకమగునట్లు గా వర్షం కురుస్తో ంది.
●​ సముద్రపుటలలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
●​ పి.టి. ఉష గాలి కంటే వేగంగా పరుగెత్తి ంది.

లాటానుప్రా సాలంకారం :

లక్షణం : అర్థ భేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం వెంటవెంటనే రావడం ‘లాటానుప్రా స అలంకారం’.

ఉదాహరణలు :

●​ శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.

ఇక్కడ జిహ్వ అనే పదం మొదటిసారి శ్రీనాథుని వర్ణించే నాలుక అనే అర్థ ంలోనూ, రెండవసారి
శ్రీనాథుని వర్ణించే నాలుక మాత్రమే అనే అర్థ ంలోనూ ఉపయోగించబడింది.

●​ మానవత్వము గలుగు మనిషి మనిషి.

ఇక్కడ మనిషి అనే పదం మొదటిసారి మానవత్వం కలిగిన మనిషి అనే అర్థ ంలోనూ, రెండవసారి
మానవత్వం గల మనిషి మాత్రమే అనే అర్థ ంలోనూ ఉపయోగించబడింది.

●​ మలయగిరి నుండి వచ్చే గాలి గాలి.

●​ అమ్మ చూపించే ప్రేమ ప్రేమ.

7
Question No. 12 1×2=2

పద్య పాదానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి పద్యం పేరు రాయడం

ప్రశ్న అడిగే తీరు :

ఎంతయు వృద్ధు లై తమకు నీవొకరుండవ తెప్పగాగ న (త్యంత)

(గురులఘువులు గుర్తించి గణవిభజన చేస,ి పద్యం పేరు రాయండి.)

జ)
భ ర న భ భ ర వ

U I I UIU III UII UII UIU IU

ఎంతయు వృద్ధు లై తమకు నీవొక రుండవ తెప్పగా గన

ఈ పద్యపాదము “ఉత్పలమాల” అనే వృత్త పద్యమునకు చెందినది.

లఘువు [I] అక్షరాలను గుర్తించడం :

హ్ర స్వాక్షరం ఉన్నచోట "లఘువు" వస్తు ంది.


ఉదా : 1. అరక - III 2. తనువు - III

గురువు [U] అక్షరాలను గుర్తించడం :

ఐదుచోట్ల గురువు వస్తు ంది.


అవి :
1) దీర్ఘంతో కూడిన అక్షరాలు ఉన్నచోట “గురువు - U" వస్తు ంది.
ఉదా: 1. మానస - UII 2. ద్వారకా - UIU
2) పూర్ణ బిందువు అనగా నిండుసున్న [O] తో కూడిన అక్షరం గురువు అవుతుంది.
ఉదా: 1. అందరు - UII 2. ప్రేమించి - UUI
3) 'ఐ' కార, 'ఔ' కారములతో కూడిన అక్షరానికి గురువు వస్తు ంది.
ఉదా: 1. నైషధం - UIU 2. సౌదామి - UUI
4) పొ ల్లు అక్షరంతో కూడిన అక్షరానికి గురువు వస్తు ంది.
ఉదా: 1. వారికిన్ - UIU 2. తనువున్ - IIU

8
5) సంయుక్త , ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం గురువు
ఉదా: 1. దో సిళ్ళన్ - UUU 2. పద్ధ తి - UII
A) లఘుస్థా నాలు కలిగిన గణాలు - య-ర-త
B) గురు స్థా నాలు కలిగిన గణాలు - భ-జ-స
C) '3' గురువులు (UUU) కలిగియున్న గణం - 'మ' గణం
D) 3 లఘువులు (III] కలిగియున్న గణం - 'న' గణం.

పద్యం గణాలు అక్షరాలు యతి స్థా నం ప్రా స నియమం

ఉత్పలమాల భ,ర,న,భ,భ,ర,వ 20 10 ఉంటుంది

చంపకమాల న,జ,భ,జ,జ,జ,ర 21 11 ఉంటుంది

శార్ధూ లం మ,స,జ,స,త,త,గ 19 13 ఉంటుంది

మత్తేభం స,భ,ర,న,మ,య,వ 20 14 ఉంటుంది

క్రింది పద్య పాదాలకు గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి పద్యం పేరు రాయండి.

1.​ పలుచని నీచమానవుఁడు పాటిఁ దలంపక నిష్ఠు రోక్తు లం

2.​ లేవో గానలఁ గందమూల ఫలముల్, లేవో గుహల్తో యముల్

3.​ తెలివి యొకింత లేనియెడc దృప్తు డనై కరిభంగి సర్వమున్

9
4.​ ధరలో నెంతటి దుర్జ నుండయిన సత్సంగప్రభావంబుచే

గమనిక :
●​ చుక్క గుర్తు ఉన్న అన్ని పద్యాలలోని పాదాలను సాధన చేయవలెను.

Question No. 13 2×1=2

అ) అర్థ ం రాయడం ఆ) అర్థం గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :

అ) ముకురంలో తన ముఖాన్ని చూసి పిల్లవాడు ఆశ్చర్య పో యాడు. (గీత గీసిన పదానికి అర్థ ం
రాయండి.)

జ. అద్ద ం

ఆ) అతడు దేశానికి సేవ చేయాలనే వాంఛతో సైన్యంలో చేరాడు. (గీత గీసిన పదానికి సరియైన అర్థా న్ని
గుర్తించండి.)

అ) కోరిక ఆ) ఆందో ళన ఇ) ఆవేదన ఈ) క్రో ధం

జ. అ) కోరిక

అర్థా లు
1.​ జనకుడు = తండ్రి
2.​ అమరులు = మరణం లేనివారు
3.​ భూషణం = అలంకరణం

10
4.​ వాంఛ = కోరిక
5.​ హర్మ్యాలు = భవనాలు
6.​ హితము = మేలు
7.​ వెలితి = లోటు, తక్కువ
8.​ ఆశ్రయం = ఆధారం
9.​ పొ ద్ద స్త మానం = ఎల్ల ప్పుడు
10.​స్తిమితపడు = కుదుటపడు
11.​దిక్కు = అండ, ఆధారం
12.​దృప్తు డు = గర్విష్టి
13.​ఖ్యాతి = కీర్తి
14.​తల్పం = పాన్పు
15.​కాన = అడవి
16.​భాస్వంతుడు = సూర్యుడు
17.​శబ్ద కోశం = నిఘంటువు
18.​అపహాస్యం = వేళాకోళం
19.​సానపట్టు = పదునుపెట్టు
20.​ఆశీనులగు = ఆసనముపై కూర్చొను
21.​కాటకం = కరువు
22.​సితజాతి = తెల్లజాతి
23.​తులువ = నీచుడు
24.​రుధిరం = రక్త ం
25.​నిష్కల్మషంగా = స్వచ్ఛంగా
26.​బీజం = విత్త నం
27.​ఉత్త రోత్త ర = ముందుముందు
28.​ముకురం = అద్ద ం
29.​పికము = కోయిల
30.​నెమ్మి = నెమలి
31.​సరోవరం = కొలను, సరస్సు
32.​నెత్తా వి = అధికమైన సువాసన
33.​విన్యాసాలు = ప్రదర్శనలు
34.​అంధకారం = చీకటి
35.​ఆత్మస్థైర్యం = మనోధైర్యం
36.​వేణువు = పిల్లనగ్రో వి
37.​లేశము = కొంచెం
38.​కాపురుషుడు = చెడ్డవాడు, దుష్టు డు
39.​స్వప్నం = కల
40.​ఆస్థ = శ్రద్ధ
41.​భిషక్కులు = వైద్యులు
42.​హితులు = మేలుకోరేవారు
43.​మృషలు = అబద్ధా లు

11
44.​శిస్తు = పన్ను
45.​వూష్ట ం = జ్వరం
46.​ఖాయిలా = దివాళా
47.​గొట్టి కాయలు = గోలీ కాయలు
48.​తర్జు మా = అనువాదం
49.​తథ్యం = తప్పకుండా
50.​దరహాసం = చిరునవ్వు
51.​వ్యూహం = ప్రణాళిక
52.​త్యజించి = విడిచిపెట్టి
53.​ఆద్యుడు = మొదటివాడు
54.​అపేక్ష = కోరిక
55.​సద్గ తి = మోక్షం
56.​ఘనత = గొప్పదనం
57.​ఆరడి = నింద

గమనిక :
●​ పాఠ్యపుస్త కం చివరనున్న పదవిజ్ఞా నంలోనివి కూడా చూసుకోవలెను.

Question No. 14 2×1=2

అ) పర్యాయపదాలు రాయడం ఆ) పర్యాయపదాలు గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :

అ) అమృతం సేవించిన వారికి మరణం ఉండదు. (గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.)

జ. సుధ, పీయూషం

ఆ) పండితులు వేదికపై ఆసీనులు అయ్యారు. (గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.)

అ) వికసము, చాట ఆ) వృక్షము, తరుగు ఇ) అరుగు, తిన్నె ఈ) అంబరము, గగనం

జ. ఇ) అరుగు, తిన్నె

పర్యాయపదాలు

1.​ పుత్రు డు = కొడుకు, కుమారుడు

12
2.​ వస్త ం్ర = వలువ, అంబరము, పుట్ట ము
3.​ జనని = తల్లి, అమ్మ
4.​ చక్షువు = కన్ను, నయనం, నేతం్ర
5.​ వహ్ని = అగ్ని, నిప్పు, అనలం
6.​ సొ మ్ము = ధనం, డబ్బు
7.​ ఝషం = చేప, మత్స్యం
8.​ దేహం = ఒళ్ళు, శరీరం
9.​ ప్రభాతవేళ = ప్రా తః కాలము, వేకువ
10.​పండితుడు = బుధుడు, విద్వాంసుడు
11.​భుజగం = పాము, ఫణి
12.​కరి = ఏనుగు, గజము
13.​పక్షి = ఖగము, పులుగు
14.​హరి = విష్ణు వు, శౌరి
15.​మనీషి = విద్వాంసుడు, పండితుడు
16.​కుత్తు క = గొంతు, కంఠం
17.​వక్త = ఉపన్యాసకుడు, ప్రవక్త , మాటగాడు
18.​వేదిక = అరుగు, వేద,ి తిన్నె
19.​పయోదం = మబ్బు, మేఘం, అంబుదం
20.​ఆర్తి = బాధ, దుఃఖం
21.​రణం = యుద్ధ ం, సమరం, సంగ్రా మం
22.​ఉదకం = నీరు, జలం
23.​అబ్ద ము = సంవత్సరం, ఏడాది
24.​హృదయం = డెందము, ఎద
25.​వర్షం = వాన, వృష్టి
26.​ఈప్సితము = కోరిక, కాంక్ష
27.​పుష్పాలు = కుసుమాలు, విరులు
28.​రజని = రాత్రి, రేయి
29.​కొండ = పర్వతం, గిరి
30.​అడవులు = అరణ్యాలు, విపినాలు
31.​ఆట = నటన, లాస్యం
32.​అమృతం = సుధ, పీయూషం
33.​ఆకలి = క్షుత్తు , క్షుధ
34.​రవి = సూర్యుడు, భానుడు
35.​శిక్షణ = అభ్యాసం, తర్ఫీదు
36.​ఆకాంక్ష = కోరిక, ఆశ
37.​కలను = యుద్ధ ం, సమరం
38.​బృందం = సమూహం, గుంపు
39.​క్షితి = నేల, భూమి, ధరణి
40.​వ్రా తము = సమూహం, మంద
41.​ఉత్త రం = జాబు, లేఖ

13
42.​జీతం = వేతనం, భృతి
43.​సొ మ్ము = ధనం, ద్రవ్యం
44.​యుద్ధ ం = సమరం, సంగ్రా మం
45.​విజయం = గెలుపు, జయం
46.​కీర్తి = యశస్సు, మంచి పేరు
47.​ప్రా ణం = ఉసురు, జీవం
48.​కోరిక = వాంఛ, ఈప్సితం
49.​ఒరులు = పరులు, ఇతరులు
50.​మేను = శరీరం, దేహం
51.​చింత = దిగులు, బెంగ
52.​స్వర్గ ం = దివి, నాకం

గమనిక :
●​ పాఠ్యపుస్త కం చివరనున్న పదవిజ్ఞా నంలోనివి కూడా చూసుకోవలెను.

Question No. 15 2×1=2


అ) ప్రకృతి పదం రాయడం ఆ) వికృతి పదం గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :

అ) రైతుల కస్తి వృథా కాకూడదు. (గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి.)

జ. కష్ట ము

ఆ) ఎల్ల మ్మ ప్రా ణము విలవిలలాడింది. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)

అ) పగితి ఆ) పక్కి ఇ) ప్రణవం ఈ) పానము

జ. ఈ) పానము

ప్రకృతి - వికృతి

1.​ యజ్ఞ ం - జన్నం


2.​ కార్యం - కర్జ ం
3.​ దృఢం - దిటవు
4.​ పుత్రు డు - బొ ట్టె
5.​ విజ్ఞా నం - విన్నాణం

14
6.​ హృదయం - ఎద
7.​ ముఖం - మోము
8.​ పంక్తి - బంతి
9.​ కష్ట ం - కస్తి
10.​మూర్ఖు డు - మొరకు
11.​సుఖము - సుగము
12.​వీధి - వీది
13.​చంద్రు డు - చందురుడు
14.​నిత్యము - నిచ్చలు
15.​స్వామి - సామి
16.​హంస - అంచ
17.​ధర్మము - దమ్మము
18.​గుణము - గొనము
19.​యముడు - జముడు
20.​దో షి - దో సి
21.​చండికా - చండి
22.​రాక్షసుడు - రక్కసుడు
23.​ఆసక్తి - ఆసత్తి
24.​తంత్రం - తంతు
25.​చిత్రం - చిత్త రువు
26.​ఖండం - కండ / గండ్ర
27.​మేఘం – మొగులు
28.​నాట్యము – నట్టు వ
29.​కవిత – కయిత
30.​సంభ్రమము – సంబరము
31.​అపూర్వం – అబ్బురం
32.​పక్షి – పక్కి
33.​వైద్యులు – వెజ్జు లు
34.​ఆశ్చర్యం – అచ్చెరువు
35.​అర్ధ రాత్రి – అద్ద మరేయి
36.​రాత్రి - రేయి
37.​మౌక్తికం - ముత్తెము
38.​పశువు - పసరము
39.​ద్వీపం - దీవి
40.​శక్తి - సత్తు వ
41.​నిద్ర - నిదుర
42.​పురము – ప్రో లు
43.​నీరము – నీరు
44.​దర్శనం – దరిసెనము
45.​ఛాత్రు డు – చట్టు

15
46.​పద్యం - పద్దెం
47.​ప్రకృతి – పగిది
48.​భోగము – బో గము
49.​పుణ్యం – పున్నెము
50.​గర్వము – గరువం
51.​భక్తి – బత్తి
52.​స్థిరం – తిరం
53.​ప్రా ణం – పానం
54.​గుణం – గొనం
55.​భాష – బాస
56.​నిజం – నిక్కం

గమనిక :
●​ పాఠ్యపుస్త కం చివరనున్న పదవిజ్ఞా నంలోనివి కూడా చూసుకోవలెను.

Question No. 16 2×1=2

అ) నానార్థా లు రాయడం ఆ) నానార్థా లు గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :


అ) రాజులు రాజ్యం కోసం యుద్ధా లు చేస్తా రు. (గీత గీసిన పదానికి నానార్థా లు రాయండి.)

జ. రాష్ట ం్ర , ఏలుబడి

ఆ) శ్రీరాముని శరమునకు తిరుగులేదు. (గీత గీసిన పదానికి సరైన నానార్థా లు గుర్తించండి.)

అ) బాణము, రెల్లు ఆ) శబ్దా ర్థ ము, ధనము ఇ) కాయము, తనువు ఈ) ఆకాశం, వస్త ం్ర

జ. అ) బాణము, రెల్లు

నానార్థా లు

1.​ గురువు = తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి


2.​ అర్థ ం = శబ్దా ర్థ ము, ధనము
3.​ ఫలం = పండు, ప్రయోజనం

16
4.​ బుధుడు = పండితుడు, బుధ గ్రహం
5.​ వంశం = కులం, వెదురు, పిల్లనగ్రో వి
6.​ బతుకు = జీవనం, స్థితి, జరుగుబాటు
7.​ సంతానం = బిడ్డ , ఒక కల్పవృక్షం, కులం
8.​ సంసారం = కాపురం, కుటుంబం, పుట్టు క
9.​ ధర = భూమి, ఖరీదు
10.​శ్రీ = లక్ష్మీదేవి, సంపద
11.​వారి = నీరు, పంచదార
12.​శ్రమ = కష్ట ము, అలసట, చెమట
13.​మిత్రు డు = స్నేహితుడు, సూర్యుడు
14.​హరి = విష్ణు వు, కోతి, సింహం
15.​గజం = ఏనుగు, మూడు అడుగుల కొలత, ఎనిమిది అను సంఖ్య
16.​మోక్షం = ముక్తి, విడుదల, చావు
17.​అరుణం = ఎరుపు, కుష్టు వ్యాధి, బంగారం
18.​మతం = అభిప్రా యం, శాస్త ం్ర , సమ్మతి
19.​కొమ్మ = శాఖ, స్త్రీ, కోట బురుజు
20.​నెమ్మి = ప్రేమ, నెమ్మది, నెమలి
21.​గగనం = ఆకాశం, శూన్యం, దుర్ల భం
22.​ఉదరము = పొ ట్ట , యుద్ధ ం, నడుము
23.​విన్యాసము = ఉంచుట, చక్కని ప్రదర్శన, రచన
24.​అమృతం = సుధ, పాలు, ముక్తి
25.​మబ్బు = మేఘము, చీకటి, అజ్ఞా నం
26.​వృద్ధి = అభివృద్ధి, వడ్డీ, సంతోషం
27.​నయం = నీతి, మృదువు, అందం
28.​ఋతం = సత్యం, నీరు, సత్ప్రవర్త న
29.​కాడ = తొడిమ, బాణం
30.​శరం = రెల్లు , బాణం, నీరు
31.​తల్లి = మాత, పెద్దది, పూజ్యురాలు
32.​పెద్ద = వృద్ధు డు, గొప్పవాడు, జ్యేష్ఠు డు
33.​అధికారం = దొ రతనం, అధ్యక్షత, ఆశ్రయం
34.​అర్థ ము = ధనము, కారణం, శబ్దా ర్థ ం
35.​సంతోషం = ఆనందం, తృప్తి, ధైర్యం
36.​పశువు = గొఱ్ఱె, ఆత్మ, ప్రమథ గణము
37.​కాలం = సమయం, నలుపు, చావు
38.​రాజ్యం = రాష్ట ం్ర , ఏలుబడి, దొ రతనం
39.​మతి = ఎఱుక, తెలివి, బుద్ధి
40.​కులం = వంశం, జాతి, ఇల్లు
41.​గుణం = స్వభావం, వింటినారి
42.​సుధ = పాలు, అమృతం, సున్నం

17
గమనిక :
●​ పాఠ్యపుస్త కం చివరనున్న పదవిజ్ఞా నంలోనివి కూడా చూసుకోవలెను.

Question No. 17 2×1=2


అ) వ్యుత్పత్త ్యర్థం రాయడం అ) వ్యుత్పత్త ్యర్ధం గుర్తించడం

అ) హిమాలయాలు నీహారముతో కప్పబడి ఉన్నాయి. (గీత గీసిన పదానికి వ్యుత్పత్త ్యర్థ ం రాయండి.)

జ. అగ్ని చేత మిక్కిలి హరింపబడునది

ఆ) అర్జు నుడి గురువు ద్రో ణాచార్యుడు. (గీత గీసిన పదానికి వ్యుత్పత్త ్యర్ధ ం గుర్తించండి.)

అ) భూమిని పాలించువాడు ఆ) అన్నింటిని తెలిసినవాడు


ఇ) అజ్ఞా నాంధకారమును తొలగించువాడు ఈ) కాంతిని కలుగజేయువాడు

జ. ఇ) అజ్ఞా నాంధకారమును తొలగించువాడు

వ్యుత్పత్త ్యర్థా లు

1.​ విశ్వము (లోకము) ను ధరించునది - ధర్మం


2.​ అన్నింటిని ఎఱిగినవాడు / తెలిసినవాడు - బుధుడు
3.​ సంతానమును కనునది - జనని
4.​ జమదగ్ని మహర్షి కుమారుడు - జామదగ్ని
5.​ బంగారం గర్భమందు కలిగినది - వసుధ
6.​ కాంతిని కలుగుజేయువాడు - భాస్కరుడు
7.​ కుటిలముగా పో వునది - భుజగము
8.​ స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు - ఈశ్వరుడు
9.​ హస్త ము (తొండము) కలది - హస్తి
10.​అగ్ని చేత మిక్కిలి హరింపబడునది - నీహారము
11.​నరక కూపమున పడుటకు కారణమైనది - పాతకము
12.​పానము చేయదగినది - పానీయము
13.​చాటు నుండి కూయునది - పికము
14.​చలనము లేనిది - అచలము
15.​వర్షములచే భూమిని తడుపునది - మేఘం
16.​మరణంతో కూడినది - సమరం
17.​దీనియందంతట సూర్యచంద్రు లు ప్రకాశించుదురు - ఆకాశం

18
18.​మరణాన్ని పొ ందింపనిది / కలిగింపనిది - అమృతం
19.​విశ్వానికి నాథుడు - విశ్వనాథుడు
20.​అజ్ఞా నాంధకారాన్ని తొలగించేవాడు - గురువు
21.​పురమునకు హితము చేయువాడు - పురోహితుడు
22.​రహస్యమున కార్యాలోచనము కలవాడు / ఆలోచన కర్త - మంత్రి
23.​హింసను కోరునది / నరులను పీడించునది - నృశంస్యము
24.​ భూమి నుండి పుట్టినది - భూరుహము

గమనిక :
●​ పాఠ్యపుస్త కం చివరనున్న పదవిజ్ఞా నంలోనివి కూడా చూసుకోవలెను.

Question No. 18 1×2=2


వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయడం

ప్రశ్న అడిగే తీరు :

నిరంతరం సానబట్టు ట వలన ఏ విషయంలోనైనా నైపుణ్యం సాధించవచ్చు. (వాక్యంలోని జాతీయాన్ని


గుర్తించి విడిగా రాయండి.)

జ. సానబట్టు

వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

1.​ రైతులు పొ ద్ద స్త మానం కష్ట పడితే గానీ కడుపులు నిండవు.
జ) పొ ద్ద స్త మానం
2.​ చూసేవారు లేక అనాథలు వీధిపాలవుతున్నారు.
జ) వీధిపాలు చేయు
3.​ భూకంపం వలన ప్రా ణ నష్ట ం లేకపో వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జ) ఊపిరి పీల్చుకొను
4.​ మాస్టా రు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక విద్యార్థి తెల్లముఖం వేసాడు.
జ) తెల్లముఖం వేయు
5.​ తెలివికి సానపట్టు సాధనాలు పుస్త కాలు
జ) సానపట్టు
6.​ ఏ పుట్ట లో ఏముందో అన్నట్లు ఎవరిలో ఎంత జ్ఞా నం ఉందో తెలియదు.
జ) ఏ పుట్ట లో ఏముందో

19
7.​ ప్రశ్నకు సమాధానం తెలియకపో తే నేల చూపులు చూస్తా ము.
జ) నేల చూపులు చూడటం
8.​ ఆదిలోనే హంసపాదులా రాజధాని నిర్మాణం ఆగిపో యింది.
జ) ఆదిలోనే హంసపాదు
9.​ భారతీయుడు ఆహారమునకు అంగలార్చడు.
జ) అంగలార్చు
10.​యుద్ధ ంలో వెన్నుచూపరాదు.
జ) వెన్నుచూపు
11.​అమ్మ పిల్లలకు మంచితనాన్ని ఉగ్గు పాలతో పెడుతుంది.
జ) ఉగ్గు పాలతో పెట్టు
12.​తరగతి గదిలో పిల్లలు గుసగుసలాడుతారు.
జ) గుసగుసలు
13.​మా పాఠశాల పదవ తరగతి ఫలితాలు మారుమ్రో గిపో యాయి.
జ) మారుమ్రో గుట
14.​మనసులో ముల్లు గుచ్చుకున్నట్లు ఎవరితోనూ మాట్లా డరాదు.
జ) మనసులోముల్లు
15.​జీవితం చేజారిపో నీయకూడదు.
జ) చేజారిపో వు
16.​అతడు చేయి తిరిగిన రచయిత.
జ) చేయి తిరిగిన
17.​చీకుచింతా లేని జీవితమే జీవితం.
జ) చీకుచింతా
18.​ఉన్నత జీవితానికి మూలబీజాలు బాల్యంలోనే నాటాలి.
జ) మూలబీజాలు
19.​వర్షా ల కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తా రు.
జ) కళ్ళు కాయలు కాచు
20.​బాలు పాటలంటే అందరూ చెవి కోసుకుంటారు.
జ) చెవికోసుకొను
21.​తల్లిదండ్రు లు పిల్లలను కడుపులో పెట్టు కొని పెంచుతారు.
జ) కడుపులో పెట్టు కొను
22.​నా చర్మంతో మీకు చెప్పులు కుట్టించినా మీ ఋణం తీరదు.
జ) చర్మం చెప్పులు కుట్టించు

ఇంకొన్ని జాతీయాలు

వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి.

20
1.​ గురువు ఆదేశాలను సుగ్రీవాజ్ఞ గా భావించాలి.
జ) సుగ్రీవాజ్ఞ
2.​ పంటల దిగుబడి తగ్గినందున రైతుల గుండెలు బరు వెక్కాయి.
జ) గుండెలు బరువెక్కుట
3.​ పెద్దల ఆశీస్సులే మనకు శ్రీరామరక్ష.
జ) శ్రీరామరక్ష
4.​ ప్రతి జీవి కాలధర్మం చెందాల్సిందే.
జ) కాలధర్మం
5.​ దురలవాట్లు కబంధ హస్తా ల వంటివి.
జ) కబంధ హస్తా లు
6.​ వలస కూలీలు పనులు దొ రకక బాధపడుతూ కడుపులు మాడ్చుకొంటున్నారు.
జ) కడుపులు మాడ్చుకొను
7.​ తుఫాను వలన రైతుల ఆశలు నీరుగారిపో యాయి.
జ) నీరుగారిపో వు
8.​ చెడు వ్యసనాల వలన ఉన్నదంతా ఊడ్చుకుపో యింది.
జ) ఉన్నదంతా ఊడ్చుకుపో వుట
9.​ తుఫాను పంట పొ లాలను నాశనం చేయడంతో రైతుల గుండెలు బరువెక్కాయి.
జ) గుండెలు బరువెక్కుట
10.​మా ఉపాధ్యాయుడి ఉపదేశం కనువిప్పు కల్గించింది.
జ) కనువిప్పు
11.​నిత్యావసర వస్తు వుల ధరలు మిన్నందుకొనుచున్నవి.
జ) మిన్నందుకొనుట
12.​ఎవరి దగ్గ రా చేతులు నలుపుకొంటూ దీనంగా ఉండకూడదు.
జ) చేతులు నలుపుకొను
13.​ఆరునూరైనా పెళ్ళి చేసుకోనని భీష్ముడు ప్రతిజ్ఞ చేసాడు.
జ) ఆరునూరైనా
14.​సమాజంలో తేనెపూసిన కత్తి లాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి.
జ) తేనెపూసిన కత్తి
15.​శ్రీకృష్ణ దేవరాయలు పండితులకు అగ్రతాంబూలం ఇచ్చారు.
జ) అగ్రతాంబూలం
16.​కొంచెం నాకు ప్రథమ కోపం, ఎవరో తెలియకుండా అన్నమాటలు గణించకండేం.
జ) ప్రథమ కోపం
17.​యుద్ధ ంలో గెలిచిన ఔరంగజేబు గర్వాన్ని నెత్తి కెక్కించు కున్నాడు.
జ) నెత్తి కెక్కించుకొను
18.​అందరూ ప్రపంచశాంతికి నడుం కట్టా లి.
జ) నడుం కట్టు
19.​కళింగ యుద్ధ ంలో అశోకుడు విజయభేరి మోగించాడు.
జ) విజయభేరి
20.​అన్నమయ్య సంకీర్తనలలోని విషయాలు కాలధర్మం చెందవు.
జ) కాలధర్మం

21
21.​సంకీర్తనాకారులలో అన్నమయ్యది అగ్రతాంబూలం.
జ) అగ్రతాంబూలం
22.​ఎంత పాండిత్యం గడిచినా పాప పంకిలంలో పడకూడదు.
జ) పాప పంకిలం
23.​భగవంతుని దృష్టిలో హెచ్చుతక్కువలు ఉండవు.
జ) హెచ్చుతక్కువలు
24.​రాము చిచ్చరపిడుగై విజయాలను సాధించాడు.
జ) చిచ్చరపిడుగు
25.​చీటికి మాటికి పిల్లలు విసిగిస్తా రు.
జ) చీటికి మాటికి
26.​కొందరు గోడమీది పిల్లి లా వ్యవహరిస్తా రు.
జ) గోడమీది పిల్లి
27.​మా వీథిలో తామరతంపరలా దుకాణాలు పుట్టా యి.
జ) తామరతంపర
28.​వాడు తేనె పూసిన కత్తి , జాగ్రత్తగా ఉండాలి.
జ) తేనె పూసిన కత్తి
29.​రాము అందరి తలలో నాలుక వలె వ్యవహరిస్తా డు.
జ) తలలో నాలుక
30.​నేటి ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు విడిచింది.
జ) తిలోదకాలు విడుచు
31.​మన ప్రభుత్వం పో లవరం ప్రా జెక్టు ను పూర్తి చేయడానికి కంకణం కట్టు కుంది.
జ) కంకణం కట్టు కొను.
32.​వాళ్ళకేంటి? వాళ్ళు ఆస్తిపరులు, కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్నారు.
జ) కడుపులో చల్ల కదలకుండా
33.​దుర్మార్గు లతో సహవాసం కత్తి మీద సాము వంటిద.ి
జ) కత్తి మీద సాము

మరికొన్ని జాతీయాలు

1.​ మంచినీళ్ళ ప్రవాహం


2.​ టోపీ వ్యవహారం
3.​ పాలుపో క
4.​ అరటిపండు విప్పినట్లు
5.​ కనువిప్పు
6.​ పశ్చాత్తా పం
7.​ విజయగర్వం
8.​ అగమ్యగోచరం
9.​ ఏకరువు పెట్టడం
10.​వెన్నతో నేర్పిన విద్య

22
11.​కడుపుకొట్టు
12.​కడుపున కాయకాచు
13.​వెలితి కుండ
14.​నిండు కుండ

Question No. 19 1×2=2


ఇచ్చిన జాతీయనికి అర్థం / సందర్భం రాయడం

గమనిక - ఉపవాచకం - రామాయణం నుండి మాత్రమే అడుగుతారు.

ప్రశ్న అడిగే తీరు :

‘సుగ్రీవాజ్ఞ ’ ఈ జాతీయం ఏ అర్థ ంలో / ఏ సందర్భంలో వాడతారో రాయండి.

జ. సుగ్రీవాజ్ఞ - ‘తిరుగులేని ఆజ్ఞ ’ అనే అర్థ ంలో ఈ జాతీయాన్ని వాడతారు.

జాతీయాలు

1.​ శ్రీరామరక్ష : ఎల్ల ప్పుడూ రక్షించడం, రక్షించ గలిగినది అనే అర్థా లలో ఈ జాతీయాన్ని వాడతారు.
2.​ భగీరథ ప్రయత్నం : ఎక్కువ కష్ట పడి సాధించడం, తీవ్ర ప్రయత్నం చేయడం అనే అర్థా లలో ఈ
జాతీయాన్ని వాడతారు.
3.​ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు : ఎంత చెప్పినా వినిపించుకోకపో వడం అనే అర్థ ంలో ఈ
జాతీయాన్ని వాడతారు.
4.​ చెవినిల్లు కట్టు కొని పో రు : పదే పదే చెప్పడం అనే అర్థ ంలో ఈ జాతీయాన్ని వాడతారు.
5.​ గతజల సేతుబంధనం : నష్ట ం జరిగిన తరువాత జాగ్రత్తలు తీసుకోవడం అనే అర్థ ంలో ఈ
జాతీయాన్ని వాడతారు.
6.​ కబంధ హస్తా లు : తప్పించుకోవడానికి వీలులేకుండా పట్టు కునే చేతులు అనే అర్థ ంలో ఈ
జాతీయాన్ని వాడతారు.
7.​ అగస్త ్య భ్రా త : పేరు తెలియని వానిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
8.​ సుగవ ్రీ ాజ్ఞ : తిరుగులేని ఆజ్ఞ అనే అర్థ ంలో ఈ జాతీయాన్ని వాడతారు.
9.​ బూడిదలో పో సిన పన్నీరు : నిష్ప్రయోజనం అనే అర్థ ంలో ఈ జాతీయాన్ని వాడతారు.
10.​గుండెల్లో రాయిపడటం : భయపడు అనే అర్థ ంలో ఈ జాతీయాన్ని వాడతారు.
11.​అగ్నికి ఆజ్యం పో యడం : సమస్య తీవ్రం కావడం అనే అర్థ ంలో ఈ జాతీయాన్ని వాడతాను.
12.​పిడుగుపాటు : అకస్మాత్తు గా అనే అర్థ ంలో ఈ జాతీయాన్ని వాడతారు.
13.​శ్రీకారం చుట్ట డం : ఒక పనిని ప్రా రంభించడం అనే అర్థ ంలో ఈ జాతీయాన్ని వాడతారు.

23
14.​పెడచెవిన పెట్టు : మాట వినకపో వడం, మంచి చెబితే వినిపించుకోకపో వడం అనే అర్థా లలో ఈ
జాతీయాన్ని వాడతారు.
15.​బ్రహ్మాస్త ం్ర : తిరుగులేని అస్త ం్ర , తిరుగులేని శక్తిని ప్రయోగించడం అనే అర్థా లలో ఈ జాతీయాన్ని
వాడతారు.
16.​చూసిరమ్మంటే కాల్చి రావడం : అప్పగించిన పనిని నెరవేర్చడంతో పాటు దానికి సంబంధించిన
ఇతర పనులను కూడా చేయడం అనే అర్థా లలో ఈ జాతీయాన్ని వాడతారు.

Question No. 20 1×1=1

వాక్యంలో ఇచ్చిన సంధి పదాన్ని విడదీసి రాయడం

ప్రశ్న అడిగే తీరు :

అన్నమయ్య గొప్ప సంకీర్తనాచార్యుడు. (గీతగీసిన పదాన్ని విడదీసి రాయండి. )

జ. సంకీర్తన + ఆచార్యుడు

Question No. 21 1×1=1


ఇచ్చిన సంధి పదాలను కలిపి రాయడం

ప్రశ్న అడిగే తీరు :

నీలము + కండ్లు (సంధి పదాలను కలిపి రాయండి.)

జ. నీలపు కండ్లు

24
Question No. 22 1×1=1
ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందినదో గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :

అప్పుడప్పుడు బాల్య స్నేహితులను కలుసుకోవాలి. (గీతగీసిన పదం ఏ సంధికి చెందిందో గుర్తించండి.)

అ) అత్వసంధి ఆ) ఆమ్రేడిత సంధి ఇ) రుగాగమ సంధి ఈ) సవర్ణ దీర్ఘ సంధి

జ. ఆ) ఆమ్రేడిత సంధి

సంధులు
1.​ నిజంబగు = నిజంబు + అగు - ఉత్వసంధి
2.​ మూలంబైనది = మూలంబు + ఐనది - ఉత్వసంధి
3.​ కలదొ క = కలదు + ఒక - ఉత్వసంధి
4.​ వేల్పులనఘ = వేల్పులు + అనఘ - ఉత్వసంధి
5.​ నీవొకరుండవు = నీవు + ఒకరుండవు - ఉత్వసంధి
6.​ జ్ఞా నార్థ ంబు = జ్ఞా న + అర్థ ంబు - సవర్ణ దీర్ఘ సంధి
7.​ విజ్ఞా నోన్నతి = విజ్ఞా న + ఉన్నతి - గుణసంధి
8.​ అభ్యంతరం = అభి + అంతరం - యణాదేశ సంధి
9.​ ధర్మాత్ముడు = ధర్మ + ఆత్ముడు - సవర్ణ దీర్ఘ సంధి
10.​ఇమ్మెయి = ఈ + మెయి - త్రిక సంధి
11.​ఇమ్మహాత్ముడు = ఈ + మహాత్ముడు - త్రిక సంధి
12.​అవ్విప్రు డు = ఆ + విప్రు డు - త్రిక సంధి
13.​అప్పతివ్రత = ఆ + పతివ్రత - త్రిక సంధి
14.​ఎమ్మెయిన్ = ఏ + మెయిన్ - త్రిక సంధి
15.​ఇక్కన్య = ఈ + కన్య - త్రిక సంధి
16.​పుణ్యాత్ముడు = పుణ్య + ఆత్ముడు - సవర్ణ దీర్ఘసంధి
17.​విషయమంతా = విషయము + అంతా - ఉత్వసంధి
18.​పండ్ల మ్ముకొను = పండ్లు + అమ్ముకొను - ఉత్వ సంధి
19.​ఉన్నదేదో = ఉన్నది + ఏదో - ఇత్వసంధి
20.​పో దామనుకుంటే = పో దాము + అనుకుంటే - ఉత్వసంధి
21.​స్నానాలు = స్నానము + లు - లు,ల,నల సంధి
22.​ఏమైనది = ఏమి + ఐనది - ఇత్వసంధి
23.​అక్కడక్కడ = అక్కడ + అక్కడ - ఆమ్రేడితసంధి
24.​జీవితమంత = జీవితము + అంత - ఉత్వసంధి
25.​నిష్ఠు రోక్తు లు = నిష్ఠు ర + ఉక్తు లు - గుణసంధి
26.​వేంకటేశ = వేంకట + ఈశ - గుణసంధి

25
27.​అవ్వారి = ఆ + వారి - త్రికసంధి
28.​మనుజుడగునే = మనుజుడు + అగునే - ఉత్వసంధి
29.​ధీరోత్త ముడు = ధీర + ఉత్త ముడు - గుణసంధి
30.​కాళికాంబ = కాళికా + అంబ - సవర్ణ దీర్ఘ సంధి
31.​అప్పలుకులు = ఆ + పలుకులు - త్రికసంధి
32.​దానంబు సేయుట = దానంబు + చేయుట - గసడదవాదేశ సంధి
33.​ఏలొకో = ఏల + ఒకో - అత్వ సంధి
34.​వాఙ్మయము = వాక్ + మయము - అనునాసిక సంధి
35.​రాట్ + మహేంద్రవరం = రాణ్మహేంద్రవరం - అనునాసిక సంధి
36.​జగన్నాథుడు = జగత్ + నాథుడు - అనునాసిక సంధి
37.​అమ్మయము = అప్ + మయము - అనునాసిక సంధి
38.​జగన్నివేశ = జగత్ + నివేశ - అనునాసిక సంధి
39.​దిఙ్మండలము = దిక్ + మండలము - అనునాసిక సంధి
40.​రాణ్మణి = రాట్ + మణి - అనునాసిక సంధి
41.​ఏడేళ్ళు = ఏడు + ఏళ్ళు - ఉత్వసంధి
42.​మహో త్కృష్ట = మహా + ఉత్కృష్ట - గుణసంధి
43.​ఎవరన్నారు = ఎవరు + అన్నారు - ఉత్వసంధి
44.​పొ ందాలనుకుంటారు = పొ ందాలి + అనుకుంటారు - ఇత్వ సంధి
45.​కదిలినప్పుడు = కదిలిన + అప్పుడు - అత్వసంధి
46.​ఉన్నతోన్నత = ఉన్నత + ఉన్నత - గుణసంధి
47.​అత్యంత = అతి + అంత - యణాదేశసంధి
48.​ఉత్త మమైనది = ఉత్త మము + ఐనది - ఉత్వసంధి
49.​స్వోత్కర్ష = స్వ + ఉత్కర్ష - గుణసంధి
50.​క్రొ మ్మావి = క్రొ త్త + మావి - ప్రా తాది సంధి
51.​ముంజేయి = ముందు + చేయి - ప్రా తాది సంధి
52.​ప్రా ఁగెంపు = ప్రా త + కెంపు - ప్రా తాది సంధి
53.​లేమొగ్గ = లేత + మొగ్గ - ప్రా తాది సంధి
54.​క్రొ ంజెమట = క్రొ త్త + చెమట - ప్రా తాది సంధి
55.​మీఁగడ = మీదు + కడ - ప్రా తాది సంధి
56.​క్రొ త్త కుండలు = క్రొ త్త + కుండలు - ప్రా తాది సంధి
57.​కవటాకులు = కవట + ఆకులు - అత్వసంధి
58.​ప్రా ణార్థ ములు = ప్రా ణ + అర్థ ములు - సవర్ణ దీర్ఘ సంధి
59.​పాలుఁజేసి = పాలున్ + చేసి - సరళాదేశసంధి
60.​ధ్వజమెత్తి = ధ్వజము + ఎత్తి - ఉత్వసంధి
61.​ప్రత్యేకత = ప్రతి + ఏకత - యణాదేశ సంధి
62.​దీపాలు = దీపము + లు - లు,ల,నల సంధి
63.​ఎప్పుడైన = ఎప్పుడు + ఐన - ఉత్వసంధి
64.​దశాబ్ద ం = దశ + అబ్ద ం - సవర్ణ దీర్ఘ సంధి
65.​తల్లిదండ్రు లు = తల్లి + తండ్రి - గసడదవాదేశ సంధి
66.​ఇన్నేళ్ళు = ఇన్ని + ఏళ్ళు - ఇత్వసంధి

26
67.​పుస్త కాలు = పుస్త కము + లు - లు,ల,నల సంధి
68.​చిన్నప్పుడు = చిన్న + అప్పుడు - అత్వసంధి
69.​సాహిత్యాభిమానం = సాహిత్య + అభిమానం - సవర్ణ దీర్ఘ సంధి
70.​వాగీశుడు = వాక్ + ఈశుడు - జశ్త ్వ సంధి
71.​అజంతం = అచ్ + అంతం - జశ్త ్వ సంధి
72.​విరాడ్రూ పం = విరాట్ + రూపం - జశ్త ్వ సంధి
73.​జగదంబ = జగత్ + అంబ - జశ్త ్వ సంధి
74.​వాగ్వాదం = వాక్ + వాదం - జశ్త ్వ సంధి
75.​హృద్ద్వారం = హృత్ + ద్వారం - జశ్త ్వ సంధి
76.​దిగంతం = దిక్ + అంతం - జశ్త ్వ సంధి
77.​తద్రు ధిరధారలు = తత్ + రుధిరధారలు - జశ్త ్వ సంధి
78.​మతములన్ని = మతములు + అన్ని - ఉత్వసంధి
79.​పూదేనె = పూవు + తేనె - ప్రా తాదిసంధి
80.​లతాళి = లతా + ఆళి - సవర్ణ దీర్ఘ సంధి
81.​కొలువైన = కొలువు + ఐన = ఉత్వసంధి
82.​భయపడు = భయము + పడు - పడ్వాది సంధి
83.​సూత్రపట్టు = సూత్రము + పట్టు - పడ్వాది సంధి
84.​భంగపాటు = భంగము + పాటు - పడ్వాది సంధి
85.​అవమానపెట్టు = అవమానము + పెట్టు - పడ్వాది సంధి
86.​సైనికురాలు = సైనిక + ఆలు - రుగాగమ సంధి
87.​ప్రత్యేకం = ప్రతి + ఏకం - యణాదేశ సంధి
88.​కుటుంబమంతా = కుటుంబము + అంతా - ఉత్వసంధి
89.​ఎండుటాకు = ఎండు + ఆకు - టుగాగమ సంధి
90.​అవయవాలు = అవయవము + లు - లు,ల,న,ల సంధి
91.​మరొక = మరి + ఒక - ఇత్వసంధి
92.​అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు - ఆమ్రేడిత సంధి
93.​అవసరమైన = అవసరము + ఐన - ఉత్వసంధి
94.​తగిలినంత = తగిలిన + అంత - అత్వసంధి
95.​శిరోరత్నం = శిరః + రత్నం - విసర్గ సంధి
96.​తపో బలం = తపః + బలం - విసర్గ సంధి
97.​పయోనిధి = పయః + నిధి - విసర్గ సంధి
98.​వచోనిచయం = వచః + నిచయం - విసర్గ సంధి
99.​మనశ్శాంతి = మనః + శాంతి - విసర్గ సంధి
100.​ చతుష్ష ష్టి = చతుః + షష్టి - విసర్గ సంధి
101.​ నభస్సుమం = నభః + సుమం - విసర్గ సంధి
102.​ యశః కాయము = యశః + కాయము - విసర్గ సంధి
103.​ తపఃఫలము = తపః + ఫలము - విసర్గ సంధి
104.​ అంతరాత్మ = అంతః + ఆత్మ - విసర్గ సంధి
105.​ ధనుర్విద్య = ధనుః + విద్య - విసర్గ సంధి
106.​ చతుర్భుజుడు = చతుః + భుజుడు - విసర్గ సంధి

27
107.​ ఆశీర్వాదము = ఆశీః + వాదము - విసర్గ సంధి
108.​ పునరాగమనము = పునః + ఆగమనము - విసర్గ సంధి
109.​ అంతరంగం = అంతః + అంగం - విసర్గ సంధి
110.​ ధనుష్కండం = ధనుః + ఖండం - విసర్గ సంధి
111.​ నిష్ఫలము = నిః + ఫలము - విసర్గ సంధి
112.​ దుష్కరము = దుః + కరము - విసర్గ సంధి
113.​ నిస్తేజం = నిః + తేజం - విసర్గ సంధి
114.​ దుశ్చేష్టితం = దుః + చేష్టితము - విసర్గ సంధి
115.​ ధనుష్ట ంకారం = ధనుః + టంకారం - విసర్గ సంధి
116.​ మనస్తా పం = మనః + తాపము - విసర్గ సంధి
117.​ ఎవ్వాడు = ఏ + వాడు - త్రికసంధి
118.​ గుణాతీతుడు = గుణ + అతీతుడు - సవర్ణ దీర్ఘ సంధి
119.​ ఒకింత = ఒక + ఇంత - అత్వసంధి
120.​ దీవులుగొన్న = దీవులు + కొన్న - గ,స,డ,దవాదేశ సంధి
121.​ మృషయేని = మృష + ఏని - యడాగమ సంధి
122.​ ఎదఁగోరు = ఎదన్ + కోరు - సరళాదేశ సంధి
123.​ ఎత్త ఱి = ఏ + తఱి - త్రికసంధి
124.​ తదంతరము = తత్ + అంతరము - జశ్త ్వసంధి
125.​ కన్నొకటి = కన్ను + ఒకటి - ఉత్వ సంధి
126.​ వాడువోలె = వాడు + పో లె - గ,స,డ,దవాదేశ సంధి
127.​ అభ్యంతరం = అభి + అంతరం - యణాదేశ సంధి
128.​ రవ్వంత = రవ్వ + అంత - అత్త ్వ సంధి
129.​ సావకాశం = స + అవకాశం - సవర్ణ దీర్ఘ సంధి
130.​ కళ్ళెదుట = కళ్ళు + ఎదుట - ఉత్త ్వ సంధి
131.​ ఆదరము + మాట = ఆదరపు మాట, ఆదరంపు మాట - పుంప్వాదేశ సంధి
132.​ నీలము + కండ్లు = నీలపు కండ్లు , నీలంపు కండ్లు - పుంప్వాదేశ సంధి
133.​ మధురము + కావ్యము = మధురపు కావ్యము, మధురంపు కావ్యము - పుంప్వాదేశ సంధి
134.​ అపృచ్ఛపు మాటలు = అపృచ్ఛము + మాటలు - పుంప్వాదేశ సంధి
135.​ విరసపు మాట = విరసము + మాట - పుంప్వాదేశ సంధి
136.​ ఉన్నతపు గొడుగు = ఉన్నతము + గొడుగు - పుంప్వాదేశ సంధి
137.​ కోమలపు జ్ఞా నము = కోమలము + జ్ఞా నము - పుంప్వాదేశ సంధి
138.​ సరసపు మాట = సరసము + మాట - పుంప్వాదేశ సంధి
139.​ సంవత్సరాలు = సంవత్సరము + లు - లు,ల,నల సంధి
140.​ కొమ్ములెగరేసిన = కొమ్ములు + ఎగరేసిన - ఉత్వసంధి
141.​ చరాచర = చర + అచర - సవర్ణ దీర్ఘ సంధి
142.​ గెలిచినంత = గెలిచిన + అంత - అత్వ సంధి
143.​ మానవాళి = మానవ + ఆళి - సవర్ణ దీర్ఘ సంధి
144.​ ఒక్కొక్క = ఒక్క + ఒక్క – ఆమ్రేడిత సంధి
145.​ ఎందుకవుతుంది = ఎందుకు + అవుతుంది - ఉత్వసంధి
146.​ అతనెప్పటికి = అతను + ఎప్పటికి – ఉత్వసంధి

28
147.​ మాంసపు ముద్ద = మాంసము + ముద్ద - పుంప్వాదేశ సంధి
148.​ యుద్ధోన్మాది = యుద్ధ + ఉన్మాది - గుణసంధి
149.​ సంకీర్తనాచార్యుడు = సంకీర్తన + ఆచార్యుడు - సవర్ణ దీర్ఘ సంధి
150.​ వైరాగ్యపు పద్ధ తి = వైరాగ్యము + పద్ధ తి - పుంప్వాదేశ సంధి
151.​ నట్ట నడుమ = నడుమ + నడుమ - ఆమ్రేడిత సంధి
152.​ పరమాత్ముడు = పరమ + ఆత్ముడు - సవర్ణ దీర్ఘ సంధి
153.​ పరధనాపేక్ష = పరధన + అపేక్ష - సవర్ణ దీర్ఘ సంధి
154.​ దో షాలున్న = దో షాలు + ఉన్న – ఉత్వసంధి
155.​ సద్గ తి = సత్ + గతి – జశ్త ్వసంధి
156.​ మహాత్ముడు = మహా + ఆత్ముడు - సవర్ణ దీర్ఘ సంధి
157.​ దీపముండగ = దీపము + ఉండగ – ఉత్వసంధి
158.​ తపశ్చర్య = తపస్ + చర్య - శ్చుత్వ సంధి
159.​ సచ్చిత్ = సత్ + చిత్ - శ్చుత్వ సంధి
160.​ జగజ్జ నని = జగత్ + జనని - శ్చుత్వ సంధి
161.​ సజ్జ నులు = సత్ + జనులు – శ్చుత్వ సంధి
162.​ తపశ్శక్తి = తపస్ + శక్తి – శ్చుత్వ సంధి

Question No. 23 1×1=1


సమాస పదానికి విగ్రహవాక్యం రాయడం

ప్రశ్న అడిగే తీరు :


ప్రతిదినం వ్యాయమం చేయాలి. (గీతగీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి.)

జ. దినం దినం

Question No. 24 1×1=1


ఇచ్చిన సమాస పదం ఏ సమాసానికి చెందినదో గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :


వారు తిండిగింజలు కోసం కాయకష్ట ం చేస్తు న్నారు. (గీతగీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.)

అ) తృతీయా తత్పురుష ఆ) చతుర్థీ తత్పురుష ఇ) పంచమీ తత్పురుష ఈ) షష్ఠీ తత్పురుష

జ. ఆ) చతుర్థీ తత్పురుష

29
సమాసాలు

1.​ జననీజనకులు - జననియు, జనకుడును - ద్వంద్వ సమాసం


2.​ ఫలపుష్పములు - ఫలమును, పుష్పమును - ద్వంద్వ సమాసం
3.​ ్ర ూషణములు - వస్త మ
వస్త భ ్ర ులును, భూషణములును - ద్వంద్వ సమాసం
4.​ భక్ష్యభోజ్యములు - భక్ష్యములును, భోజ్యములును - ద్వంద్వ సమాసం
5.​ ధర్మపథము - ధర్మమైన పథము - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6.​ సనాతనధర్మం - సనాతనమైన ధర్మం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
(సనాతనం అంటే నిత్యమైనదీ, ఏనాటికీ మారనిదీ అని అర్థ ం.)
7.​ మానుష దేహం - మానుషుని యొక్క దేహం - షష్ఠీ తత్పురుష సమాసం
8.​ శోకవహ్ని - శోకమనెడి వహ్ని - రూపక సమాసం
9.​ పదిరోజులు - పది సంఖ్యగల రోజులు - ద్విగు సమాసం
10.​కాళ్ళుసేతులు - కాళ్ళును, చేతులును - ద్వంద్వ సమాసం
11.​తెల్లముఖం - తెల్లనైన ముఖం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
12.​అసాధారణం - సాధారణం కానిది - నఞ్ తత్పురుష సమాసం
13.​చిన్నబిడ్డ - చిన్నదైన బిడ్డ - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
14.​యథావిధి - విధి యెట్లో అట్లు - అవ్యయీభావ సమాసం
15.​ఆబాలగోపాలం - బాలుర నుండి గోపాలుర వరకు - అవ్యయీభావ సమాసం
16.​అనువర్షం - వర్షముననుసరించి - అవ్యయీభావ సమాసం
17.​అనుకూలం - కూలాన్ని అనుసరించి - అవ్యయీభావ సమాసం
18.​యథాశక్తి - శక్తి ఎంతో అంత - అవ్యయీభావ సమాసం
19.​ప్రతిమాసము - మాసము, మాసము - అవ్యయీభావ సమాసం
20.​ప్రతిదినము - దినము, దినము - అవ్యయీభావ సమాసం
21.​ఉపవనం - వనానికి సమీపం - అవ్యయీభావ సమాసం
22.​సకుటుంబం - కుటుంబంతో సహా - అవ్యయీభావ సమాసం
23.​శౌర్యలక్ష్మి - శౌర్యమనెడి లక్ష్మి – రూపక సమాసం
24.​బ్రతుకుదెరువు - బ్రతుకు కొఱకు తెరువు – చతుర్థీ తత్పురుష సమాసం
25.​సజ్జ న సంగతి - సజ్జ నులతో సంగతి – తృతీయా తత్పురుష సమాసం
26.​గురుతర బాధ్యత - గురుతరమైన బాధ్యత – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
27.​శబ్ద శక్తి - శబ్ద ము యొక్క శక్తి - షష్ఠీ తత్పురుష సమాసం
28.​కార్యక్షేత్రం - కార్యం కొరకు క్షేత్రం - చతుర్థీ తత్పురుష సమాసం
29.​సమయసందర్భాలు - సమయమును, సందర్భమును - ద్వంద్వ సమాసం
30.​వింతచప్పుడు - వింతయైన చప్పుడు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
31.​సభా కంపం - సభ వలన కంపము - పంచమీ తత్పురుష సమాసం
32.​గులాబీ పువ్వు - గులాబీ అను పేరుగల పువ్వు - సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
33.​ప్రజాహితం - ప్రజల కొరకు హితం - చతుర్థీ తత్పురుష సమాసం
34.​ప్రసన్న వదనం - ప్రసన్నమైన వదనం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
35.​ఉత్త మ వక్త - ఉత్త మమైన వక్త - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
36.​రెండు నిమిషాలు - రెండైన నిమిషాలు - ద్విగు సమాసం

30
37.​శౌర్యపరాక్రమములు - శౌర్యమును, పరాక్రమమును – ద్వంద్వ సమాసం
38.​శుద్ధా ంతకాంత - శుద్ధా ంతము నందలి కాంత – సప్త మీ తత్పురుష సమాసం
39.​పాపఫలం - పాపము వలన ఫలం – పంచమీ తత్పురుష సమాసం
40.​దేహపంజరం - దేహమనెడి పంజరం – రూపక సమాసం
41.​రాకాసిమూక - రాకాసుల యొక్క మూక – షష్ఠీ తత్పురుష సమాసం
42.​ఘోరరణం - ఘోరమైన రణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
43.​సాహిత్యాభిరుచి - సాహిత్యము నందు అభిరుచి – సప్త మీ తత్పురుష సమాసం
44.​చేతిరాత - చేతితో రాత – తృతీయా తత్పురుష సమాసం
45.​నిష్కల్మషము - కల్మషము లేనిది – అవ్యయీభావ సమాసం
46.​నాలుగు దిక్కులు - నాలుగు సంఖ్య గల దిక్కులు – ద్విగు సమాసం
47.​చిన్నపిల్ల – చిన్నదైన పిల్ల - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
48.​అబద్ధ ం – బద్ద ం కానిది - నఞ్ తత్పురుష సమాసం
49.​శక్తిసామర్థ్యాలు – శక్తియు మరియు సామర్థ ్యమును - ద్వంద్వ సమాసం
50.​అమాయకము – మాయకము కానిది - నఞ్ తత్పురుష సమాసం
51.​బాల్యమిత్రు లు – బాల్యము నందలి మిత్రు లు - సప్త మీ తత్పురుష సమాసం
52.​గగనకాంత - గగనమనెడి కాంత - రూపక సమాసం
53.​సమతామమతలు - సమతయును, మమతయును - ద్వంద్వ సమాసం
54.​మేఘమాలికలు - మేఘముల యొక్క మాలికలు - షష్ఠీ తత్పురుష సమాసం
55.​సుందరమేఘాలు - సుందరమైన మేఘాలు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
56.​కుటిలబుద్ధి - కుటిలమైన బుద్ధి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
57.​తిండిగింజలు - తిండి కొరకు గింజలు - చతుర్థీ తత్పురుష సమాసం
58.​అనురాగసాగరం - అనురాగమనెడి సాగరం - రూపక సమాసం
59.​ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు - బహువ్రీహి సమాసం
60.​ముక్కంటి – మూడు కన్నులు కలవాడు (శివుడు) - బహువ్రీహి సమాసం
61.​చతుర్ముఖుడు – నాలుగు ముఖాలు కలవాడు (బ్రహ్మ) - బహువ్రీహి సమాసం
62.​పద్మాక్షి – పద్మం వంటి అక్షులు కలది - బహువ్రీహి సమాసం
63.​చక్రపాణి - చక్రము పాణి యందు కలవాడు (విష్ణు వు) - బహువ్రీహి సమాసం
64.​ఐదు నెలలు - ఐదు సంఖ్య గల నెలలు – ద్విగు సమాసం
65.​మృదుమధురం - మృదువును, మధురమును – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
66.​జ్ఞా నదీపం - జ్ఞా నమనెడి దీపం – రూపక సమాసం
67.​అనూహ్యం - ఊహ్యం కానిది – నఞ్ తత్పురుష సమాసం
68.​పిల్లల ప్రపంచం - పిల్లల యొక్క ప్రపంచం – షష్ఠీ తత్పురుష సమాసం
69.​హితాహితులు - హితులు మరియు అహితులు – ద్వంద్వ సమాసం
70.​అర్థ ధర్మాలు - అర్థ ము మరియు ధర్మము – ద్వంద్వ సమాసం
71.​గుమ్మడికాయ - గుమ్మడి అను పేరు గల కాయ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
72.​ఏడు దీవులు - ఏడు అను సంఖ్య గల దీవులు – ద్విగు సమాసం
73.​చతుర వృత్తి - చతురమైన వృత్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
74.​కలని నక్క - కలని యందు నక్క - సప్త మీ తత్పురుష సమాసం
75.​పెఱకన్ను - పెఱయైన కన్ను - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
76.​దేశ వైశాల్యం - దేశము యొక్క వైశాల్యం - షష్ఠీ తత్పురుష సమాసం

31
77.​అలోభము - లోభము కానిది - నఞ్ తత్పురుష సమాసం
78.​దుష్ట ప్రవర్త నుడు - దుష్ట మైన ప్రవర్త న కలవాడు - బహువ్రీహి సమాసం
79.​నూరు రూపాయలు - నూరు అను సంఖ్య గల రూపాయలు – ద్విగు సమాసం
80.​దొ డ్డప్రభువు - దొ డ్డవాడైన ప్రభువు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
81.​కలిమిలేములు - కలిమి మరియు లేమి – ద్వంద్వ సమాసం
82.​లక్షాధికారి - లక్షలకు అధికారి – షష్ఠీ తత్పురుష సమాసం
83.​శత్రు రాజ్యం - శత్రు వు యొక్క రాజ్యం - షష్ఠీ తత్పురుష సమాసం
84.​భార్యాభర్త లు - భార్యయు, భర్త యు - ద్వంద్వ సమాసం
85.​చరాచరములు - చరమైనవి మరియు అచరమైనవి - ద్వంద్వ సమాసం
86.​యుద్ధ వ్యూహం - యుద్ద ము కొరకు వ్యూహం - చతుర్థీ తత్పురుష సమాసం
87.​మరణ మృదంగం - మరణము అనెడి మృదంగం – రూపక సమాసం
88.​అర్ధ బలము - అర్ధ ము చేత బలము – తృతీయా తత్పురుష సమాసం
89.​పసిపిల్లలు - పసివారైన పిల్లలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
90.​చిరుదరహాసం - చిరుదైన దరహాసం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
91.​మధుర భక్తి - మధురమైన భక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
92.​పరుల సొ మ్ము - పరుల యొక్క సొ మ్ము – షష్ఠీ తత్పురుష సమాసం
93.​అసహ్యం - సహ్యము కానిది – నఞ్ తత్పురుష సమాసం
94.​మధురమంజులం - మధురము, మంజులము - విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
95.​సరస వర్త నం - సరసమైన వర్త నం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
96.​మానవ ప్రయత్నం - మానవుని యొక్క ప్రయత్నం – షష్ఠీ తత్పురుష సమాసం
97.​శక్తిసామర్థ్యాలు - శక్తియును, సామర్ధ ్యమును – ద్వంద్వ సమాసం
98.​అవివేకి - వివేకము లేనివాడు - నఞ్ తత్పురుష సమాసం
99.​ఉత్త మ లక్షణం - ఉత్త మమైన లక్షణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
100.​ పరధనాపేక్ష - పరధనము కొరకు అపేక్ష – చతుర్థీ తత్పురుష సమాసం

Question No. 25 1×1=1


సరైన ఆధునిక వచన రూపాన్ని గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :

మతములన్నియు ఒక్క మమతకై పుట్టినవి. (ఈ వాక్యానికి సరియైన ఆధునిక వచనాన్ని గుర్తించండి.)


అ) మతములు మమత కోసమే పుట్టు నవి. ఆ) అనేక మతములు మమతకై పుడుతున్నాయి.
ఇ) మతములు అన్ని ఒక్క మమతకై పుట్టు ను. ఈ) మతాలు అన్నీ ఒక్క మమతకోసం పుట్టా యి.

జ. ఈ) మతాలు అన్నీ ఒక్క మమతకోసం పుట్టా యి.

32
1.​ ధర్మవ్యాధుండు కౌశికునితో యిట్ల నియె.
జ) ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు.
2.​ గృహంబునకు రమ్మని యతనిం దో డ్కొని చనియె.
జ) ఇంటికి రమ్మని అతన్ని తీసుకొని వెళ్లా డు.
3.​ ఇమ్మహాత్ముండు మనలన్ జూచువేడ్క నిటవచ్చె నని చెప్పిన.
జ) ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడకు వచ్చాడని చెప్పాడు.
4.​ బతివ్రత పనుపునంజేసి నీవు ధర్మజ్ఞా నార్థ ంబు నా యున్న యెడకుం జనుదెంచితివి.
జ) పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞా నం పొ ందాలని వచ్చావు.

WORKSHEET

1. ధర్మవ్యాధుండు కౌశికునితో యిట్ల నియె.


అ) కౌశికునితో ధర్మవ్యాధుండు ఇట్లా అన్నాడు.
ఆ) ధర్మవ్యాధుండు ఇలా అన్నాడు కౌశికునితో.
ఇ) ఇట్లా అన్నాడు కౌశికునితో ధర్మవ్యాధుండు.
ఈ) ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు.

జ.

2. గృహంబునకు రమ్మని యతనిం దో డ్కొని చనియె.


అ) గృహంబునకు రమ్మని ఆహ్వానించాడు.
ఆ) ఇంటికి రమ్మని అతన్ని తీసుకొని వెళ్లా డు.
ఇ) గృహమునకు రమ్మని పిలిచి వెళ్ళాడు.
ఈ) గృహానికి రావద్ద ని చెప్పి, వెళ్ళాడు.

జ.

3. ఇమ్మహాత్ముందు మనలన్ జూచువేద్య నిటవచ్చెనని చెప్పిన.


అ) ఇమ్మహాత్ముందు మనలను చూడటానికి వచ్చాడు.
ఆ) ఇమ్మహాత్ముండు మనలను చూడటానికి వస్తా నని చెప్పాడు.
ఇ) ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడకు వచ్చాడని చెప్పాడు.
ఈ) ఈ మహాత్ముడు మనల్ని చూడటానికి రాలేదు.

జ.

33
4. బతివ్రత పనుపునం జేసి నీవు ధర్మజ్ఞా నార్థ ంబు నాయున్న యెడకుం జనుదెంచితివి.
అ) బతివ్రత పనుపునం జేసి నీవు వచ్చావు.
ఆ) బతివ్రత పనుపునం జేసి ధర్మజ్ఞా నం కొఱకు వెళ్ళావు.
ఇ) బతివ్రత పనుపునం జేసి ధర్మ జ్ఞా నార్ధ ంబు వచ్చావు.
ఈ) పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞా నం పొ ందాలని వచ్చావు.

జ.

1.​ దుఃఖసముద్రము భారతీయ హృద్వారము సొ చ్చి.


జ) దుఃఖసముద్రం భారతీయ హృదయ ద్వారాల్లో కి ప్రవేశించి
2.​ నీతియటంచు నున్నదే.
జ) నీతి అనేది ఉందా?
3.​ ఆత్మరక్త మొలికించెన్.
జ) తన రక్తా న్ని చిందించెను.
4.​ పో రున్ వెన్నిచ్చి పాఱడు.
జ) యుద్ధ ంలో వెనుతిరిగి పారిపో డు.
5.​ కాపురుషుల మీద నిధకు కార్యభరంబుల్.
జ) కాపురుషులపై కార్య భారములను ఇడకు.
6.​ చతుర వృత్తి ఁ జరించుట నీతి ఱేనికిన్.
జ) రాజుకు చతురవృత్తి తో చరించుట నీతి కదా.
7.​ మా యింట్లో భోజనము యంత మాత్రము వీలుపడదు.
జ) మా ఇంట్లో భోజనం ఏ మాత్రం కుదరదు.
8.​ యీ చదువుల కోసవని పిల్లా ణ్ణి వొదులుకొని వుండడం.
జ) ఈ చదువుల కోసం పిల్లా ణ్ణి ఒదులుకొని ఉండడం.
9.​ అదుగో చదువంటే అష్టా గే చదువుకోవాలి.
జ) అదిగో చదువంటే అట్లా గే చదువుకోవాలి.
10.​యిప్పటి మట్టు కు వేదం లాగే భట్టీయం వేయిస్తా రు.
జ) ఇప్పుడు కూడా వేదం లాగే వల్లె వేస్తా రు.

34
Question No. 26 1×1=1
వ్యతిరేకార్థక వాక్యం రాయడం

ప్రశ్న అడిగే తీరు :

సాదా దుస్తు లతో హుందాగా తయారయ్యాడు. (ఈ వాక్యానికి వ్యతిరేకార్థ క వాక్యం రాయండి.)

జ. సాదా దుస్తు లతో హుందాగా తయారు కాలేదు.

1.​ ధర్మవ్యాధుడు కౌశికుణ్ని ఆహ్వానించాడు.


జ) ధర్మవ్యాధుడు కాశికుణ్ని ఆహ్వానించలేదు.
2.​ నీవు పతివ్రత పంపగా వచ్చావు.
జ) నీవు పతివ్రత పంపగా రాలేదు.
3.​ పుణ్యాన్ని కోరే గృహస్థు డే ధర్మాత్ముడు.
జ) పుణ్యాన్ని కోరే గృహస్థు డే ధర్మాత్ముడు కాడు.
4.​ అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తా రు.
జ) అందరూ కోరికతో దేవతల్ని పూజించరు.
5.​ నా తల్లిదండ్రు లే నా పాలిట దేవతలు కారు.
జ) నా తల్లిదండ్రు లే నా పాలిట దేవతలు.
6.​ ప్రకృతిని మానవుడు అనుకరిస్తు న్నాడు.
జ) ప్రకృతి మానవుని చేత అనుకరించబడుతుంది.
7.​ జానపదుడు జాబు వ్రా స్తా డు.
జ) జానపదుని చేత జాబు వ్రా యబడుతుంది.
8.​ ఇల్లా లు తన పేరు మరచిపో యింది.
జ) ఇల్లా లు తన పేరు మరువలేదు.
9.​ రాముడు సీతను ఆదరించాడు.
జ) రాముడు సీతను ఆదరించలేదు.
10.​చలికాలం అంటే నాకిష్టం.
జ) చలికాలం అంటే నాకిష్టంలేదు.
11.​రాజు రేపు వస్తా డు.
జ) రాజు రేపు రాడు.
12.​మీరంతా సినిమాకి వెళ్ళండి.
జ) మీరంతా సినిమాకి వెళ్ళవద్దు .

35
13.​కవిత రోత పాటలను పాడదు.
జ) రోత పాటలు కవిత చేత పాడబడవు.
14.​భర్త భార్యను గౌరవించాలి.
జ) భార్య భర్త చేత గౌరవించబడాలి.
15.​రమేష్ భారతాన్ని చదివాడు.
జ) భారతం రమేష్ చేత చదవబడింది.
16.​నిష్ఠు రోక్తు లు పల్కుతున్నారు.
జ) నిష్ఠు రోక్తు లు పలకడంలేదు.
17.​పలుకులు పల్కబో వడు.
జ) పలుకులు పల్కబో తాడు.
18.​కందమూల ఫలాలు ఉన్నాయి.
జ) కందమూల ఫలాలు లేవు.
19.​భూపాలురకు జాలి ఎక్కువ.
జ) భూపాలురకు జాలి ఎక్కువ ఉండదు.
20.​యుగయుగాల పుడతారు.
జ) యుగయుగాల పుట్ట రు.
21.​తత్త ్వం పుడుతుంది అంటారు.
జ) తత్త ్వం పుడుతుంది అనరు.
22.​నిపుణులు నిందించారు.
జ) నిపుణులు నిందించలేదు.
23.​నిపుణులు మెచ్చుకొన్నారు.
జ) నిపుణులు మెచ్చుకోలేదు.
24.​యుగాంతం తప్పదంటారు.
జ) యుగాంతం తప్పదనరు.
25.​తెలివి కొద్దిగా కూడా లేదు.
జ) తెలివి కొద్దిగానైనా ఉంది.
26.​గర్వంతో విహరించాను.
జ) గర్వంతో విహరించలేదు.
27.​నాకు గర్వం పో యింది.
జ) నాకు గర్వం పో లేదు.
28.​మాట్లా డే శక్తిని వదలండి.
జ) మాట్లా డే శక్తిని వదలకండి.
29.​అవి వాక్కు శక్తిని తెలియజేస్తు న్నాయి.
జ) అవి వాక్కు శక్తిని తెలియజేయడం లేదు.
30.​అణుయుగంలోకి ప్రవేశించాం.
జ) అణుయుగంలోకి ప్రవేశించలేదు.
31.​నేను ఉపన్యాసం ఇస్తా ను.
జ) నేను ఉపన్యాసం ఇవ్వను.
32.​కొందరు వక్త లు ఊతపదాలు ఉపయోగిస్తా రు.
జ) కొందరు వక్త లు ఊతపదాలు ఉపయోగించరు.

36
33.​ప్రతి వ్యక్తీ గొప్ప వక్త కాగలడు.
జ) ప్రతి వ్యక్తీ గొప్ప వక్త కాలేడు.
34.​కొందరు వక్త లు అపహాస్యానికి గురౌతారు.
జ) కొందరు వక్త లు అపహాస్యానికి గురికారు.
35.​పట్టు దల పెరిగింది.
జ) పట్టు దల పెరగలేదు.
36.​ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది.
జ) ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడదు.
37.​వెంటనే కలకలం ఆగిపో వచ్చు.
జ) వెంటనే కలకలం ఆగిపో కపో వచ్చు.
38.​జలియన్ వాలాబాగ్ లో సమావేశమయ్యారు.
జ) జలియన్ వాలాబాగ్ లో సమావేశం కాలేదు.
39.​శత్రు వుపై భారతవీరుడు విజృంభించాడు.
జ) శత్రు వుపై భారతవీరుడు విజృంభించలేదు.
40.​శత్రు వుల వైపుకు వెళ్ళడు.
జ) శత్రు వుల వైపుకు వెళతాడు.
41.​ఈ పాపం ఊరికే పో దు.
జ) ఈ పాపం ఊరికే పో తుంది.
42.​పాపాత్ముడు ఆంగ్లేయుడు.
జ) పాపాత్యుడు కాడు ఆంగ్లేయుడు.
43.​బాల్యం అందరికీ సుఖాల నిలయం.
జ) బాల్యం అందరికీ సుఖాల నిలయం కాదు.
44.​అందరూ బొ మ్మలు వేయగలరు.
జ) అందరూ బొ మ్మలు వేయలేరు.
45.​కొందరికే బాల్యం గుర్తొ స్తు ంది.
జ) కొందరికే బాల్యం గుర్తు రాదు.
46.​రచయిత ఈ పాఠం ఒక్కటే రాశారు.
జ) రచయిత ఈ పాఠం ఒక్కటే రాయలేదు.
47.​కొందరి పుట్టినరోజులు గొప్పవి.
జ) కొందరి పుట్టినరోజులు గొప్పవి కావు.
48.​బాల్యం దాటాం.
జ) బాల్యం దాటలేదు.
49.​దినపత్రిక తయారుచేశారు.
జ) దినపత్రిక తయారు చేయలేదు.
50.​దుకాణాల్లో మాత్రమే పనిచేయాలి.
జ) దుకాణాల్లో మాత్రమే పనిచేయక్కర్లేదు.
51.​గ్రా మమంతా శ్రా మిక వర్గ మే.
జ) గ్రా మమంతా శ్రా మిక వర్గ ం కాదు.
52.​నాకు బహుమతి వచ్చింది.
జ) నాకు బహుమతి రాలేదు.

37
53.​అతడు రాజుకు లోబడి ఉండడు.
జ) అతడు రాజుకు లోబడి ఉంటాడు.
54.​ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు.
జ) ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం.
55.​క్రూ రత్వం ఉండకూడదు.
జ) క్రూ రత్వం ఉండాలి.
56.​ధర్మార్థా లు సిద్ధిస్తా యి.
జ) ధర్మార్థా లు సిద్ధించవు.
57.​సేవకులను తీవ్రంగా శిక్షించడు.
జ) సేవకులను తీవ్రంగా శిక్షిస్తా డు.
58.​కుఱ్ఱా డికి చదువు చెప్పిస్తా ను.
జ) కుఱ్ఱా డికి చదువు చెప్పించను.
59.​ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు.
జ) ఈ మారు నీ అన్న ఉన్నాడని ఊరుకుంటా.
60.​ఈయన నాకు చదువు చెప్పే మాస్టా రు.
జ) ఈయన నాకు చదువు చెప్పే మాస్టా రు కాదు.
61.​మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించారండి.
జ) మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించలేదండి.
62.​పరుల్ని నిందించాలి.
జ) పరుల్ని నిందించరాదు.
63.​ఆత్మ ప్రశంస మంచిది.
జ) ఆత్మ ప్రశంస మంచిది కాదు.
64.​బుద్ధి స్థిరంగా ఉండటం అవసరం.
జ) బుద్ధి స్థిరంగా ఉండటం అవసరంలేదు.
65.​కుల, మతాలకు ప్రా ధాన్యం ఉంది.
జ) కుల, మతాలకు ప్రా ధాన్యం లేదు.
66.​అసూయ, ద్వేషాలు వదిలివేయాలి.
జ) అసూయ, ద్వేషాలు వదలకూడదు.
67.​సో మరితనం మంచిది.
జ) సో మరితనం మంచిది కాదు.
68.​మానవులంతా ఉన్నతంగా ఎదగాలి.
జ) మానవులంతా ఉన్నతంగా ఎదగరాదు.
69.​స్వలాభాపేక్ష ఉండాలి.
జ) స్వలాభాపేక్ష ఉండకూడదు.

38
Question No. 27 1×1=1
ఇచ్చిన క్రియాపదాలలో అడిగిన దానిని గుర్తించడం

●​ క్త్వార్థ కం, శత్రర్థకం, చేదర్థ కం, అప్యర్థ కం

ప్రశ్న అడిగే తీరు :

కింది వాటిలో క్త్వార్థ క క్రియాపదాన్ని గుర్తించండి.

అ) చెప్పి ఇ) చెప్తూ ఆ) చెప్తే ఈ) చెప్పినా

జ. అ) చెప్పి

క్త్వార్థ కం

●​ భూతకాల (past tense) అసమాపక క్రియకు క్త్వార్థ కం అని పేరు.


●​ అసమాపక క్రియ హ్ర స్వ 'ఇ' కారంలో ఉంటుంది.
ఉదా : తిని, చూసి, వెళ్ళి, చదివి, నడిచి, నవ్వి, పో యి మొదలైనవి.

శత్రర్థకం

●​ వర్త మానకాల (present tense) అసమాపక క్రియకు శత్రర్థకం అని పేరు.


●​ అసమాపక క్రియ “ఊ కారం”లో ఉంటుంది.
ఉదా : తింటూ, చూస్తూ , వెళ్తూ , చదువుతూ, నడుస్తూ , నవ్వుతూ, పో తూ మొదలైనవి

చేదర్థ కం (చేత్ + అర్థ కం)

●​ భవిష్యత్ కాల (future tense) అసమాపక క్రియకు చేదర్థ కం అని పేరు. చేత్ = ఐతే (if)
●​ అసమాపక క్రియ “ఏ కారం”లో ఉంటుంది.
ఉదా : తింటే, చూస్తే, వెళ్తే , చదివితే, నడిస్తే, నవ్వితే, పో తే మొదలైనవి.

అప్యర్థ కం (అపి + అర్థ కం)

●​ 'అపి' అనగా 'కూడా' అని అర్థ ం. అనగా 'కూడా' అనే అర్థ ంలో ఉండే పదాలను 'అప్యర్థ కం’
అంటారు.
●​ అసమాపక క్రియ 'ఆ' కారంలో ఉంటుంది.
ఉదా : తిన్నా, చూసినా, వెళ్ళినా, చదివినా, నడిచినా, నవ్వినా, పో యినా మొదలైనవి.

39
Question No. 28 1×1=1
సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయడం

ప్రశ్న అడిగే తీరు :

పిల్లలందరూ ఒకచోట చేరారు. పిల్లలందరూ బొ మ్మలతో ఆడుకుంటున్నారు. (ఈ సామాన్య వాక్యాలను


సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి.)

జ) పిల్లలందరూ ఒకచోట చేర,ి బొ మ్మలతో ఆడుకుంటున్నారు.

సామాన్య – సంశ్లిష్ట వాక్యాలు

సామాన్య వాక్యం : అసమాపక క్రియలు లేకుండా ఒక ‘సమాపక క్రియ’ తో ముగిసే వాక్యాన్ని సామాన్య
వాక్యమంటారు.
ఉదా :
1.​ సురేష్ గుడికి వెళ్ళాడు.
2.​ మేరీ పుస్త కం తీసింది.
3.​ చందు కలం పట్టు కున్నాడు.

సంశ్లిష్ట వాక్యం : ఒకటి కాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి, చివరకు ఒక సమాపక క్రియతో
ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యమంటారు.
ఉదా :
1.​ పద్మ నిద్రలేచింది. (సామాన్య వాక్యం)
2.​ పద్మ స్నానం చేసింది. (సామాన్య వాక్యం)
3.​ పద్మ బడికి వెళ్ళింది. (సామాన్య వాక్యం)

ఈ మూడు వాక్యాలనూ కలిపితే …….


పద్మ నిద్రలేచి, స్నానం చేస,ి బడికి వెళ్ళింది.

అలా రెండు వాక్యాలను కూడా కలపవచ్చు.

రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు. రమేష్ బడికి వెళ్తు న్నాడు.

రమేష్ సైకిల్ తొక్కుతూ, బడికి వెళ్తు న్నాడు.

40
కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1.​ గురువుగారు పాఠం చెబుతున్నారు. గురువుగారు నవ్వుతున్నారు.


జ) గురువుగారు పాఠం చెబుతూ, నవ్వుతున్నారు.
2.​ అమ్మ బుజ్జ గించింది. అమ్మ అన్నం పెట్టింది.
జ) అమ్మ బుజ్జ గించి, అన్నం పెట్టింది.
3.​ ఎలుక అక్కడకు వచ్చింది. ఎలుక గుడ్ల గూబను చూసింది.
జ) ఎలుక అక్కడకు వచ్చి, గుడ్ల గూబను చూసింది
4.​ భరతమాత కవులను కన్నది. భరతమాత కవులను పెంచింది.
జ) భరతమాత కవులను కని, పెంచింది.
5.​ హక్కులకై పో రాడాలి. హక్కులను సాధించాలి.
జ) హక్కులను పో రాడి, సాధించాలి.
6.​ దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తితో జీవించాలి.
జ) దేశభక్తిని కలిగి, జీవించాలి.

Question No. 29 1×1=1


కర్త రి వాక్యానికి సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :

అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. (సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.)


అ) అతనికి కండక్టర్ ఉద్యోగం రాలేదు ఆ) అతను కండక్టర్ ఉద్యోగం చేయడు.
ఇ) కండక్టర్ ఉద్యోగం అతనిచే చేయబడింది. ఈ) అతను చేస్తు న్నది కండక్టర్ ఉద్యోగమే.

జ. ఇ) కండక్టర్ ఉద్యోగం అతనిచే చేయబడింది.

కర్త రి వాక్యాలు – కర్మణి వాక్యాల గురించి తెలుసుకుందాం.

కర్త రి వాక్యాలు :

ఉదా : సూర్యుడు వెలుగును పంచుతాడు.

పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తు న్నది “సూర్యుడు” కనుక సూర్యుడు “కర్త ”. ఇక్కడ కర్త అయిన
సూర్యుడు ప్రథమా విభక్తిలో ఉంది. “పంచడం” అనే పనికి గురి అవుతోంది “వెలుగు” కనుక వెలుగుకు
ద్వితీయా విభక్తి చేరి “వెలుగును” అని ప్రయోగించబడింది. వాక్యం కర్త అయిన సూర్యుడిని ప్రధానం చేసి

41
చెప్పబడినందున ఇది కర్త రి వాక్యం. క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది. ఇక్కడ కర్త
క్రియతో అన్వయిస్తు న్నది కాబట్టి ఇది కర్త రి వాక్యం.

‘కర్త ’ ప్రధానంగా గల వాక్యాలు కర్త రి వాక్యాలు. కర్త రి వాక్యంలో కర్త కు ప్రథమా విభక్తి వస్తు ంది. కర్మకు
ద్వితీయా విభక్తి వస్తు ంది. కర్త రి ప్రయోగంలో కర్త ను బట్టి క్రియా వాచకాలు ఉంటాయి.

కర్మణి వాక్యాలు :

ఉదా : సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది.

పై వాక్యంలో కర్త కు తృతీయా, కర్మకు ప్రథమా విభక్తు లు వచ్చాయి. పంచు అను క్రియకు ‘బడు’ చేరి
పంచబడుతుందిగా మారింది. కర్మ ప్రధానంగా చెప్పబడినది కాబట్టి ఇది కర్మణి వాక్యం.

“కర్మ” ప్రధానంగా గల వాక్యాలు కర్మణి వాక్యాలు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది “కర్మ”. అయితే,
ఆ పనిని చేసేవాడు “కర్త ”. కర్మణి వాక్యంలో కర్త కు తృతీయా విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తు ంది. కర్మ
ప్రధానంగా గల వాక్యాలలో “బడు, బడి” – అనేవి క్రియకు అనుసరించి ప్రయోగింపబడతాయి. కర్మణి
ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచన పురుష ప్రత్యయాలు వచ్చి చేరతాయి.

కింది కర్త రి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి.


1.​ ఆమె పాట పాడింది.
జ) ఆమె చేత పాట పాడబడింది.
2.​ గాంధీజీ వార్ధా స్కీమును ప్రా రంభించారు.
జ) గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రా రంభించబడింది.
3.​ బులుసు వేంకట రమణయ్య ఉత్త రదేశ యాత్ర గ్రంథాన్ని రాశారు.
జ) బులుసు వేంకట రమణయ్య చేత ఉత్త రదేశ యాత్ర గ్రంథం రాయబడింది.
4.​ షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు.
జ) షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది.

కర్త రి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చే విధానం తెలుగులో ఉంది. కాని తెలుగులో ప్రతి వాక్యాన్ని
కర్మణిలోకి మార్చడం అందంగా ఉండదు. అందుకే కర్మణి వాక్యం తెలుగుకు సహజం కాదు. కొన్ని ప్రత్యేక
సందర్భాలలో మాత్రమే కర్మణికి ప్రయోజనం ఉంటుంది.

కర్త రి వాక్యానికి సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి.

1.​ వారెందరినో ఇంటర్వ్యూ చేశారు.


జ) వారిచేత ఎందరో ఇంటర్వ్యూ చేయబడ్డా రు.
2.​ హనుమ సముద్రం లంఘించెను.
జ) హనుమ చేత సముద్రం లంఘించబడెను.
3.​ హనుమ గిరిని తొక్కెను.
జ) హనుమ చేత గిరి తొక్కబడెను.

42
4.​ వారిని నిపుణులు నిందించారు.
జ) వారు నిపుణుల చేత నిందించబడ్డా రు.
5.​ శతక పద్యాలను కవులు బాగా వ్రా శారు.
జ) శతక పద్యాలు కవుల చేత బాగా వ్రా యబడ్డా యి.
6.​ అ) కవులు శతకపద్యాలు వ్రా శారు.
జ) కవుల చేత శతకపద్యాలు బాగా వ్రా యబడ్డా యి.
7.​ జనులు రాజులను సేవిస్తా రు.
జ) రాజులు జనుల చేత సేవించబడతారు.
8.​ భగవంతుడు భక్తు లను కాపాడతాడు.
జ) భగవంతుని చేత భక్తు లు కాపాడబడతారు.
9.​ కాళికాంబ వరాలను ఇచ్చింది.
జ) వరాలు కాళికాంబ చేత ఇవ్వబడ్డా యి.
10.​ధీరోత్త ములు నీతి తప్పరు.
జ) ధీరోత్త ముల చేత నీతి తప్పబడదు.
11.​మన పనులు ఫలాలను చేకూరుస్తా యి.
జ) ఫలాలు మన పనుల చేత చేకూర్చబడతాయి.
12.​మనిషి తన భాషను అభిమానించాలి.
జ) మనిషి చేత తన భాష అభిమానించబడాలి.
13.​మంచివారు దుర్జ నుని మారుస్తా రు.
జ) దుర్జ నుడు మంచి వారిచేత మార్చబడతాడు.
14.​సముద్రం మేఘాలను తయారుచేస్తో ంది.
జ) మేఘాలు సముద్రం చేత తయారు చేయబడుతున్నాయి.
15.​వక్త మైకు గట్టిగా పట్టు కొన్నాడు.
జ) వక్త చేత మైకు గట్టిగా పట్టు కోబడింది.
16.​ఆయన ప్రయత్నం విరమిస్తా డు.
జ) ఆయన చేత ప్రయత్నం విరమించబడుతుంది.
17.​ఆయన నిజం చెప్పగలడు.
జ) ఆయన చేత నిజం చెప్పబడగలదు.
18.​నన్ను వారు ఇబ్బంది పెట్టా రు.
జ) వారి చేత నేను ఇబ్బంది పెట్టబడ్డా ను.
19.​వర్త ప్రతిభను పొ గడవచ్చు.
జ) వక్త చేత ప్రతిభ పొ గడబడవచ్చు.
20.​వక్త నిర్ణ యాన్ని మేము కాదనము.
జ) మా చేత వక్త నిర్ణ యం కాదనబడదు.
21.​వాక్కు మానవుని అలరిస్తు ంది.
జ) వాక్కు చేత మానవుడు అలరించబడతాడు.
22.​వక్త మనసును జనం బాధపెట్టా రు.
జ) జనం చేత వక్త మనసు బాధ పెట్టబడింది.
23.​వక్త తనను తాను తీర్చిదిద్దు కొన్నాడు.
జ) వక్త తన చేత తాను తీర్చిదిద్దు కొనబడ్డా డు.

43
24.​అతను అనుకొన్నది సాధించాడు.
జ) అనుకొన్నది అతని చేత సాధించబడింది.
25.​తన రక్తా న్ని చిందించాడు.
జ) అతనిచే రక్త ం చిందించబడింది.
26.​హృదయ ద్వారాల్లో కి ప్రవేశించింది.
జ) హృదయ ద్వారాల్లో కి ప్రవేశించబడింది.
27.​స్త్రీల గౌరవానికి భంగం కలిగింది.
జ) స్త్రీల గౌరవానికి భంగం కలిగించబడింది.
28.​భారతీయులు ప్రా ణాలు కోల్పోయారు.
జ) భారతీయులు ప్రా ణాలు కోల్పోవబడినారు.
29.​భారతీవీరుడు విజృంభించాడు.
జ) భారతవీరుడు విజృంభించబడినాడు.
30.​నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత.్ర
జ) నాచే రచింపబడిన గ్రంథం నేతాజీ చరిత.్ర
31.​ఆయన చెప్పింది ఇదే కదా!
జ) ఆయనచే చెప్పబడింది ఇదే కదా!
32.​రాము భారతాన్ని చదివాడు.
జ) భారతం రాముచేత చదువబడింది.
33.​రచయిత బొ మ్మ వేసాడు.
జ) బొ మ్మ రచయిత చేత వేయబడింది.
34.​రచయిత బాల్యం మరచిపో లేదు.
జ) బాల్యం రచయిత చేత మరచిపో బడలేదు.
35.​మనం ఎన్నో మార్పులు చూస్తా ం.
జ) ఎన్నో మార్పులు మన చేత చూడబడతాయి.
36.​రచయితను అందరూ పొ గిడారు.
జ) అందరి చేత రచయిత పొ గడబడ్డా డు.
37.​రచయిత అధ్యయనం చేశాడు.
జ) అధ్యయనం రచయిత చేత చేయబడింది.
38.​ప్రకాశరావు పత్రిక రాయగలడు.
జ) ప్రకాశరావు చేత పత్రిక రాయబడగలదు.
39.​అతను పుస్త కాలు చదువుతాడు.
జ) అతని చేత పుస్త కాలు చదువబడును
40.​వారు మా ప్రయత్నం ఆపారు.
జ) వారి చేత మా ప్రయత్నం ఆపబడింది.
41.​ఆమె పూలు కోస్తో ంది.
జ) ఆమె చేత పూలు కోయబడుతున్నాయి.
42.​అతను బస్సు నడిపాడు.
జ) అతని చేత బస్సు నడపబడింది.
43.​పన్ను తగ్గించాలి.
జ) పన్ను తగ్గించబడాలి.

44
44.​సుఖంగా రాజ్యం ఏలుతాడు.
జ) సుఖంగా రాజ్యం ఏలబడతాడు.
45.​రాజు తప్పు చేసినవాణ్ణి దండించాలి.
జ) రాజు చేత తప్పు చేసినవారు దండించబడాలి.
46.​పాలకుడు దో షిని శిక్షించాలి.
జ) పాలకుని చేత దో షి శిక్షించబడాలి.
47.​పాలకుడు హితులను గౌరవించాలి.
జ) పాలకుని చేత హితులు గౌరవించబడాలి.
48.​దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్నాడు.
జ) దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకోబడినాడు.
49.​అగ్ని హో త్రు డికి తగినవాడు దొ రికాడు.
జ) అగ్ని హెూత్రు డికి తగినవాడు దొ రకబడినాడు.
50.​గిరీశం తర్జు మా చేశాడు.
జ) గిరీశం చేత తర్జు మా చేయబడినాయి.
51.​లుబ్ధా వధాన్లు కరటకశాస్త్రి శిష్యుణ్ణి పెళ్ళి చేసుకున్నాడు.
జ) లుబ్ధా వధాన్ల చేత కరటక శాస్త్రి శిష్యుడి పెండ్లి చేయబడింది.
52.​అశోకుడు యుద్ధ ం నిలిపేశాడు.
జ) అశోకుని చేత యుద్ధ ం నిలుపబడింది.
53.​అశోకుడు పశ్చాత్తా పం ప్రకటించాడు.
జ) అశోకుని చేత పశ్చాత్తా పం ప్రకటించబడింది.
54.​బుద్ధు డు అసలు యుద్ధా న్ని గెలిచాడు.
జ) బుద్ధు ని చేత అసలు యుద్ధ ం గెలువబడింది.
55.​మానవులు ప్రకృతిని ధ్వంసం చేస్తు న్నారు.
జ) మానవుల చేత ప్రకృతి ధ్వంసం చేయబడుతోంది.
56.​‘యుద్ధ విజేత’ను ప్రతాప్ కుమార్ రచించాడు.
జ) ప్రతాప్ కుమార్ చేత యుద్ధ విజేత రచింపబడింది.
57.​సిద్ధా ర్థు డు యుద్ధా న్ని తిరస్కరించాడు.
జ) సిద్ధా ర్థు నిచే యుద్ధ ం తిరస్కరింపబడింది.
58.​నెమలి పురివిప్పి నాట్యం చేస్తో ంది.
జ. నెమలిచే పురివిప్పి నాట్యం చేయబడుతోంది.
59.​అన్నమయ్య సంకీర్తనలు రచించాడు.
జ) అన్నమయ్యచే సంకీర్తనలు రచింపబడ్డా యి.
60.​అంతః శత్రు వుల్ని ఆత్మ నిగ్రహంతో జయించాలి.
జ) అంతః శత్రు వుల్ని ఆత్మ నిగ్రహం చేత జయింపబడాలి.
61.​అన్నమయ్య మానవాళికి ప్రబో ధం చేశాడు.
జ) అన్నమయ్య చేత, మానవాళికి ప్రబో ధం చేయబడింది.
62.​అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించాడు.
జ) అన్నమయ్య చేత 32 వేల సంకీర్తనలు రచింపబడ్డా యి.
63.​మానవుడు అరిషడ్వర్గా లను జయించాలి.
జ) మానవుడు చేత అరిషడ్వార్గా లు జయింపబడాలి.

45
64.​‘సూక్తిసుధ’ గంగప్ప రాశాడు.
జ) గంగప్ప చేత సూక్తిసుధ రాయబడింది.

Question No. 30 1×1=1


ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడం

ప్రశ్న అడిగే తీరు :

“నేను రాను” అని రాజు రవితో అన్నాడు.


(పై ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయండి.)

జ) తాను రానని రాజు రవితో అన్నాడు

***********************************************

ప్రత్యక్ష పరోక్ష కథనాలు

1) “నువ్వింకా చిన్న పిల్లవాడివి” అని నాన్న అన్నాడు.


2) నువ్వింకా చిన్నపిల్లవాడివని నాన్న అన్నాడు.

ఈ రెండింటిని అనుకరణ లేక అనుకృతి వాక్యాలు అంటారు. రెండు వాక్యాలలోనూ తేడా ఉంది. మొదటి
వాక్యంలో మరొకరు చెప్పిన వాక్యాన్ని యధాతథంగా అనుకరించడం ఉంది. రెండవ వాక్యంలో విషయాన్ని
లేదా అభిప్రా యాన్ని మాత్రమే అనుకరించడం ఉంది. మొదటి వాక్యంలో “చిన్నపిల్లవాడివి” అని ఉంటే,
రెండవ వాక్యంలో ‘చిన్నపిల్లవాడివని’ అని కనిపిస్తు ంది. మొదటి వాక్యాన్ని ప్రత్యక్ష అనుకృతి అని, రెండవ
వాక్యాన్ని పరోక్ష అనుకృతి అని అంటారు.

ప్రత్యక్ష అనుకృతి పరోక్ష అనుకృతిగా మారినప్పుడు కొన్ని మార్పులు వచ్చాయి చూశారు కదా.. ఈ
రెండిట్లో “అని” అనేది అనుకారకం. అంటే అనుకరిస్తు న్నట్లు చెప్పే పదం.

ఇప్పుడు ఈ రెండు వాక్యాల స్వభావాన్ని ఈ కింది విధంగా చెప్పవచ్చు.

ప్రత్యక్షానుకృతి (direct narration or direct speech) : ఇతరులు చెప్పిన విషయాన్ని లేక తను
చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లు గా అనుకరించి చెప్పడం.

1) “నేను రాను” అని రవి రాజుతో అన్నాడు.

46
2) కోడి “కొక్కురోకో” అని కూస్తు ంది.
3) “వ్యక్తికి బహువచనం శక్తి” అని అన్నాడు శ్రీశ్రీ.

పరోక్షానుకృతి (indirect narration or indirect speech) : అనుకరించిన దానిలో విషయాన్ని,


అభిప్రా యాన్ని మాత్రమే అనుకరించడం. అనుకారకం: “అని” అనుకారక పదం కొన్ని సందర్భాలలో
లోపించవచ్చు కూడా.

ఉదాహరణ :
1) వ్యక్తికి బహువచనం శక్త ని అన్నాడు శ్రీశ్రీ.
2) నీవు ఎక్కదలచిన ట్రైను జీవితకాలం లేటని ఆరుద్ర అన్నాడు.
3) తాను రానని రవి రాజుతో అన్నాడు.
4) కోడి కొక్కురోకోమని కూస్తు ంది.

ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పిన మాటలను ఉద్ధ రణ చిహ్నాలలో (“……….”) చూపించాలి.
పరోక్ష కథనంలో ఉద్ధ రణ చిహ్నాలు ఉండవు. ప్రత్యక్ష కథనంలో ‘నేను’ పరోక్ష కథనంలో ‘తను’ అవుతుంది.

●​ నేను - తాను, తను


●​ నా - తన
●​ నాతో - తనతో
●​ నన్ను - తనను
●​ నాకు - తనకు
●​ మా - తమ
●​ మాకు - తమకు
●​ మేము - తాము

కింది ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.

1.​ “నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి” అని రఫీ చెప్పాడు.


జ) తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు.
2.​ “పుష్కర బొ మ్మలు బాగా వేస్తు ంది” అని వాళ్ళ నాన్నగారు అన్నారు.
జ) పుష్కర బొ మ్మలు బాగా వేస్తు ందని వాళ్ళ నాన్నగారు అన్నారు.
3.​ “మీరంతా ఎక్కడి నుండి వస్తు న్నారు ?” అని శైలజ పిల్లల్ని అడిగింది.
జ) వారంతా ఎక్కడి నుండి వస్తు న్నారని శైలజ పిల్లల్ని అడిగింది.
4.​ “నాకు ఈత అంటే ఎంతో సరదా. ఈత కొట్ట డం ఆరోగ్యం కూడా” అని అక్షయ అన్నది.
జ) తనకు ఈత అంటే ఎంతో సరదాని, ఈత కొట్ట డం ఆరోగ్యం కూడాయని అక్షయ అన్నది.

కింది పరోక్ష కథనంలోని వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.

1.​ చదువుకన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు.


జ) “చదువుకన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం” అని ఉపాధ్యాయులు చెప్పారు.

47
2.​ తను జీవితంలో ఎన్నో కష్టా లనెదుర్కొని ఈ స్థితికి చేరానని కలామ్ అన్నారు.
జ) “నేను జీవితంలో ఎన్నో కష్టా లనెదుర్కొని ఈ స్థితికి చేరాను” అని కలామ్ అన్నారు.
3.​ తామంతా నిత్యం పుస్త కాలు చదువుతూ ఉంటామని పిల్లలు చెప్పారు.
జ) “మేమంతా నిత్యం పుస్త కాలు చదువుతూ ఉంటాము” అని పిల్లలు చెప్పారు.
4.​ తానొక ప్రకృతి ఆరాధకుడినని విజయ్ అన్నాడు.
జ) “నేనొక ప్రకృతి ఆరాధకుడిని” అని విజయ్ అన్నాడు.

WORKSHEET

కింది ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.

1.​ “నేను రాను” అని రవి రాజుతో అన్నాడు


జ)

2.​ కోడి “కొక్కురోకో” అని కూస్తు ంది.


జ)

3.​ “వ్యక్తికి బహువచనం శక్తి” అని అన్నాడు శ్రీశ్రీ.


జ)

4.​ “అతను ఎక్కదలచిన ట్రైను జీవితకాలం లేటు” అని ఆరుద్ర అన్నాడు.


జ)

Question No. 31 1×1=1


ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం

ప్రశ్న అడిగే తీరు :

ఎల్ల మ్మ ఆ పని చేయగలదు. (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి.)

జ. సామర్థ్యార్థ క వాక్యం

48
Question No. 32 1×1=1
ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించడం

ప్రశ్న అడిగే తీరు :

నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ? (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి.)

అ) సందేహార్థ కం ఆ) ప్రశ్నార్థ కం ఇ) హేత్వర్థ కం ఈ) అనుమత్యర్థ కం

జ. ఆ) ప్రశ్నార్థ కం

Question No. 33 1×1=1


ఇచ్చిన వాక్యం ఏ రకమైన సామాన్య వాక్యమో రాయడం

ప్రశ్న అడిగే తీరు :

పిల్లలూ! మీరందరూ ఆడుకోవచ్చు. (ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి.)

జ) అనుమత్యర్థ క వాక్యం

సామాన్య వాక్యం - రకాలు

ప్రశ్నార్థ క వాక్యం :
ఉదా : ఏం ! ఎప్పుడొ చ్చావ్ ?
ఈ వాక్యం ప్రశ్నిస్తు న్నట్లు ఉంది. అంటే ఇది ప్రశ్నార్థ క వాక్యం. ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థ ం ఉంటే
దాన్ని “ప్రశ్నార్థ క వాక్యం” అంటాము.

ఆశ్చర్యార్థ క వాక్యం :
ఉదా : ఆహా ! ఎంత బాగుందో !
ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థా న్ని సూచిస్తు న్నది. కాబట్టి ఈ వాక్యం “ఆశ్చర్యార్థ క వాక్యం”.

విధ్యర్థ క వాక్యం :
ఉదా : చేతులు కడుక్కో!
ఇది విధిగా చేయాలి అనే అర్థా న్ని సూచిస్తు ంది. అంటే చేయవలసిన పనిని విధిగా (తప్పనిసరిగా) చేయాలి
అనే అర్థా న్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థ క వాక్యం” అని పిలుస్తు న్నాము.

49
నిషేధార్థ క వాక్యం :
ఉదా : చాలా సేపు టీవీ చూడొ ద్దు .
ఈ వాక్యం టీవీ చూడటాన్ని నిషేధిస్తు న్నది. కాబట్టి ఇది “నిషేధార్థ క వాక్యం” అని పిలవబడుతుంది.

హేత్వర్థ క వాక్యం :
ఉదా : వర్షా లు లేక పంటలు పండలేదు.
ఈ వాక్యం మనకు రెండు విషయాలను తెలుపుతోంది. ఒకటి వర్షా లు లేవని. రెండు పంటలు పండలేదని.
ఐతే పంటలు పండకపో వడానికి కారణం మొదటి విషయం. వర్షా లు లేకపో వడం అనే మొదటి విషయం,
రెండో విషయానికి కారణం అవుతోంది. అంటే హేతువు అవుతోంది. ఇలా హేతువు అర్థా న్ని సూచించే
వాక్యం “హేత్వర్థ క వాక్యం.” హేతువు అంటే కారణం.

సందేహార్థ క వాక్యం :
ఉదా : రవి, పనిచేస్తా డో , చెయ్యడో ?
పై వాక్యం చదివితే, రవి పని చేయటం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది
కదా! ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను “సందేహార్థ క వాక్యాలు” అంటారు.

ఆశీర్వాదర్థ క వాక్యం :
ఉదా : నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు .
ఈ వాక్యము ఏ అర్థా న్ని సూచిస్తు న్నది? ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తు న్నట్లు కనబడుతోంది కదా! ఇలా
ఆశీర్వదిస్తు న్నట్లు అర్థా న్ని సూచించే వాక్యాలను “ఆశీర్వాదర్థ క వాక్యాలు” అంటారు.

ప్రా ర్థ నార్థ క వాక్యం :


ఉదా : దయచేసి పని చేయండి.
ఈ వాక్యం ఒక పనిని చేయమని ప్రా ర్థిస్తూ ఉంది. అంటే ప్రా ర్థ న అర్థా న్ని సూచిస్తు న్నది. కాబట్టి ఇది
“ప్రా ర్థ నార్థ క వాక్యం.”

అనుమత్యర్థ క వాక్యం :
ఉదా : లోపలికి రావచ్చు.
ఈ వాక్యం ఒక వ్యక్తికి అనుమతిని సూచిస్తు న్నది. అంటే ఇది “అనుమత్యర్థ క వాక్యం”. ఏదైనా ఒక పనిని
చేయటానికి అనుమతిని ఇచ్చే అర్థా న్ని సూచించే వాక్యం “అనుమత్యర్థ క వాక్యం”.

సామర్థ్యార్థ క వాక్యం :
ఉదా : కృష్ణ చెట్టు ఎక్కగలడు.
ఇది కృష్ణ కు చెట్టు ను ఎక్కే సామర్థ్యాన్ని సూచిస్తు న్నది. కాబట్టి ఇది “సామర్థ్యార్థ క వాక్యం.” ఒక వ్యక్తికి
గాని, వ్యవస్థ కు గాని, లేదా యంత్రా నికి గాని ఉన్న సమర్థ తను సూచించే అర్థ ం గల వాక్యాన్ని
“సామర్థ్యార్థ క వాక్యం” అని పిలుస్తా ము.

50
సంభావనార్థ క వాక్యం (indicative Sentence)
ఉదా : నేను రేపు తిరుపతి వెళ్ళవచ్చు.
నేడు వర్షం కురవవచ్చు.
పై వాక్యాలలో తిరుపతి వెళ్ళవచ్చు, వర్షం కురవవచ్చు అని ఊహిస్తు న్నాం కాబట్టి ఇవి సంభావనార్థ క
వాక్యాలు. సంభావన అనగా ఊహ. ఊహలు సూచించు క్రియలు. ఒక పని జరగవచ్చు అను ఊహను
సూచించును.

నిశ్చయార్థ క వాక్యం :
ఉదా : ధర్మరాజు హస్తినాపురమునకు రాజు.
ఇందులో ధర్మరాజు హస్తినకు రాజు అనే విషయాన్ని నిశ్చయించి (కచ్చితంగా) చెప్పబడినది కనుక ఇది
నిశ్చయార్థ క వాక్యం. ఒక విషయమును కచ్చితంగా తెలియజేయు వాక్యము.

పాఠ్యపుస్త కంలోని ప్రశ్నలు

1.​ అతడికి మంచి జరుగుగాక ! — ఆశీరర్థ క వాక్యం


2.​ ఇటువైపు నీవు రావద్దు . — నిషేదార్థ క వాక్యం
3.​ ఎల్ల మ్మ ఆ పని చేయగలదు. — సామర్థ్యార్థ క వాక్యం
4.​ మీరు మా ఇంటికి రావచ్చు. — అనుమత్యర్థ క వాక్యం
5.​ పదిరోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ? — ప్రశ్నార్థ క వాక్యం
6.​ అందరూ బడికి వెళ్ళండి. — విధ్యర్థ క వాక్యం
7.​ పాపాయి నడవగలదు. - సామర్థ్యార్థ క వాక్యం
వివరణ : ఈ వాక్యము పాపాయి యొక్క నడవగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తు ంది. కావున
సామర్థ్యార్థ క వాక్యమైనది.
8.​ పిల్లలూ మీరందరూ ఆడుకోవచ్చు. - అనుమత్యర్థ క వాక్యం
వివరణ : ఈ వాక్యము పిల్లలకు ఆడుకోవడానికి అనుమతి ఇవ్వడాన్ని తెలియజేస్తు ంది కాబట్టి
ఇది అనుమత్యర్థ క వాక్యమైనది.
9.​ వాన వస్తు ందో ! రాదో ! - సందేహార్థ క వాక్యం
వివరణ : ఈ వాక్యము వాన వస్తు ందో ? రాదో ! అన్న సందేహాన్ని వెలిబుచ్చుతోంది కాబట్టి ఇది
సందేహార్థ క వాక్యమైనది.
10.​ఆహా! ఆ చిత్రం ఎంత బాగుందో ! - ఆశ్చర్యార్థ క వాక్యం
వివరణ : ఈ వాక్యము చిత్రా న్ని చూసిన తర్వాత ఆశ్చర్యాన్ని తెలియజేస్తు ంది. కాబట్టి ఇది
ఆశ్చర్యార్థ క వాక్యమైనది.
11.​వర్షా లు కురవక పంటలు పండలేదు. - హేత్వర్థ క వాక్యం
వివరణ : ఈ వాక్యము పంటలు పండకపో వటానికి గల హేతువును (కారణాన్ని) తెలియజేస్తు ంది
కాబట్టి ఇది హేత్వర్థ క వాక్యమైనది. హేతువు అంటే కారణం.

ఉదాహరణలు :

1.​ నీవెందుకు వచ్చావు? - ప్రశ్నార్థ క వాక్యం


2.​ నీవు పాడవద్దు - నిషేధార్థ క వాక్యం

51
3.​ నేను తప్పక చదువుతాను. - నిశ్చయార్థ క వాక్యం
4.​ స్వామీ! నన్ను రక్షించు. - ప్రా ర్థ నార్థ క వాక్యం
5.​ రాము చదవగలడు. - సామర్థ్యార్థ క వాక్యం
6.​ మీరు రావద్దు . - నిషేధార్థ క వాక్యం
7.​ నీవు ఈ రాయిని ఎత్త గలవు. - సామర్థ్యార్థ క వాక్యం
8.​ భగవంతుడా! నన్ను కాపాడు. - ప్రా ర్థ నార్థ క వాక్యం
9.​ ఆహా ! ఈ పద్మాల చెరువు ఎంత బాగుంది. - ఆశ్చర్యార్థ క వాక్యం
10.​మీరు వెళ్ళవచ్చు. - అనుమత్యర్థ క వాక్యం
11.​ఈ రోజు జీతం వస్తు ందో ? రాదో ? - సందేహర్థ కం
12.​ఏరా! నువ్వెందుకు చదవలేదు? - ప్రశ్నార్థ కం
13.​సీత కీర్తనలను బాగా పాడగలదు. - సామర్థ్యార్థ కం
14.​చిరంజీవులారా! సుఖంగా జీవించండి! - ఆశీరర్థ కం
15.​దయచేసి మీరు పాట పాడండి. - ప్రా ర్థ నార్థ కం
16.​వాడు చదవక మార్కులు రాలేదు. - హేత్వర్థ కం
17.​కలకాలం వర్ధిల్లు ! - ఆశీరర్థ కం
18.​మీది ఏ ఊరు? - ప్రశ్నార్థ కం
19.​ఆహా! ఏమి అందం! - ఆశ్చర్యార్థ కం
20.​మీరు రావచ్చు. - అనుమత్యర్థ కం
21.​అక్కడకు వెళ్లవద్దు . - నిషేధార్థ కం
22.​వాడు తప్పక వస్తా డు. - నిశ్చయార్థ కం
23.​అందరూ రావచ్చు. - అనుమత్యర్థ కం
24.​వాడు వస్తా డో రాడో ! - సందేహార్థ కం
25.​దయచేసి కాపాడండి. - ప్రా ర్థ నార్థ కం
26.​అతను ఉపన్యాసం చెప్పగలడు. - సామర్థ్యార్థ కం
27.​అతన్ని నేనే ఉపన్యాసకునిగా ఉత్సాహపరిచాను. - ప్రేరణార్థ కం
28.​నీవు కలకాలం కీర్తి నార్జించు. - ఆశీరార్థ కం
29.​తను రాసుకొని ఉపన్యాసం ఇచ్చాడు. - ఆత్మార్థ కం
30.​వేదికను అలంకరించవచ్చు. - అనుమత్యర్థ కం
31.​రేవు అతను వస్తా డా? - ప్రశ్నార్థ కం
32.​ఆహా! అమ్మ బొ మ్మ ఎంత బాగుందో ! - ఆశ్చర్యార్థ కం
33.​దయచేసి జీవని వంటి వారిని ప్రో త్సహించండి. - ప్రా ర్థ నార్థ కం
34.​లలిత వంటివారు దేనినైనా సాధించగలరు. - సామర్థ్యార్థ కం
35.​ప్రత్యేక అవసరాలు గలవారికి సహాయం చేయండి. - విధ్యర్థ కం
36.​జీవని తండ్రి వంటి వారిని సమర్థించవద్దు . - నిషేధార్థ కం
37.​మీరుకూడా బొ మ్మలు వేయవచ్చు. - అనుమత్యర్థ కం
38.​సాధన చేసింది కనుక మంచి బొ మ్మ వేసింది. - హేత్వర్థ కం
39.​అమ్మా! జీవనీ! కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లు . - ఆశీరర్థ కం
40.​వీళ్ల కేం అధికారం ఉంది? - ప్రశ్నార్థ కం
41.​విశ్వనాథంగారి సలహాలతో లలితకు ధైర్యం వచ్చింది. - ప్రేరణార్థ కం
42.​తనకు తానే ధైర్యం చెప్పుకొంది. - ఆత్మార్థ కం

52
43.​లలిత తప్పక జీవనిని తీర్చిదిద్దా లనుకొంది. - నిశ్చయార్థ కం
44.​మీరు ఎందుకలా విచారిస్తా రు? - ప్రశ్నార్థ క వాక్యం
45.​మీ కాళ్ళు పట్టు కుంటా, ఆయన మనసు మళ్ళించండి. - ప్రా ర్థ నార్థ క వాక్యం
46.​తాంబో లం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి. - నిశ్చయార్థ క వాక్యం
47.​ఇలా ఇంగ్లీషు కాగితాలు ఏమన్నా నా మీద పారెయ్యండి. తర్జు మా చేసి పెడతాను. - సామర్థ్యార్థ క
వాక్యం
48.​ఇదంతా టోపీ వ్యవహారంలా కనబడుతోంది. - సందేహార్థ క వాక్యం
49.​మా కరటక శాస్త్రు లు అవకతవక మనిషి. - నిశ్చయార్థ క వాక్యం
50.​అబ్బీ ఒక తెనుగు పద్యం చదవరా? - ప్రశ్నార్థ క వాక్యం
51.​ప్రజలను చైతన్యపరచాలి. - విధ్యర్థ క వాక్యం
52.​ఐతే నన్ను ఆక్షేపణ చేస్తా వటే? - ప్రశ్నార్థ కం
53.​వెధవాయ్ ఈ మారైనా పాసయినావా! - సందేహార్థ కం
54.​మీ దయవల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మరచిపో ను. - ప్రా ర్థ నార్థ కం
55.​నా తరిఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పో లీసు పరీక్ష ప్యాసు చేయిస్తా ను. - సామర్థ్యార్థ కం
56.​మా ఇంట్లో భోజనం ఎంతమాత్రం వీలుపడదు. - నిషేధార్థ కం
57.​అన్నమయ్య సంకీర్తనలు విన్నావా? - ప్రశ్నార్థ క వాక్యం
58.​నేను పాటలు పాడగలను. - సామర్థ్యార్థ క వాక్యం
59.​సో మరితనం మంచిది కాదు. - నిషేధార్థ క వాక్యం
60.​ఇతరులను విమర్శించవద్దు . - నిషేధార్థ క వాక్యం

📳9177507710

53

You might also like